పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-265-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మ్మహాభాగవతామ్నాయ మొకనాఁడు-
గైకొని పాతాళలో మందు
ప్రతీకజ్ఞానియై వాసుదేవాఖ్యఁ-
బొలుచు సంకర్షణమూర్తి దివ్య
పురుషుండు దనుఁదాన బుద్ధిలోఁ జూచుచు-
లితధ్యాన ముకుళితనేత్రుఁ
డై సనందాభ్యుదయార్థంబు గనువిచ్చి-
చూచిన వారు సంస్తుతు లొనర్ప

3-265.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మర గంగావగాహనులై యహీంద్ర
న్య లార్ధ్రజటాబంధలిత లగుచు
ర్తృ వాంఛానుబుద్ధి నప్పరమపురుషుఁ
దియ నేతెంచి తత్పాదమలయుగము.

టీకా:

ఆ = ఆ; మహా = గొప్ప; భాగవత = భాగవతము అను; ఆమ్నాయమున్ = వేదమును; ఒకనాడు = ఒకరోజు; కైకొని = స్వీకరించి; పాతాళ = పాతాళ; లోకమున్ = లోకము; అందున్ = లో; అప్రతీక = సంపూర్ణ; జ్ఞాని = జ్ఞాని; ఐ = అయ్యి; వాసుదేవ = వాసుదేవుడు అను; ఆఖ్యన్ = పేరుతో; పొలుచు = ప్రసిద్దికెక్కిన; సంకర్షణ మూర్తి = విష్ణుమూర్తి {సంకర్షణుడు - నామాదులను కరిగించుకున్న వాడు, విష్ణువు}; దివ్య = దివ్యమైన; పురుషుండు = పురుషుడు; తనున్ = తనను; తాను = తాను; బుద్ధిన్ = మనసు; లో = లో; చూచుచున్ = చూస్తూ; సలలిత = చక్కటి; ధ్యాన = ధ్యానమునందు; ముకుళిత = మూసిన; నేత్రుడు = కన్నులు కలవాడు; ఐ = అయ్యి; సనంద = సనందాదుల; అభ్యుదయ = వృద్ధి; అర్థంబున్ = కొరకు; కనున్ = కళ్ళు; విచ్చి = విప్పికొని; చూచినన్ = చూసినప్పుడు; వారు = వారు; సంస్తుతులు = చక్కటి స్తుతులు; ఒనర్పన్ = చేయగా; అమర = దేవ; గంగా = గంగ యందు; ఆవగాహనులు = స్నానము చేయువారు; ఐ = అయ్యి;
అహి = సర్పము లలో; ఇంద్ర = శ్రేష్ఠులైన; కన్యలు = కన్యలు; ఆర్ద్ర = తడిసిన; జటా = జడలు; బంధ = చుట్టులు; కలితలు = కలిగినవారు; అగుచున్ = అవుతూ; భర్తృ = భర్తగా కావలెనను; వాంఛా = కోరికతో; అను = కూడిన; బుద్ధిన్ = బుద్ధితో; ఆ = ఆ; పరమపురుషున్ = విష్ణుమూర్తి; కదియన్ = దగ్గరకు; ఏతెంచి = వచ్చి; తత్ = అతని; పాద = పాదములు అను; కమల = కమలముల; యుగము = జంటను.

భావము:

వాసుదేవుడు అనే పేరుతో ప్రకాశించేవాడూ, కేవల జ్ఞానస్వరూపుడూ, దివ్యపురుషుడు అయిన సంకర్షణుడు ఒకనాడు వేదసారమైన భాగవతాన్ని పాతాళలోకంలోనికి తీసుకొనిపోయాడు. తన మనస్సులో తన్ను తానే చూచుకొంటూ తదేక ధ్యానంలో కొద్దిసేపు కన్నులు మూసుకున్నాడు సంకర్షణుడు. సనక సనందనాదుల అభ్యుదయం కోరిన వాడై కన్నులు విప్పి చూచాడు. సనక సనందనాదులు సంస్తుతులు చేశారు. అంతలో ఆకాశగంగలో స్నానం చేసిన నాగకన్యకలు తడిసిన జడలతో జుట్టుముడులతో అచ్చటికి వచ్చారు. ఆ నాగకన్యలు ఆ దివ్యపురుషుడే తమకు భర్త కావాలని భావించారు. ఆ పరమపురుషుని సమీపించి ఆయన పాదపద్మాలను సేవించారు.