పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-253-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రాయుధు సౌందర్య ప
రాక్రమముఖ గుణములును ధరామరముఖ వ
ర్ణక్రమములు నాశ్రమధ
ర్మక్రియలును శీలవృత్తతభావములున్.

టీకా:

చక్రాయుధు = విష్ణుని {చక్రాయుధుడు - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు}; సౌందర్య = సౌందర్యము; పరాక్రమ = పరాక్రమము; ముఖ = మొదలగు ముఖ్యమైన; గుణములను = గుణములను; ధరామర = బ్రాహ్మణులు {ధరామరులు - భూమి (ధర)కు అమరులు (దేవతలు), బ్రాహ్మణులు}; ముఖ = మొదలగు; వర్ణ = చతుర్వర్ణముల {చతుర్వర్ణములు - బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నాలుగు వర్ణములు}; క్రమములున్ = విధమును; ఆశ్రమ = చతురాశ్రమముల {చతురాశ్రమములు - బ్రహ్మచర్య గృహస్త వానప్రస్త సన్యాసములు నాలుగు ఆశ్రమములు}; ధర్మ = ధర్మములు; క్రియలును = ఆచరించవలసిన పనులును; శీల = శీలము; వృత్త = ప్రవర్తన; భావములున్ = అభిప్రాయములును.

భావము:

జగన్నాథుడూ, చక్రధరుడూ అయిన విష్ణుని సౌందర్యం, పరాక్రమం మొదలైన సుగుణాలను వెల్లడించు, బ్రాహ్మణులు మొదలైన నాలుగు వర్ణాలనూ, బ్రహ్మచర్యం మొదలైన నాలుగు ఆశ్రమాలనూ, వారివారి ఆయా ధర్మాలనూ, కర్తవ్యాలనూ, స్వభావాలనూ, నడవడులనూ నాకు తెలుపు.