పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మ జన్మ ప్రకారము

  •  
  •  
  •  

3-272-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నఘ! యేకోదకమై యున్నవేళ నం-
ర్నిరుద్ధానల దారు వితతి
భాతిఁ జిచ్ఛక్తి సమేతుఁడై కపట ని-
ద్రాలోలుఁ డగుచు నిమీలితాక్షుఁ
డైన నారాయణుం డంబు మధ్యమున భా-
సుర సుధాఫేన పాండుర శరీర
రుచులు సహస్ర శిరోరత్నరుచులతోఁ-
జెలమిసేయఁగ నొప్పు శేషభోగ

3-272.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్పమునఁ బవ్వళించి యల్ప తత్త్వ
దీప్తిఁ జెన్నొందఁగా నద్వితీయుఁ డగుచు
భిరతుం డయ్యుఁ గోర్కుల యందుఁ బాసి
ప్రవిమలాకృతి నానందరితుఁ డగుచు.

టీకా:

అనఘ = పుణ్యుడా; ఏకో = ఒకే; ఉదకము = జలమయము; ఐ = అయ్యి; ఉన్న = ఉన్న; వేళ = సమయమున; అంతర్ = లోపల; నిరుద్ధ = అడ్డగించబడిన; అనిల = అగ్ని; దారు = కట్టెల; వితతి = మోపు; భాతిన్ = వలె; చిత్ = చైతన్య; శక్తిన్ = శక్తితో; సమేతుడు = కూడినవాడు; ఐ = అయ్యి; కపట = కపట; నిద్రా = విద్రతో; లోలుడు = మునిగినవాడు; అగుచున్ = అవుతూ; నిమీలిత = మూసిన; ఆక్షుడు = కన్నులు కలవాడు; ఐన = అయినట్టి; నారాయణుండు = నారాయణుడు {నారాయణుడు - నారములు (నీళ్ళు) నందు వసించువాడు, విష్ణువు}; అంబు = నీటి; మధ్యంబునన్ = మధ్యలో; భాసుర = ప్రకాశించుచున్న; సుధా = అమృతము; ఫేన = నురగ వలె; పాండు = తెల్లని; శరీర = దేహ; రుచులు = ఛాయ; సహస్ర = వేయి; శిరస్ = తలలపై నున్న; రత్న = రత్నముల; రుచుల = కాంతుల; తోన్ = తో; చెలిమి = స్నేహము; చేయగన్ = చేస్తున్నట్లు; ఒప్పు = ఒప్పిఉండే; శేష = ఆదిశేషుని; భోగ = శరీరపు; తల్పమున = పాన్పున; పవ్వళించి = శయనించి;
అనల్ప = అధికమైవ; తత్త్వ = తత్త్వము యొక్క; దీప్తిన్ = ప్రకాశముతో; చెన్నొందగ = అందము అతిశయించగా; అద్వితీయుండు = అసమానుడు {అద్వితీయుడు - ఇంకొకరు (పోల్చతగ్గవారు) లేనివాడు, అసమానుడు}; అగుచున్ = అవుతూ; అభిరతుడు = మిక్కిలి కుతూహలము (విష్ణుభక్తి యందు) కలవాడు; అయ్యు = అయినప్పటికిని; కోర్కులన్ = కోరికల; అందు = ఎడల; పాసి = తొలగి; ప్రవిమల = మిక్కిలి నిర్మలమైన; ఆకృతిన్ = ఆకారముతో; ఆనంద = ఆనందము; భరితుడు = నిండినవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

ఓ విదురా! పూర్వం ప్రళయనమయంలో విశ్వమంతా జలమయంగా ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుణ్ణి పాన్పుగా చేనుకొని సముద్రమధ్యంలో పవ్వళించాడు. ఆ ఆదిశేషుడు స్వచ్ఛమైన అమృతపు నురుగులవంటి తెల్లనైన శరీరం కలవాడు. అతని తెల్లని శరీర కాంతులు అతని వేయి తలలపై తళతళలాడే రత్నాల కాంతులతో చెలిమి చేస్తున్నట్లుగా వెలుగొందాయి. నారాయణుడు తన కడుపులో అగ్నిని దాచుకొన్న కట్టెలా లోపల చైతన్యశక్తి కలవాడై ఉన్నాడు. అనంతమైన తత్త్వదీప్తితో అద్వితీయుడై ఆనందమయుడై కపటనిద్ర నభినయిస్తూ కన్నులు మూసుకొని ఉన్నాడు. కుతూహలం కలిగి కూడా కోర్కెలు లేనివానిలా నిష్కళంకమైన స్వరూపంతో విరాజిల్లాడు.