పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-225-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రుతులు దమలోన వివరించి చూచి పుండ
రీలోచను నుత్తమశ్లోచరితు
మరగణవంద్యమానపాదాబ్జయుగళు
వెదకి కనుఁగొనలే వండ్రు విమలమతులు.

టీకా:

శ్రుతులు = వేదములు కూడ; తమ = తమ; లోనన్ = లో; వివరించి = విచారించి; చూచి = చూసి; పుండరీకలోచనున్ = విష్ణుని {పుండరీకలోచనుడు -పుండరీకముల (పద్మముల) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; ఉత్తమశ్లోకచరితున్ = విష్ణుని {ఉత్తమశ్లోకచరితుడు - మంచిగా కీర్తింపబడు వర్తన కలవాడు, విష్ణువు}; అమరగణవంద్యమానపాదాబ్జయుగళు = విష్ణుని {అమరగణవంద్యమానపాదాబ్జయుగళుడు - దేవతాసమూహముల చే నమస్కరింపదగ్గ పాదములు అను పద్మముల జంట కలవాడు, విష్ణువు}; వెదకి = వెదకి; కనుగొనన్ = తెలుసుకొన; లేవు = లేవు; అండ్రు = అందురు; విమల = నిర్మలమైన; మతులు = బుద్ధి కలవారు.

భావము:

ఉత్తమశ్లోకుడూ ఉదారచరితుడూ, ముక్కోటి దేవతలు మ్రొక్కే చక్కని పాదపద్మాలు గలవాడూ అయిన ఆ దేవాది దేవుడిని వేదాలు కూడా తమలో తాము వితర్కించి, విచారించి వెదకి పూర్తిగా తెలుసుకోలేవని విజ్ఞులంటారు.