పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-233-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మ్మాయచేత నీ ఖిలంబు సృజియించి-
పాలించి పొలియించి రమపురుషు
నఘాత్మ! దేశకాలావస్థ లందును-
నితరుల యందునహీనమైన
జ్ఞాస్వభావంబుఁ బూని యాప్రకృతితో-
నెబ్భంగిఁ గలసెఁ దానేక మయ్యుఁ
గోరి సమస్తశరీరంబు లందును-
జీవరూపమున వసించి యున్న

3-233.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జీవునకు దుర్భరక్లేశసిద్ధి యెట్టి
ర్మమున సంభవించెను? డఁగి నాదు
చిత్త మజ్ఞాన దుర్గమస్థితిఁ గలంగి
ధికఖేదంబు నొందెడు నఘచరిత!

టీకా:

ఆ = ఆ; మాయ = మాయ; చేతన్ = చేత; ఈ = ఈ; అఖిలంబున్ = సమస్తమును; సృజియించి = సృష్టించి; పాలించి = పాలించి; పొలియించి = నాశముజేసి; పరమపురుషుండు = విష్ణుమూర్తి; అనఘాత్మ = పుణ్యవంతుడా; దేశ = ప్రదేశము; కాలము = కాలముల; అవస్థలు = స్థితి విశేషములు; అందున్ = అందును; ఇతరుల = ఇతరముల; అందున్ = అందును; అహీనము = గొప్పది; ఐన = అయిన; జ్ఞాన = విజ్ఞానము కల; స్వభావంబున్ = లక్షణములను; పూని = ధరించి, సంకల్పించి; ఆ = ఆ; ప్రకృతి = ప్రకృతి; తోన్ = తోటి; ఎబ్భంగిన్ = ఏవిధముగ; కలసెన్ = కలిసెను; తాన్ = తను; ఏకము = ఒకడే; అయ్యున్ = అయినప్పటికిని; కోరి = కోరి; సమస్త = సమస్తమైన; శరీరంబులు = దేహములు; అందునున్ = అందును; జీవ = జీవము యొక్క; రూపమున = రూపములో; వసించి = నివసిస్తూ; ఉన్న = ఉన్నట్టి;
జీవున = జీవున; కున్ = కు; దుర్భర = భరింపలేని; క్లేశ = బాధలు; సిద్ధి = కలుగుట; ఎట్టి = ఎటువంటి; కర్మమున = కర్మములవలన; సంభవించెన్ = కలిగివవి; కడగి = పూని; నాదు = నాయొక్క; చిత్తము = మనసులో; అజ్ఞాన = అజ్ఞానమును; దుర్గమ = దాటలేని; స్థితిన్ = పరిస్థితికి; కలంగి = కలతపడి; అధిక = మిక్కిలి; ఖేదంబును = బాధను; ఒందెడున్ = పొందును; అనఘచరిత = పుణ్యవర్తన.

భావము:

ఓ పుణ్య మైత్రేయుడా! తన మాయచేత ఈ లోకాలన్నింటినీ సృష్టించి, పాలించి, లయంచేసే ఆ పరమాత్ముడు దేశం కాలం మొదలైన అవస్థలను కల్పించుతున్నాడు. ఇతరులను సృష్టించి వారియందు అఖండమైన జ్ఞానంతో వర్తిస్తున్నాడు. కేవలం జ్ఞాన స్వరూపుడైన భగవంతుడు ఆ ప్రకృతితో తాను ఏ విధంగా కలసి ఉంటాడు? దేవుడు ఒక్కడై ఉండి అన్ని శరీరాల్లోనూ జీవుడూగా వసించి ఉంటున్నాడు గదా; దేవుడైన జీవునకు భరింపరాని గర్భనరకం వంటి కష్టాలు ఏ కర్మ వల్ల సంభవిస్తున్నాయి? ఈ సందేహాలతో నామనస్సు చాల వ్యాకుల పడుతున్నది. ఈ అజ్ఞానావస్థ నుండి బయట పడలేక తల్లడిల్లి పోతున్నాను.