పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-249-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వానిభేదంబులును మనువంశములును
నుకులాధీశ్వరులునుఁ దన్మనుకులాను
రితములునే విభూతినే జాడ దీని
నింతయును బుట్టఁజేసె? నా కెఱుఁగఁ బలుకు.

టీకా:

వాని = వాటి; భేదంబులును = రకములను; మను = మనువుల {మనువులు - పద్నాలుగురు, 1 స్వాయంభువుడు 2 స్వారోచిషుడు 3 ఉత్తముడు 4 తామసుడు 5 రైవతుడు 6 చాక్షుసుడు 7 వైవస్వతుడు 8 సూర్యసావర్ణి 9 దక్షసావర్ణి 10 బ్రహ్మసావర్ణి 11 ధర్మసావర్ణి 12 రుద్రసావర్ణి 13 రౌచ్యుడు 14 భౌచ్యుడు ( పాఠాంతరములు కూడ కలవు) ప్రస్తుతము వైవశ్వతమన్వంతరము జరుగుచున్నది}; వంశములును = వంశములును; మను = మనువుల; కుల = కులములకు; అధీశ్వరులును = అధిపతులును; తత్ = ఆ; మను = మనువుల; అనుచరితములున్ = వర్తనములును; ఏ = ఏ; విభూతిన్ = ఐశ్వర్యమును; ఏ = ఏ; జాడన్ = మార్గమున; దీనిని = దీనిని; అంతయున్ = అంతనూ; పుట్టన్ = పుట్టునట్లు; చేసెన్ = చేసెను; నాకున్ = నాకున్; ఎఱుగన్ = తెలియునట్లు; పలుకు = చెప్పుము.

భావము:

ఆ సృష్టిభేదాలనూ, మనువంశాలనూ, మనువంశాల అధిపతులనూ, వంశానుచరితాలనూ భగవంతుడు ఎటువంటి మహామహిమతో ఎలా పుట్టించాడో నాకు తెలిసేలా చెప్పు.