పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-231-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"అగుణున కవికారునకున్
దవనోద్భవ వినాశ త్కర్మములుం
గులీలఁ బెట్టు లాతఁడు
గుణుండై యుండు టెట్టు సౌజన్యనిధీ!"

టీకా:

అగుణున్ = గుణములు లేనివాని; కిన్ = కి; అవికారున్ = వికారములు లేని వాని {వికారము - మానసిక లేదా రూపములలో కలుగు మార్పు లేదా సక్రమత లోని నష్టము}; కున్ = కి; జగత్ = లోకములను; అవన = రక్షించుట; ఉద్భవన = పుట్టుట; వినాశ = నశింపచేయుట అను; సత్ = మంచి; కర్మములున్ = కర్మములను; తగు = తగు; లీలన్ = లీలలు; ఎట్టులు = ఎలా చేయును; అతడు = అతడు; సగుణుండు = గుణములతో కూడినవాడు; ఐ = అయి; ఉండుట = ఉండుట; ఎట్టు = ఏలా అగును; సౌజన్య = మంచితనమునకు; నిధీ = నివాసమైనవాడ.

భావము:

ఓ సౌజన్యమూర్తీ! మైత్రేయా! భగవంతుడు నిర్గుణ పరబ్రహ్మ కదా; మరి ఈ లోకాలన్నీ పుట్టించటం రక్షించటం లయం చెయ్యటం ఆయన క్రీడావిశేషాలు కదా; నిర్గుణుడైన వానికి ఈ క్రీడలూ, ఈ లీలలూ ఎలా పొసగుతాయి? నిర్గుణుడైన ఈశ్వరుడు సగుణుడుగా ఎలా ఉంటాడు? ఇది పరస్పర విరుద్ధంగా లేదా?”