పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మ జన్మ ప్రకారము

  •  
  •  
  •  

3-273-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యోగమాయా విదూరుఁడై యుగ సహస్ర
కాలపర్యంత మఖిల లోములు మ్రింగి
పేర్చి మఱి కాలశక్త్యుపబృంహితమున
మత సృష్టిక్రియాకలాములఁ దగిలి.

టీకా:

యోగమాయా = యోగమాయ; విదూరుడు = దగ్గర దూరములు లేనివాడు {విదూరుడు - వ్యతిరిక్తమైన దూరము కలవాడు, దూరము దగ్గరలు లేనివాడు}; ఐ = అయి; యుగ = యుగముల; సహస్ర = వేయింటి; కాల = సమయము; పర్యంతము = అవధి వరకు; అఖిల = సమస్తమైన; లోకములున్ = భువనములను; మ్రింగి = మింగేసి; పేర్చి = అతిశయించి; మఱి = ఇంకను; కాల = కాలము యొక్క; శక్తి = శక్తి; ఉపబృంహితమున = సంవృద్దివలన; సమతన్ = చక్కగా; సృష్టి = సృష్టించుట అను; క్రియా = పనులు; కలాపంబులు = సమూహములలో; తగిలి = నిమగ్నుడై, ఆసక్తుడై.

భావము:

అలా యోగమాయకు కూడా దూరంగా వెయ్యి యుగాల పర్యంతం సమస్త లోకాలను తన కడుపులో దాచుకొని వెలుగొందుతూ ఆ పైన కాలమూ శక్తీ చక్కగా అభివ్యక్తం కాగా సమత్వం వహించి సృష్టికార్యం నిర్వహించటానికి ఆసక్తు డైనాడు.