పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-270-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీ కిప్పుడు వివరించెద
నార్ణింపుము సరోరుహాక్షుండగు సు
శ్లోకుని చరితామృతపరి
షేకుఁడ వై ముదము గదురఁ జెలగుము విదురా!

టీకా:

నీకున్ = నీకు; ఇప్పుడు = ఇప్పుడు; వివరించెదన్ = వివరముగా చెప్పెదను; ఆకర్ణింపుము = వినుము; సరోరుహాక్షుండు = పద్మాక్షుడు {సరోరుహాక్షుడు - సరోరుహ (సరసున పుట్ట పద్మము) వంటి అక్షులు (కన్నులు) కలవాడు, విష్ణువు}; అగు = అయినట్టి; సుశ్లోకుని = విష్ణుని {సుశ్లోకుడు - మంచిగా కీర్తింపబడువాడు, విష్ణువు}; చరితము = వర్తనలు అను; అమృత = అమృతముచే; పరి = చక్కగా; షేకుడవు = మునిగినవాడవు; ఐ = అయి; ముదమున్ = సంతోషము; కదురన్ = కలుగగా; చెలగుము = చెలరేగుము; విదురా = విదురుడా.

భావము:

ఓ విదురా! నేను ఆ భాగవతాన్ని ఇప్పుడు నీకు వివరంగా చెబుతున్నాను. ఉత్తమశ్లోకుడైన పురుషోత్తముని చరిత్ర అనే అమృత వర్షంలో తడిసినవాడవై హర్షోత్కర్షంతో ఆకర్ణించు.