పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-246.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భువన జాలంబు లలజడి బొరయకుండుఁ
బ్రాణదశకంబు నింద్రియార్థములు నింద్రి
యాధిదైవతములుఁ గూడ నఘ త్రివిధ
గుచు విప్రాది వర్ణము య్యె నందు.

టీకా:

ఇంద్రియంబులన్ = ఇంద్రియములు; తోడన్ = తో; ఎలమిన్ = కుతూహలముతో; ఒప్పెడి = ఒప్పుతుండే; మహత్ = మహత్తు; ఆదులన్ = మొదలగువానిచే; ఇతరేతర = ఒకదానితోనొకటి; అనుషంగముగన్ = దగ్గరగా ఉండునట్లు; చేసి = చేసి; వాని = వాటి; అందున్ = అందు; ఒగిన్ = క్రమముగా; విరాడ్దేహంబున్ = విరాట్విగ్రహమును; పుట్టించి = సృష్టించి; అందున్ = అందులో; చేపట్టి = స్వీకరించి; తాను = తను; వసియించున్ = నివసించు; అతడు = అతడు; వరుసన్ = క్రమముగ; సహస్ర = వేలకొలది; సంఖ్యాకంబులు = సంఖ్యలలో; అగు = ఉండే; మస్తక = తలలు; అంఘ్రి = కాళ్ళు; బాహు = చేతులు; కలిత = కలిగిన; సత్పురుషునిగా = విష్ణునిగా {సత్పురుషుడు - నిజమైన పురుషుడు, విష్ణువు}; బ్రహ్మవాదులు = బ్రహ్మతత్వ ఉపదేశించువారు; పలుకుదురు = చెప్పుదురు; ఆ = ఆ; విరాట్ప్రభువున్ = విష్ణుమూర్తి {విరాట్ప్రభువు - విరాట్టు స్వరూపమై ప్రభావము చూపువాడు, విష్ణువు}; అందున్ = అందు;
భువన = లోకముల; జాలంబులున్ = గుత్తులు; అలజడిన్ = కలవరములు; పొరయక = పొందకుండగ; ఉండు = ఉండును; ప్రాణ = ప్రాణములు {ప్రాణదశకము - 1 ప్రాణము 2 అపానము 3 వ్యానము 4 ఉదానము 5 సమానము 6 నాగము 7 క్రుకరము 8 కూర్మము 9 దేవదత్తము 10 ధనంజయము అను దశప్రాణవాయువులు}; దశకంబున్ = పదియును; ఇంద్రియ = ఇంద్రియములకు; అర్థములు = అర్థమగునవి; ఇంద్రియ = ఇంద్రియములకు; అధి = అధిపతులు అగు; దైవతములు = దేవతలు; కూడన్ = కూడా; అనఘా = పుణ్యవంతుడా; త్రివిధము = త్రిగుణములతో {త్రిగుణములు - సత్వాది ,సత్త్వరజస్తమో గుణములు}; అగుచున్ = కూడినవి అవుతూ; విప్ర = బ్రాహ్మణులు {విప్రాది - చతుర్వర్ణములు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు}; ఆది = మొదలగు; వర్ణములు = వర్ణములు; అయ్యెన్ = ఆయెను; అందున్ = అందులో.

భావము:

భగవంతుడు ఇంద్రియాలతో కూడిన మహదాదులకు పరస్పర సంబంధం కల్పించి విరాట్ దేహాన్ని పుట్టించి అందు నివాసం చేస్తూ ఉంటాడు గదా బ్రహ్మవేత్తలైనవారు ఆ పరాత్పరుణ్ణి సహస్రశీర్షునిగా సహస్రపాదునిగా సహస్రబాహునిగా పేర్కొంటున్నారు. ఆ విరాట్పురుషునిలో అఖిల లోకాలూ అలజడి పొందకుండా ఉంటున్నాయి. అటువంటి విరాటం స్వరూపం నుండే పది ప్రాణాలూ, ఇంద్రియగోచరా లయిన విషయాలూ, ఇంద్రియాల కధిపతులైన దేవతలూ, మూడువిధాలైన బ్రాహ్మణాది వర్ణాలూ ఏర్పడ్డాయి.