పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-242-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రునకు నాత్మదేహజ గుణంబులఁ బాపఁగనోపు పంకజో
చరణారవింద మహిస్ఫుటభక్తియ యింద్రియంబు లీ
శ్వ విషయంబు లైన మది సంచిత నిశ్చలతత్త్వమైనచో
సిజనేత్రుకీర్తనమె చాలు విపద్దశలన్ జయింపఁగన్.

టీకా:

నరునకున్ = మానవునకు; ఆత్మ = మనసున; దేహ = దేహమున; జ = జనించిన; గుణంబులన్ = గుణములను; పాపగన్ = పోగొట్ట; ఓపు = కలది; పంకజోదర = విష్ణుని {పంకజోదరుడు - ఉదరమున పద్మము (పంకజము) కలవాడు, విష్ణువు}; చరణ = పాదములు అను; అరవింద = పద్మములు యొక్క; మహిత = గొప్ప; స్ఫుట = గట్టి; భక్తియ = భక్తి మాత్రమే; ఇంద్రియంబులు = ఇంద్రియములు; ఈశ్వర = ఈశ్వరుని; విషయంబులు = సంబంధించినది; ఐన = అయిన; మదిన్ = మనసు; సంచిత = కూడబెట్టబడిన; నిశ్చల = నిశ్చలమైన; తత్త్వము = స్వభావము కలది; ఐనన్ = అయిన; చోన్ = ఎడల; సరసిజనేత్రు = విష్ణుని {సరసిజనేత్రుడు - పద్మముల(సరసున పుట్టునది) వంటి నేత్రములు కలవాడు, విష్ణువు}; కీర్తనమె = కీర్తించుటయే; చాలు = చాలు; విపద్దశలన్ = ఆపదల సమయమును {విపత్తు – ఆపద,ఇడుము, రోగములు అవమానములు, మృత్యువు, అప్పులు మొదలగునవి, వీనికి కారణములు ఆదిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికములు}; జయింపగన్ = దాటుటకు.

భావము:

మానవునకు తన శరీరం నుండి పుట్టిన గుణాలను పోగొట్టడానికి నారాయణుని పాదసరోజాలమీద విశేషించి విస్పష్టమైన భక్తి ఒకటే చాలు. అలాగే ఆపదలను బాపుకొనడానికి పంచేంద్రియాలను భగవంతుని అధీనంచేసి మనస్సును, చలించని ఉన్నతమైన ఏకాగ్రభావంతో నింపి ఆ సరోజాక్షుని సంకీర్తనం చేస్తే చాలు.