పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-204-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నినఁ బ్రసన్నుఁడై రి మహదాదుల-
న్యోన్యమిత్రత్వ మందకున్న
తమున నిఖిల జత్కల్పనాశక్తి-
వొడమకుండుటఁ దన బుద్ధి నెఱిఁగి
కైకొని కాలవేమున నుద్రేకంబు-
నొందిన ప్రకృతితోఁ బొంది నిజబ
ము నిల్పి తా నురుక్రముఁ డన సప్తవిం-
తితత్త్వముల యందు మత నొక్క

3-204.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి ప్రవేశించి యాతత్త్వవ్యగుణము
నందు జ్యేష్ఠానురూపంబు లరఁ జెంది
యొకటి నొకటినిఁ గలయక యుండి విశ్వ
న నెఱుఁగని యాతత్త్వనియమునకు.

టీకా:

అనినన్ = అనగా; ప్రసన్నుడు = సంతోషించినవాడు; ఐ = అయ్యి; హరి = విష్ణుమూర్తీ; మహత్ = మహత్తు; ఆదుల = మొదలగునవాటి; కున్ = కు; అన్యోన్య = వానిలోవానికి; మిత్రత్వము = సహకారము; అందక = కలుగక; ఉన్న = ఉన్నట్టి; కతమున = కారణముచేత; నిఖిల = సమస్తమైన; జగత్ = విశ్వము; కల్పనా = సృష్టించుటకు; శక్తి = సామర్థ్యము; పొడమక = ఏర్పడక; ఉండుటన్ = ఉండుటను; తన = తనయొక్క; బుద్ధిన్ = మనసున; ఎఱిగి = తెలిసికొని; కైకొని = సంకల్పించి; కాల = కాలముయొక్క; వేగమునన్ = గమనము వలన; ఉద్రేకంబున్ = ఉద్రేకమును; ఒందిన = పొందిన; ప్రకృతి = ప్రకృతి; తోన్ = తో; పొంది = కూడి; నిజ = తనయొక్క; బలము = శక్తి; నిల్పి = నిలిపి; తాన్ = తను; ఉరుక్రముడు = ఉరుక్రముడు {ఉరుక్రముడు - మిక్కిలి ఆక్రమించిన వాడు, విష్ణువు}; అనన్ = అనగా; సప్తవింశతి = ఇరవైయేడు {సప్తవింశతితత్త్వములు - 5 పంచభూతములు 5 పంచతన్మాత్రలు 5 పంచకర్మేంద్రియములు 5 పంచజ్ఞానేంద్రియములు 4 చతురంతఃకరణములు మరియు 1 పురుషుడు 1 ప్రకృతి 1 మహత్తు మొత్తము 5+5+5+5+4+1+1+1 - 27}; తత్త్వముల = తత్త్వముల {పంచభూతములు - 1 పృథివి 2 జలము 3 అగ్ని 4 వాయువు 5 ఆకాశము}; అందున్ = లోను {పంచతన్మాత్రలు - 1 శబ్దము 2 స్పర్శము 3 రూపము 4 రుచి 5 వాసన}; సమతన్ = సమత్వముతో {పంచకర్మేంద్రియములు - 1 నోరు 2 కాళ్ళు 3 చేతులు 4 మల అవయవము 5 మూత్ర అవయవము}; ఒక్క = ఒక {పంచజ్ఞానేంద్రియములు - 1 కళ్ళు 2 చెవులు 3 ముక్కు 4 నాలుక 5 చర్మము}; పరి = మారు {చతురంతఃకరణములు - 1 మనస్సు 2 బుద్ధి 3 చిత్తము 4 అహంకారము};
ప్రవేశించి = ప్రవేశించి; ఆ = ఆ; తత్త్వ = తత్త్వములయొక్క; భవ్య = శుభకరమైన; గుణము = గుణముల; అందున్ = లోపల; జేష్ఠ = పెద్ద చిన్న; అను = అనే; రూపములు = రూపములు; అలరన్ = చక్కగ ఏర్పడునట్లుగా; చెంది = పొంది; ఒకటిన్ = ఒకటిని; ఒకటిని = ఒకటి; కలయక = సహకరించుకొనక; ఉండి = ఉండి; విశ్వ = లోకములను; రచన = సృష్టించు; ఎఱుగని = తెలియని; ఆ = ఆ; తత్త్వ = తత్త్వ; నిచయమున = సమూహమున; కున్ = కు.

భావము:

ఇలా స్తోత్రం చేయగా విని శ్రీహరి సంతోషించాడు. మహత్తు మొదలగు తత్త్వాలకు పరస్పరం పొత్తు కుదరక పోవడం వల్ల సమస్తజగత్తును సృష్టించే శక్తి లభ్యం కాకపోవటాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు కాలవేగంతో ఉద్రేకం పొందిన ప్రకృతితోకూడి నిజశక్తిని నిక్షేపించి ఉరుక్రముడై ఇరవైయేడు తత్త్వాలలో ఏకకాలంలో తాను ప్రవేశించి ఘన పరిణామరూపుడై విడివిడీగా ఉన్న వానికి ఏకత్వం కలిగించాడు. పంచభూతాలు-పంచతన్మాత్రలు-పది ఇంద్రియాలు-కాలం, ప్రకృతి, మహత్తు, మనస్సు, బుద్ధి, చిత్తం అహంకారం అనే అంతఃకరణ చతుష్టయం. ఇవి ఇరువదియేడు తత్త్వాలు.

3-205-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు విశ్వనిర్మాణనిపుణత్వంబు నెఱుంగం జూపుచు నన్నింటికి నన్యోన్యతం గల్పించి తన యనుగ్రహంబునం బ్రేరితంబై కానంబడి క్రియాసామర్థ్యంబునం జెన్నొందిన తత్త్వవితానంబు దేవప్రేరితంబయి స్వకీయంబులగు నంశంబులచేతం బుట్టించిన విరాడ్విగ్రహంబై తత్త్వవితతి దమ యందుఁ జెందిన పుండరీకాక్షుని కళాంశంబున నొకటి కొకటికి నైక్యంబు వాటిల్లి పరిణతంబై రూపాంతరంబునుం జెందె; నే తత్త్వంబునఁ జరాచరలోక పుంజంబులు నిండి యుండు, నా హిరణ్మయంబైన విరాడ్విగ్రహంబు నొందిన పురుషుండు సర్వజీవసమేతుండై యుండె; నంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; విశ్వ = విశ్వమును; నిర్మాణ = నిర్మించు; నిపుణత్వంబున్ = నైపుణ్యము; ఎఱుగన్ = తెలియునట్లు; చూపుచున్న = చూపిస్తున్న; అన్నింటి = అన్నింటి; కిన్ = కి; అన్యోన్యతన్ = సహకారము {అన్యోన్యత - వానిలో అవి అనుకూలించుట, సహాయపడుట}; కల్పించి = ఏర్పరచి; తన = తన యొక్క; అనుగ్రహంబు = అనుగ్రహమువలని; ప్రేరితంబు = ప్రేరింపబడినది; ఐ = అయి; కానంబడి = కనబడి, ఏర్పడి; క్రియా = పనిచేయగల; సామర్థ్యంబునన్ = సామర్థ్యముతో; చెన్నొందిన = ప్రకాశించిన; తత్త్వ = తత్త్వముల; వితానము = సమూహము; దేవ = దేవునిచే; ప్రేరితంబు = ప్రేరింపబడినవి; అయి = అయి; స్వ = తనచేత; కీయంబులు = చేయబడినవి; అగు = అయిన; అంశంబులన్ = విషయముల; చేతన్ = చేత; పుట్టించినన్ = పుట్టించగా; విరాట్విగ్రహంబు = విశ్వరూపము; ఐ = అయి; తత్త్వ = తత్త్వముల; వితతి = గుంపు; తమ = తమ; అందున్ = లో; చెందిన = చెందగా; పుండరీకాక్షుని = విష్ణుని {పుండరీకాక్షుడు - పుండరీకములు (పద్మములు) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; కళా = కళ యొక్క; అంశంబున్ = అంశములలో; ఒకటి = ఒకటి; కిన్ = కి; ఒకటి = ఇంకొకటి; కిన్ = కి; ఐక్యంబున్ = సహకారము, ఐకమత్యము; వాటిల్లి = సంభవించి; పరిణతంబు = పక్వము చెందినవి; ఐ = అయి; రూప = రూపమునందు; అంతరంబునున్ = మార్పును; చెందెన్ = చెందెను; ఏ = ఏ; తత్త్వంబున్ = తత్త్వమునను; ఏనియున్ = అయినదో; చరా = కదలగలవియును; అచర = కదలలేనివియును; లోక = లోకముల; పుంజంబులు = సమూహములు; నిండి = నిండి; ఉండు = ఉండునట్టి; హిరణ్మయంబు = బంగారమయము; ఐన = అయిన; విరాట్విగ్రహంబు = విరాట్స్వరూపము; ఒందిన = పొందిన; పురుషుండు = పురుషుడు; సర్వ = సమస్తమైన; జీవ = జీవములతోను; సమేతుండు = కూడినవాడు; ఐ = అయి; ఉండె = ఉండెను; అంత = అంత.

భావము:

అలా ప్రపంచాన్ని నిర్మించడంలో వాటికి నేర్పు కలగజేస్తూ శ్రీహరి క్రమానుసారంగా అన్నింటికీ పరస్పరమైత్రి కల్పించాడు. ఇలా శ్రీహరి అనుగ్రహంచేత ప్రేరేపింపడి సృష్టిక్రియకు సమర్థమైన తత్త్వసమూహం, తమ తమ అంశలతో విరాడ్విగ్రహంగా రూపొందింది. విష్ణుదేవుని కళాంశలతో ఒకటి మరొక్కదానితో ఏకీభావం పొంది, పరిపక్వమై ఇంకొక రూపం ధరించింది. ఏ తత్త్వం ఈ జగత్తంతా నిండి ఉందో హిరణ్మయమైన ఆ విరాట్ స్వరూపం ధరించిన పరమాత్మ సమస్త జీవులలో నిండి యున్న వాడయ్యాడు.

3-206-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ములలోపల నిమ్ముల
రుహజాతాండ మందు సాహస్రాబ్దం
బులు నిలిచెఁ గార్యరూపా
లితం బగు నవ్విరాట్సుర్భము వరుసన్.

టీకా:

జలముల = నీటి; లోపల = లోపల; ఇమ్ములన్ = సుఖముగా; జలరుహజాతాండము = బ్రహ్మాండము {జలరుహజాతాండము - బ్రహ్మ (జలరుహజాత, పద్మమున పుట్టినవాడు) అండము}; అందున్ = లోపల; సహస్ర = వెయ్యి; అబ్దంబులు = సంవత్సరములు; నిలిచెన్ = ఉండినది; కార్య = కార్యము యొక్క; రూపా = రూపముతో; కలితంబు = కూడినది; అగు = అయిన; విరాట్సుగర్భము = విశ్వగర్భము; వరుసన్ = వరుసగా;

భావము:

ఈ విరాట్ పురుషుడు మొదటి జలాలలో ఏర్పడ్డ బ్రహ్మాండం అనే గర్భరూపంతో వేయి సంవత్సరాలు ఉన్నాడు. దాని నుండే సమస్త సృష్టి కార్యరూపంగా వెలువడింది.

3-207-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దైవకర్మాత్మశక్తి వితానములను
గిలి తనచేతఁ దనుఁదాన దైవశక్తి
గుచు వెలుగొందుచునుఁ బ్రకారాంతరమునఁ
నువు వితతంబుగాని చైన్య మొంది.

టీకా:

దైవ = దేవుని; కర్మ = కర్మము; ఆత్మ = తన; శక్తి = శక్తుల; వితానములను = సమూహములను; తగిలి = సంధానించి; తన = తన; చేతన్ = చేత; తనున్ = తనను; తాన = తానే; దైవ = దేవుని; శక్తి = శక్తి; అగుచున్ = అవుతూ; వెలుగొందుచును = ప్రకాశిస్తూ; ప్రకార = విధానము నందలి; అంతరమునన్ = మార్పు వలన; తనువు = శరీరము; వితతంబు = విస్తారము; కాని = కానట్టి; చైతన్యము = చైతన్యమును; ఒంది = పొంది.

భావము:

దైవం, కర్మ, ఆత్మ అనువాటి శక్తి వ్యాపించి భగవంతుడు తానే బహుళ రూపాలతో వెలుగొందుతాడు. అపుడు సంకల్పమయమైన సృష్టి చైతన్యంతో విస్తరిస్తుంది గాని దేహం ఏర్పడదు.

3-208-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రూపసంసక్తిఁ జేసి నిరూఢకర్మ
క్తియును వృత్తిభేదసంక్తి దశ వి
ముల గలిగిన ప్రాణరూమున నాత్మ
క్తి బోధత్వ మగుచున్న క్తి గలిగి.

టీకా:

రూప = రూపమునందు; సంసక్తిన్ = ఆసక్తి; చేసి = వలన; నిరూఢ = నేర్పరియైన; కర్మ = చేయు; శక్తియును = సామర్థ్యమును; వృత్తి = వర్తనల లోని; భేద = భేదముల వలన; సంసక్తిన్ = ఆసక్తితో; దశ = పది; విధములన్ = విధములుగా; కలిగినన్ = కలుగగా; ప్రాణ = ప్రాణము యొక్క; రూపమున = రూపములో; ఆత్మ = తన; శక్తిన్ = శక్తిని; బోధత్వము = తెలియబడుట; అగుచున్న = అవుతున్న; శక్తి = సామర్థ్యమును; కలిగి = పొంది.

భావము:

ఆ చైతన్య శక్తికి రూపాలుగా ఏర్పడే లక్షణం ఏర్పడుతుంది. అదే కర్మశక్తి. దీనివల్ల అనేక ప్రవృత్తి భేదాలు ఉద్భవిస్తాయి. దాని యందు పది విధాలైన ప్రాణాలు స్పందిస్తాయి. ఇన్ని శక్తులతో గూడిన ప్రజ్ఞవల్ల తాను అనగా ఏమో తనకు తెలిసే శక్తి ఏర్పడుతుంది.

3-209-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్రివిధం బగుచును నాధ్యా
త్మ్య విభేదంబులనుఁ బాపి ఱి యధిభూతా
త్మ విరాడ్రూపమ్మగు నిది
వివిధప్రాణులకు నాత్మవిధమై మఱియున్.

టీకా:

త్రివిధంబున్ = మూడు విధములు {త్రివిధములు - 1 అధ్యాత్మము2 అధిభూతము 3 అధిదైవము}; అగుచున్ = అవుతూ; అధ్యాత్మ = అధ్యాత్మ {అధ్యాత్మ - కర్మశక్తి. అధిభౌతికము - స్వరూపభేదము. అధిదైవతము - సామర్థ్య దోహదము, అధిదేవత}; విభేదంబులన్ = విశేష భేదములను; పాపి = వ్యాపింపజేసి, పాయంజేసి; మఱి = మరియు; అధిభూత = అధిభూతము; ఆత్మ = తన; విరాడ్రూపము = విరాట్స్వరూపము; అగు = అయిన; ఇది = ఇది; వివిధ = రకరకముల; ప్రాణుల = జీవుల; కున్ = కు; ఆత్మ = ఆత్మల; విధము = రకము; ఐ = అయి; మఱియున్ = ఇంకనూ.

భావము:

అధ్యాత్మం, అధిభూతం, అధిదైవం అనబడే మూడు భేదాలు కలిగి ఈ విరాటం స్వరూపం జీవులకు తాను ఆత్మగా మెలగుతుంది.

3-210-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జీవంబై పరమాత్మకుఁ
దాలమై యాదిమావతారం బగు న
ద్దేవుని గర్భంబున భూ
తాలితోడం బ్రపంచ ర్థిం దోఁచెన్.

టీకా:

జీవంబు = జీవము; ఐ = అయి; పరమాత్మ = పరమాత్మ; కున్ = కు; తావలము = స్థానము; ఐ = అయి; ఆదిమ = మొదటి; అవతారంబు = అవతారము {అవతారము - స్వ స్వరూప భేదము}; అగు = అయిన; ఆ = ఆ; దేవుని = దేవుడి యొక్క; గర్భంబునన్ = గర్భములో; భూత = జీవుల; తోడన్ = తో; ప్రపంచము = లోకము {ప్రపంచము - పంచపంచముల వలన వ్యాపించినది}; అర్థిన్ = చక్కగా; తోచెన్ = ఏర్పడెను;

భావము:

సమస్తానికి జీవమై పరమాత్మకు స్థానమై తొలి అవతారమైన ఆ విరాట్ పురుషుని గర్భం నుండి భూతమయ మైన ఈ సమస్త ప్రపంచం పుట్టింది.

3-211-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దోఁచిన విరాట్పురుషుం డాధ్యాత్మి కాధిదైవి కాధిభౌతికంబు లను భేదంబులచేఁ బూర్వోక్తక్రమంబున వెలుగొందు" ననుచు విదురునకు మైత్రేయుం డెఱింగించె" నని చెప్పి; వెండియు నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; తోచిన = ఏర్పడిన; విరాట = విరాట్టు అను (విశ్వ); పురుషుండు = పురుషుడు; అధ్యాత్మ = అధ్యాత్మము; అధిదైవిక = అధిదైవికము; అధిభౌతికంబులు = అధిభౌతికములు; అను = అనే; భేదంబులన్ = భేదములు; చేన్ = చేత; పూర్వ = ముందు; ఉక్త = చెప్పబడిన; క్రమంబునన్ = విధముగ; వెలుగొందున్ = ప్రకాశించును; అనుచున్ = అంటూ; విదురున్ = విదురుని; కున్ = కి; మైత్రేయుండు = మైత్రేయుడు; ఎఱింగించెన్ = తెలిపెను; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = మరల; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఈ విధంగా విరాజిల్లిన విరాట్ పురుషుడు, ఆధ్యాత్మికము, ఆధిదైవికము, ఆధిభౌతికము అనే భేదాలతో మొదట చెప్పిన విధంగా ప్రకాశిస్తూ ఉంటాడు” అని మైత్రేయుడు విదురునికి తెలియజెప్పినాడని మళ్లీ శ్రీశుకుడు పరీక్షిత్తుతో ఇలా అన్నాడు.

3-212-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రి పరమాత్ముఁ డీశుఁ డజుఁ డాఢ్యుఁ డనంతుఁ డనంతమూర్తి సా
తనయాహృదీశుఁడు వికారవిదూరుఁడు నిత్యమంగళా
రుఁడు గృపాపయోనిధి యల్మషచిత్తుఁడు సర్వశక్తి దా
సవిలోచనుండు బుధమాన్యచరిత్రపవిత్రుఁ డిమ్ములన్.

టీకా:

హరి = విష్ణువు {హరి - పాపసంగములను హరించువాడు, విష్ణువు}; పరమాత్ముడు = విష్ణువు {పరమాత్ముడు - అత్త్యున్నతమైన ఆత్మ యైనవాడు, విష్ణువు}; ఈశుడు = విష్ణువు {ఈశుడు - ప్రభువు}; అజుడు = విష్ణువు {అజుడు - జన్మము లేనివాడు, విష్ణువు}; ఆఢ్యుడు = విష్ణువు {ఆఢ్యుడు – ప్రార్థింప దగిన వాడు, విష్ణువు}; అనంతుడు = విష్ణువు {అనంతుడు - అంతము లేనివాడు, విష్ణువు}; అనంతమూర్తి = విష్ణువు {అనంతమూర్తి - అనంతమైన స్వరూపము కలవాడు, విష్ణువు}; సాగరతనయాహృదీశుఁడు = విష్ణువు {సాగరతనయాహృదీశుఁడు - సాగరతనయ (లక్ష్మీదేవి) హృదీశుడు (భర్త), విష్ణువు}; వికారవిదూరుఁడు = విష్ణువు {వికారవిదూరుఁడు - వికారములకు విశేషముగ దూరము అయినవాడు, విష్ణువు}; నిత్యమంగళాకరుఁడు = విష్ణువు {నిత్యమంగళాకరుఁడు - శాశ్వతమైన శుభప్రదమైన ఆకారము కలవాడు, విష్ణువు}; కృపాపయోనిధి = విష్ణువు {కృపాపయోనిధి - దయ అను సముద్రము (పయోనిధి) వంటివాడు, విష్ణువు}; అకల్మషచిత్తుఁడు = విష్ణువు {అకల్మషచిత్తుఁడు - అకల్మష (నిర్మలమైన) మనసు కలవాడు, విష్ణువు}; సర్వశక్తి = విష్ణువు {సర్వశక్తి - సర్వమునకు శక్తి యైనవాడు, విష్ణువు}; తామరసవిలోచనుండు = విష్ణువు {తామరసవిలోచనుండు - తామర (పద్మముల) స(వంటి) వి(విశిష్ట) లోచనుండు (కన్నులు కలవాడు), విష్ణువు}; బుధమాన్యచరిత్రపవిత్రుఁడు = విష్ణువు {బుధమాన్యచరిత్ర పవిత్రుఁడు - బుధ (మంచివారి)చే మన్నింపబడు చరితము (వర్తనము) వలన పరిశుద్ధమైనవాడు, విష్ణువు}; ఇమ్ములన్ = విస్తారముగ.

భావము:

ఆ శ్రీహరి, పరమాత్ముడు, ఈశ్వరుడు, అజుడు, ఆఢ్యుడు, అనంతుడు, అనంతమూర్తి, లక్ష్మీరమణుడు, నిర్వికారుడు, నిత్యమంగళస్వరూపుడు, కరుణాసముద్రుడు, నిర్మలహృదయుడు, సమస్త శక్తిమంతుడు, కమదళ నేత్రుడు, సకల బుధ సంస్తవనీయ చరిత్రుడు, పరమ పవిత్రుడు.

3-213-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇత్తెఱంగున నీశుం డగు నధోక్షజుండు మహదాదితత్త్వంబుల మనంబుల ఘనంబులగు తలంపులు దానెఱింగి యట్టి తత్త్వంబుల వివిధ వృత్తిలాభంబునకై స్వకీయచిచ్ఛక్తిచే నిటు లొనర్తు నని చింతించి నిజకళాకలితం బగు విరాడ్విగ్రహంబు నందు నగ్ని ప్రముఖం బగు దేవతావళి కెల్ల నివాసం బగుచుఁ గానంబడిన వైరాజపురుషుని యాస్యాద్యవయవంబుల వినిపింతు దత్తావధానుండవై వినుము.

టీకా:

ఇత్తెఱంగునన్ = విధముగ; ఈశుడు = విష్ణువు {ఈశుడు - ప్రభావము కలవాడు, విష్ణువు}; అగు = అయిన; అధోక్షజుండు = విష్ణువు {అధోక్షజుండు - వ్యు. అక్షజం – ఇంద్రియ జ్ఞానమ్, అధి – అధరమ్, అధి+అక్షజం యస్య – అధోక్షజః, బహువ్రీహి, వేనిని తెలియుటకు ఇంద్రియజ్ఞానము అసమర్థమైనదో అతడు, విష్ణువు, సంసార ధర్మ స్పర్శ రహితుడు, నిజరూపజ్ఞానము కలవాడు, విష్ణుసహస్రనామాలు శ్రీశంకరభాష్యం 415వ నామం}; మహత్ = మహత్తు; ఆది = మొదలగు; తత్త్వంబులన్ = తత్త్వముల; మనంబులన్ = మనసులలోని; ఘనంబులు = పెద్ద పెద్దవి; అగు = అయిన; తలంపులు = ఆలోచనలను; తాన్ = తాను; ఎఱింగి = తెలిసికొని; అట్టి = అట్టి; తత్త్వంబులన్ = తత్త్వములను; వివిధ = రకరకాల; వృత్తి = వర్తనలలోని; లాభంబున = సార్థక్యమున; కై = కొరకు; స్వ = తనచేత; కీయ = చేయబడిన; చిత్ = చైతన్య స్వరూప; శక్తి = సామర్థ్యము; చేన్ = చేత; ఇటుల = ఈ విధముగ; ఒనర్తును = చేయుదును; అని = అని; చింతించి = భావించి; నిజ = తన యొక్క; కళా = అంశలతో; కలితంబున్ = కూడినది; అగు = అయిన; విరాట్విగ్రహంబున్ = విరాట్విగ్రహము; అందున్ = లో; అగ్ని = అగ్నిదేవుడు; ప్రముఖంబు = మొదలగు ముఖ్యము; అగు = అయిన; దేవతా = దేవతల; ఆవళి = సమూహముల; కిన్ = కి; ఎల్లన్ = అంతటికిని; నివాసంబు = తన అంశ కలవానిగ; అగుచున్ = అవుతూ; కానంబడిన = ఏర్పడగా; వైరాజపురుషుని = విరాట్పురుషుని {వైరాజపురుషుడు - (విశ్వముగ) విరాజిల్లుతున్న సామర్థ్య రూపుడు (పురుషుడు), విష్ణువు}; ఆస్య = ముఖము; ఆది = మొదలగు; అవయవంబులన్ = అవయవములను; వినిపింతు = వినిపించెదను; దత్త = ధరించిన; అవధానుండవు = శ్రద్ద కలవాడవు; ఐ = అయి; వినుము = విను.

భావము:

సర్వేశ్వరుడైన పరాత్పరుడు అలా మహదాది తత్త్వాల మనస్సులలోని గొప్ప ఆలోచనలన్నీ తెలుసుకున్న వాడై. ఆ తత్త్వాల ప్రవర్తనలన్నీ సఫలం కావటానికి తన చైతన్యం శక్తిని ఉపయోగించాలని నిశ్చయించాడు. తన కళలతో కూడిన విరాట్టు స్వరూపంలో అగ్ని మొదలైన దేవత లందరికీ నివాసాలు కల్పించాడు. విరాట్ పురుషుని ముఖం మొదలైన అవయవాల స్వరూపాలను వినిపిస్తాను. ఏకాగ్రమైన భావంతో ఆకర్ణించు.

3-214-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుత! యా దివ్యపురుషోత్తముని పృథ-
గ్భావంబు నొంది ముఖంబువలన
భునపాలకుఁడైన మానసఖుఁ డంత-
రాత్ముఁ డీశ్వరునంశమైనవాని
నయంబు ననుకూల గుచు నిజస్థాన-
మునఁ బ్రవేశించిన ముఖము నందుఁ
రఁగు జీవుండు శబ్దము నుచ్చరించుఁ బృ-
గ్భావములను నేత్రముల నినుఁడు

3-214.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్షురింద్రియ యుక్తుఁడై రవిఁజెంది
రూపవిజ్ఞాన మహిమ నిరూఢి నొందు
ఱియుఁ జర్మంబునను బవమానుఁ డీశ్వ
రాంశమై తత్తగింద్రియ మందుఁ గూడి.

టీకా:

నరనుత = నరులచే కీర్తింపబడువాడ; ఆ = ఆ; దివ్య = దివ్యమైన; పురుషోత్తముని = పురుషోత్తముని; పృథక్ = వేరుగా ఉండే; భావంబున్ = విధనము; ఒంది = పొంది; ముఖంబు = ముఖము; వలనన్ = వలన; భువన = లోకమును; పాలకుడు = పాలించువాడు; ఐన = అయిన; పవమానసఖుడు = అగ్నిదేవుడు {పవమానసఖుడు - వాయుదేవుని మిత్రుడు, అగ్నిదేవుడు}; అంతరాత్ముడు = అందరిలోను ఉండువాడు; ఈశ్వరున్ = విష్ణుని; అంశము = కళ; ఐనవాని = అయినవాని; కిన్ = కి; అనయంబున్ = సతతము; అనుకూలము = అనుకూలము; అగుచున్ = అవుతూ; నిజ = స్వంత; స్థానమున = స్థానములో; ప్రవేశించిన = ప్రవేశించగ; ముఖమున్ = ముఖము, నోటి; అందున్ = లో; పరగు = ప్రసిద్ధుడు అగు; జీవుండు = జీవుడు; శబ్దమును = శబ్దమును; ఉచ్చరించున్ = పలుకును; పృథక్ = వేరుగా ఉండే; భావంబులన్ = విధములలో; నేత్రములన్ = కన్నులలో; ఇనుడు = సూర్యుడు; షవీ చక్షుః = చూచు; ఇంద్రియ = ఇంద్రియములతో; యుక్తుడు = కూడినవాడు; ఐ = అయ్యి; సరవిన్ = ఒప్పిదము; చెంది = పొంది; రూప = ఆకారమును; విజ్ఞాన = తెలిసికొను; మహిమన్ = సామర్థ్యమును; నిరూఢిన్ = ప్రసిద్ధి; ఒందు = పొందును; మఱియున్ = ఇంకను; చర్మంబునను = చర్మమునందు; పవమానుడు = వాయుదేవుడు; ఈశ్వర = ఈశ్వరుని; అంశము = కళతోకూడినవాడు; ఐ = అయ్యి; తత్ = ఆ; త్వక్ = చర్మము అను; ఇంద్రియమున్ = ఇంద్రియమును; కూడి = కలిసి.

భావము:

ఓ భవ్యచరిత్రుడవైన విదురా! ఆ దివ్యమూర్తియైన విరాట్పురుషుని నుండి కొంతభాగం వేరయింది. అది ముఖంగా రూపొందింది. ఆ పరమేశ్వరుని అంశ గలవాడై వాయుదైవుని మిత్రుడైన అగ్నిదేవుడు ముఖాన్ని నిజస్థానంగా చేసుకొన్నాడు. అందువల్ల జీవుడు శబ్దాన్ని పలుక గలుగుతున్నాడు. విరాట్ పురుషునినుండి మరికొంత భాగము వేరై కన్నులుగా రూపొందాయి. సూర్యుడు చక్షురింద్రియానికి అధికారియై రూప విజ్ఞానాన్ని జీవునకు కలుగజేస్తున్నాడు. అట్లే విరాట్పురుషునిలో కొంతభాగం వేరై చర్మంగా ఏర్పడింది. ఈశ్వరాంశ అయిన వాయువు త్వగింద్రియంలో నిల్చాడు.

3-215-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిజవాసంబు నాశ్రయించి జీవుండు స్పర్శేంద్రియగతుండై పృథగ్భావం బయ్యె; శ్రోత్రంబుల దిక్కు లచ్యుత కళాంశంబు లగు శ్రవణేంద్రియ యుక్తంబులై నిజస్థానంబునం బొంది జీవుండు శబ్దజ్ఞానగతుం డగు; వెండియుఁ దాలువు నిర్భిన్నంబయిన లోకపాలుఁ డగు వరుణుం డందుఁ బ్రవేశించి రసనేంద్రియంబుచేఁ బ్రకాశించినం బ్రాణి రసంబులం గ్రహించె; పరమేశ్వరుని నాసికేంద్రియంబు పృథగ్భావంబు నొంది యాశ్వినేయాధిష్ఠానంబై ఘ్రాణాంశంబు నొందిన జంతువు గంధగ్రహణ సమర్థం బయ్యె; వెండియు భిన్నంబయిన చర్మంబున నోషధులునుఁ బరమపురుషాంశంబు లయిన కేశంబులం గూడి నిజనివాసంబు నొందిన జీవుండు కండూయమానుం డగు; భిన్నభూతంబైన మేఢ్రంబునం బ్రజాపతి రేతంబున నిజస్థానంబు నొంది జీవుం డానందంబునం బొరయు; భిన్నభావం బైన గుదంబున మిత్రుం డచ్యుతాంశంబును బొంది పాయువుం గూడి నిజాస్థానంబు నొందుచు జీవుండు విసర్గంబుఁ జెందు; వేఱువేఱైన బాహువులం ద్రిదశాధీశ్వరుం డయిన పురంధరుండు క్రయవిక్రయాది శక్తియుక్తుం డగుచు నిజస్థానంబు నొంది జీవుండు వానిచేత జీవికం బొందు; మఱియుఁ బాదంబులు నిర్భిన్నంబు లయిన విష్ణుండు స్వావాసంబు గైకొని గతిశక్తిం బొందిన జీవుండు గమనాగమ నార్హుండయ్యె; వెండియు భిన్నభావం బయిన హృదయంబు మనంబుతోడం గలిసి నిజాధిష్ఠానంబునం జంద్రుండు ప్రవేశించిన జీవుండు శరీరసంకల్పాది రూపం బగు వికారంబునుం బొందు; భిన్నభావంబైన యహంకారంబున నహంకృతి యుక్తుండై రుద్రుండు నిజస్థానంబుగా వసియించు; నా యహంకృతిచే శరీరకర్తవ్యంబులు నడపు బుద్ధి వాగీశ్వరావాసంబై హృదయంబుతోడం గలసి నిజాధిష్ఠానంబున బోధాంశంబుచే వెలింగిన శరీరి బోద్ధవ్యతం బొందు; భిన్నంబైన చిత్తంబు బ్రహ్మావాసంబై చేతనాంశంబు నొందినఁ బ్రాణి విజ్ఞానంబునుం బొందు; నట్టి విరాట్పురుషుని శీర్షంబున స్వర్గంబునుఁ, జరణంబుల వసుమతియు, నాభి యందు గగనంబునుఁ గలిగె సత్త్వాదిగుణ పరిణామంబుల నమరు లైరి; ఊర్జిత సత్త్వగుణంబున నద్దేవతలు త్రిదివంబునుఁ బొందిరి; రజోగుణంబున మనుజులును, గవాదులును ధరణిం బొందిరి; తామసంబున భూతాదులైన రుద్రపారిషదులు ద్యావాపృథివ్యంతరం బగు వియత్తలంబునుం బొందిరి ముఖంబువలన నామ్నాయంబు లుత్పన్నంబయ్యె; వెండియు.

టీకా:

నిజ = స్వంత; వాసంబున్ = స్థానమును; ఆశ్రయించి = చేరి; జీవుండు = జీవుడు; స్పర్శ = స్పర్శ తెలియు; ఇంద్రియ = ఇంద్రియము; గతుండు = కలవాడు; ఐ = అయి; పృథక్ = వేరే; భావంబున్ = భాగము; అయ్యెన్ = ఆయెను; శ్రోత్రంబులన్ = చెవులలో; దిక్కులు = దిక్కులు; అచ్యుత = విష్ణుని {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}; కళా = కళ యొక్క; అంశంబులు = అంశములు; అగు = అయిన; శ్రవణ = విను; ఇంద్రియ = ఇంద్రియముతో; యుక్తంబులు = కూడినవి; ఐ = అయి; నిజ = స్వంత; స్థానంబునన్ = స్థానమును; పొంది = పొంది; జీవుండు = జీవుడు; శబ్ద = వినగలుగు; జ్ఞాన = జ్ఞానము; గతుండు = కలవాడు; అగు = అగును; వెండియున్ = ఇంకను; తాలువు = అంగిలి; నిర్భిన్నంబు = వేరయినది; అయిన = అయిన; లోకపాలుడు = లోకపాలుడు; అగు = అయిన; వరుణుండు = వరుణుడు; అందున్ = అందులో; ప్రవేశించి = ప్రవేశించి; రసనేంద్రియంబు = నాలుక; చేన్ = చే; ప్రకాశించినన్ = వ్యక్తముకాగ; ప్రాణి = జీవుడు; రసంబులన్ = రుచులను; గ్రహించెన్ = తెలిసెను; పరమేశ్వరుని = విష్ణుని {పరమేశ్వరుడు - అత్యుత్తమమైన ప్రభువు, విష్ణువు}; నాసిక = ముక్కు అను; ఇంద్రియంబు = ఇంద్రియము; పృథక్ = వేరుగా ఉండే; భావంబున్ = భాగమును; ఒంది = పొంది; ఆశ్వినేయ = అశ్వినీ దేవతల; అధిష్ఠానము = నివాసము; ఐ = అయి; ఘ్రాణ = ముక్కు అను; అంశంబును = భాగమును; ఒందిన = పొందిన; జంతువు = జీవుడు; గంధ = వాసన; గ్రహణ = తెలిసికొను; సమర్థంబు = సామర్థ్యంబు కలది; అయ్యెన్ = అయ్యెను; వెండియున్ = ఇంకను; భిన్నంబు = వేరయిన; అయిన = అయిన; చర్మంబునన్ = చర్మములో; ఓషధులును = ఓషదులును; పరమపురుష = విష్ణుని {పరమపురుషుడు - అత్యుత్తమ సామర్థ్యుడు (పురుషుడు), విష్ణువు}; అంశంబులు = అంశలు; అయిన = అయినట్టి; కేశంబులన్ = వెంట్రుకలును; కూడి = కలిసి; నిజ = స్వంత; నివాసంబు = నివాసము; ఒందిన = పొందిన; జీవుండు = జీవుడు; కండూయమానుండు = దురద కలవాడు , గోకుకొనువాడు; అగు = అగును; భిన్నభూతంబు = వేరైనది; ఐన = అయిన; మేఢ్రంబునన్ = పురుషావయవమున; ప్రజాపతి = ప్రజాపతి యొక్క; రేతంబునన్ = శుక్రధాతువునందు; నిజ = స్వంత; స్థానంబున్ = నివాసము; ఒంది = పొంది; జీవుండు = జీవుడు; ఆనందంబున్ = ఆనందములో; బొరయున్ = అతిశయించును; భిన్న = వేరైన; భావంబు = భాగము; ఐన = అయిన; గుదంబునన్ = గుదమునందు; మిత్రుడు = మిత్రుడు; అచ్యుత = విష్ణుని {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}; అంశంబును = అంశను; పొంది = పొంది; పాయువున్ = మలమువిడుచు అవయవమును; కూడి = కలిసి; నిజ = స్వంత; స్థానంబున్ = నివాసమును; ఒందుచున్ = పొందుచు; జీవుండు = జీవుడు; విసర్గంబున్ = (మలము) విసర్జించుటను; చెందు = పొందును; వేఱువేఱు = వేరువేరుగా; ఐన = అయిన; బాహువులు = చేతులు; అందున్ = అందు; త్రిదశ = దేవతలకి; ఆధీశ్వరుండు = అధిపతి; అయిన = అయిన; పురంధరుడు = ఇంద్రుడు; క్రయ = తీసుకొను; విక్రయ = ఇచ్చు; ఆది = మొదలగు; శక్తి = సామర్థ్యముతో; యుక్తుండు = కూడినవాడు; అగుచు = అవుతూ; నిజ = స్వంత; స్థానంబు = నివాసము; ఒంది = పొంది; జీవుండు = జీవుడు; వాని = వాటి; చేత = వలన; జీవికన్ = జీవనాధారమును, వృత్తిని; పొందు = పొందును; మఱియున్ = ఇంకనూ; పాదంబులు = పాదములు; నిర్భిన్నంబులు = వేఱువేఱు; అయినన్ = అయిన; విష్ణుండు = విష్ణువు; స్వ = స్వంత; ఆవాసంబున్ = నివాసమును; కైకొని = పొంది; గతి = గమన; శక్తిన్ = సామర్థ్యమును; పొందిన = పొందిన; జీవుండు = జీవుడు; గమన = వెళ్ళుటకు; ఆగమన = వచ్చుటకు; అర్హుండు = సమర్థుండు; అయ్యెన్ = అయ్యెను; వెండియున్ = ఇంకనూ; భిన్న = వేరైన; భావంబున్ = భాగము; అయిన = అయిన; హృదయంబు = హృదయము; మనంబు = మనసు; తోడన్ = తో; కలిసి = కలిసి; నిజ = స్వంత; అధిష్ఠానంబునన్ = నివాసమునందు; చంద్రుండు = చంద్రుడు; ప్రవేశించిన = ప్రవేశించిన; జీవుండు = జీవుడు; శరీర = శరీర మందలి; సంకల్ప = సంకల్పము; ఆది = మొదలగు; రూపంబు = రూపము; అగు = అయిన; వికారంబునున్ = మార్పును; పొందు = పొందు; భిన్న = వేరైన; భావంబు = భాగము; ఐన = అయిన; అహంకారంబున = అహంకారమున; అహంకృతి = అహంకారముతో; యుక్తుండు = కూడినవాడు; ఐ = అయి; రుద్రుండు = శివుడు {రుద్రుడు - రౌద్రము యొక్క రూపము కలవాడు, శివుడు}; నిజ = స్వంత; స్థానంబుగా = నివాసముగా; వసియించు = నివసించు; ఆ = ఆ; అహంకృతి = అహంకారము; చేన్ = చేత; శరీర = శరీరము యొక్క; కర్తవ్యంబులు = చేయవలసిన పనులు; నడపు = చేయును; బుద్ధి = బుద్ధి; వాక్ = పలుకుటకు; ఈశ్వర = అధిదేవత; ఆవాసంబున్ = నివాసము; ఐ = అయి; హృదయంబు = హృదయము; తోడన్ = తో; కలసి = కలసి; నిజ = స్వంత; అధిష్ఠానంబునన్ = నివాసమున; బోధ = బోధపడు అను; అంశంబున్ = కళ; చేన్ = చేత; వెలింగిన = ప్రకాశించిన; శరీరి = దేహి; బోద్ధవ్యతన్ = బోధపడుటను; ఒందు = పొందు; భిన్నంబు = వేరైన; చిత్తంబు = మనసు; బ్రహ్మ = బ్రహ్మదేవునికి; ఆవాసంబున్ = నివాసము; ఐ = అయి; చేతన = జ్ఞానము అను; అంశంబునన్ = కళను; ఒందిన = పొందిన; ప్రాణి = జీవుడు; విజ్ఞాంబునున్ = విజ్ఞానమును; పొందు = పొందు; అట్టి = అటువంటి; విరాట్పురుషుని = విరాట్పురుషుని; శీర్షంబునన్ = శిరస్సునందు; స్వర్గంబును = స్వర్గమును; చరణంబులన్ = పాదములను; వసుమతియున్ = భూమియును; నాభి = బొడ్డు; అందున్ = అందు; గగనంబునున్ = ఆకాశమును; కలిగెన్ = కలిగెను; సత్త్వాది = సత్త్వాది {సత్త్వాది - సత్త్వరజస్తమోగుణములు, త్రిగుణములు}; గుణ = గుణముల; పరిణామంబులన్ = మార్పుల వలన; అమరులు = దేవతలు; ఐరి = ఏర్పడిరి; ఊర్జిత = గట్టి, కూర్చుకొన్న; సత్త్వగుణంబునన్ = సత్త్వగుణమువలన; ఆ = ఆ; దేవతలు = దేవతలు; త్రిదివంబున్ = స్వర్గమును; పొందిరి = పొందిరి; రజోగుణంబునన్ = రజోగుణము వలన; మనుజులును = మానవులును; గవాదులును = గోవులు మొదలగునవియును {గవాదులు - గో + ఆదులు}; ధరణిన్ = భూమి మీద పుట్టుటను; పొందిరి = పొందిరి; తామసంబునన్ = తామసగుణమున; భూత = భూతములు; ఆదులు = మొదలగునవి; ఐన = అయిన; రుద్రపారిషదులు = రుద్రగణములు {రుద్రపారిషదులు - రుద్రుని చుట్టును కూర్చుండు వారు, రుద్రగణములు}; ద్యావ = ఆకాశమును; పృథివి = భూమికిని; అంతరంబున్ = నడుమనున్నది; అగు = అయిన; వియత్ = ఆకాశ; తలంబున్ = లోకమును; పొందిరి = పొందిరి; ముఖంబు = ముఖము; వలన = వలన; ఆమ్నాయంబులు = వేదములు; ఉత్పన్నంబున్ = పుట్టినవి; అయ్యెన్ = అయ్యెను; వెండియున్ = మరియును.

భావము:

జీవునకు స్పర్శజ్ఞానాన్ని కలగించు విరాట్పురుషు నుండి వేరైన చెవులయందు ఈశ్వరాంశలైన దిక్కులు జీవుని శ్రవణేంద్రియాన్ని కూడి జీవునకు శబ్ద జ్ఞానాన్ని కలిగిస్తున్నవి. అట్లే వేరైన తాలువులందు లోకపాలకుడైన వరుణుడు ఈశ్వరాంశతో ప్రవేశించి జీవుని రసనేంద్రియంగా ప్రకాశిస్తున్నాడు. అందువల్ల ప్రాణి రుచులను తెలుసుకొంటాడు. పరమేశ్వరుని నాసికేంద్రియం వేరై ఆయన అంశగల అశ్వినీ దేవతలకు అధిష్టాన మయింది. అందువల్ల జీవునకు వాసన చూచే శక్తి కలిగింది. పరమపురుషునుండి వేరైన చర్మం ఓషధులు ఆయన అంశలైన కేశాలను కూడడంచేత జీవునకు కండూయమానస్థితి (గోకుకొనుట) ఏర్పడింది. అట్లే పరమేశ్వరుని నుండి వేరైన పురుషాంగంలో ఈశ్వరునినుండి వేరైన గుదస్థానంలో అచ్యుతాంశమైన మిత్రుడు, వాయువుతో కూడి ప్రవేశించటంవల్ల జీవునకు మలవిసర్జన శక్తి కలుగుతున్నది. విరాట్పురుషుని నుండి వేరైన చేతులందు ఈశ్వరాంశమైన ఇంద్రుడు ప్రవేశించటం వల్ల ఇచ్చిపుచ్చుకొను శక్తి కలవాడై. నిజస్థానాన్ని పొందిన జీవుడు జీవనోపాధిని పొందుతున్నాడు. విరాటం పురుషుని నుండి వేరైన పాదాలను విష్ణువు అధిష్ఠించి గమన శక్తి కలిగించటం వల్ల జీవుడు నడచుటకు శక్తి మంతు డగుతున్నాడు. పరమేశ్వరుని నుండి బయటికి వచ్చిన హృదయం పొందుతున్నాడు. వేర్పాటు చెందిన అహంకారంలో అహంకృతియుక్తుడైన రుద్రుడు నిజస్థానంగా ప్రవేశించి నప్పుడు జీవుడు కర్తవ్యాలను నిర్వర్తిస్తాడు. విడివడిన బుద్ధి వాగీశ్వరుని ఆవాసమై హృదయంతో కలిసి జ్ఞానాంశతో వెలిగినప్పుడు జీవునకు గ్రహణశక్తి కలుగుతుంది. వేరుపడిన చిత్తం బ్రహ్మకు ఆవాసమై చేతనాంశం పొందినప్పుడు జీవుడు విజ్ఞానాన్ని పొందుతాడు.
అటువంటి విరాట్పురుషుని శిరస్సునుండి స్వర్గమూ, పాదాల నుండి భూమీ, నాభి నుండి ఆకాశమూ కలిగాయి. సత్త్వరజస్తమోగుణాల మార్పుచేత జీవులు అమరు లయ్యారు. సత్త్వగుణం అధికంగా ఉండడంచేత ఆ దేవతలు స్వర్గాన్ని పొందారు. రజోగుణంవల్ల మనుష్యులూ, గోవులూ మొదలైన జీవులు భూమిని పొందారు. విరాట్పురుషుని ముఖం నుండి వేదాలు పుట్టాయి.

3-216-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణీదివిజులు శ్రుతులును
వర యమ్మేటి ముఖమునం బొడముట భూ
సురుఁ డఖిల వర్ణములకున్
గురుఁడున్ ముఖ్యుండు నయ్యె గుణరత్ననిధీ!

టీకా:

ధరణీదివిజులు = బ్రాహ్మణులు {ధరణీదివిజులు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; శ్రుతులును = వేదములును; నరవర = రాజా {నరవరుడు - నరులకు ప్రభువు, రాజు}; ఆ = ఆ; మేటి = గొప్పవాని; ముఖమునన్ = ముఖమునుండి; పొడముటన్ = పుట్టుటచే; భూసురుడు = భ్రాహ్మణుడు {భూసురుడు - భూమికి దేవత, బ్రాహ్మణుడు}; అఖిల = సమస్తమైన; వర్ణముల = జాతుల; కున్ = కిని; గురుడున్ = గురువును; ముఖ్యుండున్ = ముఖ్యమైనవాడును; అయ్యెన్ = అయ్యెను; గుణ = (మంచి) గుణములు అను; రత్న = రత్నములకు; నిధీ = నిధివంటివాడు.

భావము:

ఓ ప్రశస్త గుణసంపన్నుడవైన పరీక్షిన్మహారాజా! బ్రాహ్మణులూ, వేదాలూ ఆ విరాట్ పురుషుని ముఖం నుండి పుట్టడం వల్ల బ్రాహ్మణుడు సమస్త వర్ణాలకు జ్యేష్ఠుడూ, శ్రేష్ఠుడు అయ్యాడు.

3-217-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రఁ బ్రాహ్మణాదికముఁ ద
స్కబాధలఁ బొందకుండఁ గైకొని కావం
బురుషోత్తము బాహువులన్
నాథకులంబు పుట్టె యతత్త్వనిధీ!

టీకా:

ధరన్ = భూమిమీద; బ్రాహ్మణ = బ్రాహ్మణులు; ఆదికము = వర్గము; తస్కర = దొంగల; బాధలన్ = బాధలను; పొందకుండన్ = పొందకుండ ఉండుటకై; కైకొని = సంకల్పించి, చేపట్టి; కావన్ = కాపాడుటకు; పురుషోత్తమున్ = పురుషోత్తముని; బాహువులన్ = చేతులను; నరనాథ = రాజుల {నరనాథుడు - నరులకు ప్రభువు, రాజు}; కులంబు = వంశములు; పుట్టె = పుట్టెను; నయ = న్యాయము; తత్త్వ = తత్త్వములకు; నిధీ = నిధివంటివాడా.

భావము:

ఓ నీతి విద్యావిశారదుడవైన విదురా! బ్రాహ్మణాది వర్ణాల వారు దొంగలూ దుండగులూ మొదలైన వారి వల్ల బాధలు పొందకుండా వారిని రక్షించడానికే ఆ పురుషోత్తముని భుజాల నుండి క్షత్రియజాతి జన్మించింది.

3-218-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణుతింపఁగఁ గృషి గోర
క్ష వాణిజ్యాది కర్మలితంబుగ నా
గునిధి యూరువు లందుం
బ్రణుతింపగ వైశ్యజాతి ప్రభవం బయ్యెన్.

టీకా:

గణుతింపగన్ = ఎంచి చూసిన; కృషి = వ్యవసాయము; గోరక్షణ = ఆవులను పాలించుట; వాణిజ్య = వ్యాపారంబును; ఆది = మొదలగు; కర్మ = పనులు, వృత్తులు; కలితంబుగన్ = కూడినవిగా; ఆ = ఆ; గుణనిధి = భగవంతుని {గుణనిధి - గుణములకు స్థానమైన వాడు, విష్ణువు}; ఊరువులు = తొడల; అందున్ = అందు; ప్రణుతింపగన్ = కీర్తించునట్లు; వైశ్య = వాణిజ్యము చేయు వైశ్య; జాతి = వర్ణము; ప్రభవంబు = ఏర్పడుట; అయ్యెన్ = అయ్యెను.

భావము:

వ్యవసాయం, గోసంరక్షణం, వ్యాపారం మొదలైన కార్యాలను నిర్వహించటం కోసం ఆ సర్వేశ్వరుని తొడల నుండి వైశ్యజాతి ఆవిర్భవించింది.

3-219-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తివిరి సేవకధర్ములై దేవదేవు
ములను శూద్రసంతతు లుయ మైరి
వీర లందఱుఁ దమతమ విహితకర్మ
లరఁ జేయుచు జనకుండు నాత్మ గురుఁడు.

టీకా:

తివిరి = సంకల్పంచి; సేవక = సేవించుటయే; ధర్ములు = వర్తనగ కలవారు; ఐ = అయి; దేవదేవు = విష్ణుని {దేవదేవుడు - దేవతలకును దేవుడు, విష్ణువు}; పదములను = పాదములందు; శూద్ర = శూద్రుల; సంతతులు = వర్ణములవారు; ఉదయము = పుట్టినవారు; ఐరి = అయిరి; వారలు = వారు; అందఱున్ = అందరును; తమతమ = తమతమ; విహిత = విధింపబడిన; కర్మములన్ = పనులను; అలరన్ = చక్కగా; చేయుచున్ = చేస్తూ; జనకుండు = తండ్రి {జనకుండు - జననమునకు కారణమైనవాడు, తండ్రి}; ఆత్మ = తమకు; గురుండు = గురువును.

భావము:

ఆ దేవదేవుని పాదాలనుండి సేవావృత్తియే ధర్మంగా గల శూద్రజాతి పుట్టింది. వీరంతా తమకై విధింపబడిన పనులు చేస్తూ, జగజ్జనకుడు మహితాత్ముడు అయిన విష్ణుమూర్తిని పూజిస్తుంటారు.

3-220-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గు సర్వేశుఁ బరాత్పరు
దేకప్రభుని పాదలజాతంబుల్
గిలి భజింతురు సతతము
నిమోక్తిన్ భక్తియోగనిపుణాత్మకులై.

టీకా:

అగు = అయిన; సర్వేశున్ = విష్ణుని {సర్వేశుడు - సర్వమునకు ప్రభువు, విష్ణువు}; పరాత్పరున్ = విష్ణుని {పరాత్పరుడు - పరమునకే పరుడు, విష్ణువు}; జగదేకప్రభుని = విష్ణుని {జగదేకప్రభువు - విశ్వము సమస్తమునకు ప్రభువు, విష్ణువు}; పాద = పాదములు అను; జలజాతంబుల్ = పద్మములు {జలజాతంబులు - జలమున పుట్టునవి (జాతంబులు), పద్మములు}; తగిలి = లగ్నము అయి; భజింతురు = ఆరాధింతురు; సతతము = ఎల్లప్పుడును; నిగమ = వేదములందు; ఉక్తిన్ = చెప్పినట్లు; భక్తి = భక్తి; యోగ = కలిగి యుండుట యందు; నిపుణాత్మకులు = నైపుణ్యము కలవారు; ఐ = అయి.

భావము:

ఆ శూద్రజాతి వారంతా తమకై విధింపబడిన పనులు చేస్తూ, జగజ్జనకుడూ, విశ్వగురుడూ, సర్వేశ్వరుడూ, పరాత్పరుడూ, ఆలోకైకనాథుడు అయిన హరి పాదపద్మాలకు వేదాల్లో చెప్పిన విధంగా భక్తియోగ పరాయణులై అనుదినమూ సేవిస్తుంటారు.

3-221-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హిమ దీపింపఁ గాల కర్మస్వభావ
క్తి సంయుక్తుఁ డగు పరేశ్వరుని భూరి
యోగమాయావిజృంభణోద్యోగ మెవ్వఁ
డెఱిఁగి నుతియింపఁగా నోపు నిద్ధచరిత!

టీకా:

మహిమ = గొప్పదనము; దీపింపన్ = ప్రకాశింపగా; కాల = కాలము; కర్మ = కర్మము; స్వభావ = స్వభావము; శక్తిన్ = సామర్థ్యములు; సంయుక్తము = కూడినవాడు; అగు = అయిన; పరేశ్వరుని = విష్ణుని {పరేశ్వరుడు - (సర్వమునకు) పరమైన (పైనఉండువాడు) ప్రభువు, విష్ణువు}; భూరి = అత్యధికమైన; యోగ = యోగ; మాయా = మాయ యొక్క; విజృంభణ = చెలరేగు; ఉద్యోగము = ప్రభావమును, యత్నమును; ఎవ్వడు = ఎవడు; ఎఱింగి = తెలిసికొని; నుతింపగాన్ = స్తుతించుటకు; ఓపున్ = శక్తి కలిగి ఉండును; ఇద్ధచరిత = పరిశుద్ధ వర్తన కలవాడా;

భావము:

మహనీయమైన చరిత్ర కలవాడా! విదుర! కాల, కర్మ, స్వభావ శక్తులతో ప్రకాశించే పరమేశ్వరుని యోగమాయ అమేయమైనది. ఆ యోగమాయ విశేష విజృంభణాన్ని తెలుసుకొని సంస్తుతించడానికి ఎవరికి మాత్రం సాధ్యమౌతుంది.

3-222-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్యకథానులాపము లర్నిశముం బఠియించి చాల మా
లిన్యము నాత్మశోభన విలీనత నొందు మదీయ జిహ్వ సౌ
న్యముతోడఁ గ్రోలు హరి ద్గుణ దివ్యకథామృతంబు స
న్మాన్యచరిత్రమై నెగడు ద్గురువాక్యపదంబుఁ జెందఁగన్.

టీకా:

అన్య = ఇతర; కథ = కథలను; అనులాపములు = వల్లెవేస్తూ; అహర్ = పగళ్ళు; నిశమున్ = రాత్రిళ్ళు; పఠియించి = చదివి; చాల = అధికమైన; మాలిన్యమున్ = కల్మషములతో; ఆత్మ = ఆత్మ; శోభన = శోభ; విలీనత = మరుగునపడుట; ఒందున్ = పొందును; మదీయ = నా; జిహ్వ = నాలుక; సౌజన్యము = మంచితనము; తోడన్ = తో; క్రోలు = తాగు; హరి = విష్ణుని {హరి - సర్వ మలినములు హరించువాడు, విష్ణువు}; సత్ = మంచి; గుణ = గుణముల; దివ్య = దివ్యమైన; కథా = కథలు అను; అమృతంబు = అమృతము; సత్ = మంచివారిచే; మాన్య = కీర్తింపతగు; చరిత్రము = కథలు; ఐ = అయి; నెగడు = అతిశయించు; మత్ = మా; గురు = గురువు, పరాశరమహర్షి {గురువు - ఈ సందర్భములో ప్రస్తుత వక్త మైత్రేయుని గురువు వేదవ్యాసుని తండ్రి పరాశరమహర్షి}; వాక్య = మాటల; పదంబున్ = మార్గమును; చెందగన్ = చెందునట్లు.

భావము:

ఈ నా నాలుక ఇతర కథాకలాపాలను రాత్రింబవళ్లు చదివి చదివి, చాలా మలినమై, ఆత్మ సౌందర్యాన్ని పోగొట్టుకొన్నది. నేడు నా గురుదేవునిచే నిర్దేశింపబడిన మార్గాన్ని అవలంబించి విష్ణుదేవుని సద్గుణవంతమైన సత్కథా గానం అనే అమృతాన్ని పానం చేసి సౌజన్యాన్నీ, సౌభాగ్యాన్నీ సంతరించుకున్నది.

3-223-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రినామాంకిత సత్కథామృత రసవ్యాలోలుఁ డైనట్టి స
త్పురుషశ్రేష్ఠు డసత్కథాలవణవాఃపూరంబుఁ దాఁ గ్రోలునే?
మందార మరందపాన కుతుకస్వాంతద్విరేఫంబు స
త్వమై పోవునె చేఁదు వేములకుఁ దద్గంధానుమోదాత్మమై.

టీకా:

హరి = విష్ణుని; నామ = నామమునకు; అంకిత = అంకితము చేయబడ్డ; సత్ = మంచి; కథా = కథలు అను; అమృత = అమృతము యొక్క; రస = రసములో; వ్యాలోలుడు = మిక్కిలి మునిగిపోయినవాడు; ఐనట్టి = అయినటువంటి; సత్ = మంచి; పురుష = పురుషులలో; శ్రేష్ఠుడు = గొప్పవాడు; అసత్ = చెడ్డ; కథ = కథలు అను; లవణ = ఉప్పు; వాః = నీటి; పూరంబులన్ =ప్రవాహములను; తాన్ = తను; క్రోలునే = తాగునా; వర = శ్రేష్ఠమైన; మందార = మందారపూల; మరంద = తేనెలను; పాన = తాగు; కుతుక = ఆశపడే; స్వాంత = మనసు కల; ద్విరేఫంబు = తుమ్మెద {ద్విరేఫంబు - రెండు రేఫల గానము చేయునది, తుమ్మెద}; సత్వరము = తొందరపడునది; ఐ = అయి; పోవునే = వెళ్ళునే; చేతి = చేదు; వేముల = వేపచెట్ల; కున్ = కు; తత్ = వాని; గంధ = వాసనల; అనుమోద = సమ్మతితో; ఆత్మము = కూడినది; ఐ = అయి.

భావము:

శ్రీహరి నామస్మరణ పరాయణమైన సరస కథలనే అమృతాన్ని ఆసక్తితో ఆస్వాదించి ఆనందించే సత్పురుషవరేణ్యుడు రసహీనమైన అసత్కథలనే ఉప్పునీటిని త్రాగాలని ఉబలాటపడతాడా? మధురమైన మందార మకరందాన్ని త్రాగి మైమరచే తుమ్మెద చేదువాసనలు వెదజల్లే వేపచెట్ల వైపు వెళ్ళాలని వేగిరపడుతుందా?

3-224-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిమహిమముఁ దన్నాభీ
సిజసంజాతుఁ డైన తురాననుఁడుం
రికించి యెఱుఁగఁ డన్న ని
మనుజులఁ జెప్పనేల త్త్వజ్ఞనిధీ!\

టీకా:

హరి = విష్ణుని; మహిమన్ = గొప్పదనమును; తత్ = అతని; నాభీ = బొడ్డు యొక్క; సరసిజ = పద్మమున {సరసిజ - సరసున పుట్టినది, పద్మము}; సంజాతుడు = పుట్టినవాడు; ఐన = అయినట్టి; చతురాననుడున్ = బ్రహ్మదేవుడు (కూడ) {చతురాననుడు - నాలుగు (చతుర) ముఖము (ఆననము)లవాడు, బ్రహ్మదేవుడు}; పరింకించి = వివరముగ చూచినను; ఎఱుగడు = తెలిసికొనలేడు; అన్నన్ = అనగా; ఇతర = మిగిలిన; మనుజులన్ = మానవుల విషయము; చెప్పన్ = చెప్పుట; ఏల = ఎందుకు; తత్త్వజ్ఞ = తత్త్వ జ్ఞానము కలవారిలో; నిధీ = నిధివంటివాడా.

భావము:

ఓ విదురా! తత్త్వవేత్తా! నారాయణుని మహిమను ఆయన నాభికమలం నుండి పుట్టిన నాలుగు ముఖాల బ్రహ్మకూడా తెలుసుకోలేడు అంటే, ఇక ఇతరుల విషయం చెప్పట మెందుకు.

3-225-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రుతులు దమలోన వివరించి చూచి పుండ
రీలోచను నుత్తమశ్లోచరితు
మరగణవంద్యమానపాదాబ్జయుగళు
వెదకి కనుఁగొనలే వండ్రు విమలమతులు.

టీకా:

శ్రుతులు = వేదములు కూడ; తమ = తమ; లోనన్ = లో; వివరించి = విచారించి; చూచి = చూసి; పుండరీకలోచనున్ = విష్ణుని {పుండరీకలోచనుడు -పుండరీకముల (పద్మముల) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; ఉత్తమశ్లోకచరితున్ = విష్ణుని {ఉత్తమశ్లోకచరితుడు - మంచిగా కీర్తింపబడు వర్తన కలవాడు, విష్ణువు}; అమరగణవంద్యమానపాదాబ్జయుగళు = విష్ణుని {అమరగణవంద్యమానపాదాబ్జయుగళుడు - దేవతాసమూహముల చే నమస్కరింపదగ్గ పాదములు అను పద్మముల జంట కలవాడు, విష్ణువు}; వెదకి = వెదకి; కనుగొనన్ = తెలుసుకొన; లేవు = లేవు; అండ్రు = అందురు; విమల = నిర్మలమైన; మతులు = బుద్ధి కలవారు.

భావము:

ఉత్తమశ్లోకుడూ ఉదారచరితుడూ, ముక్కోటి దేవతలు మ్రొక్కే చక్కని పాదపద్మాలు గలవాడూ అయిన ఆ దేవాది దేవుడిని వేదాలు కూడా తమలో తాము వితర్కించి, విచారించి వెదకి పూర్తిగా తెలుసుకోలేవని విజ్ఞులంటారు.

3-226-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రియుం దన మాయాగతిఁ
రికించియుఁ గానడయ్యె రిమితి లేమిన్
ఱి మాయా వినిమోహిత
రితముఁ గనుఁగొందు రెట్లు తురాస్యాదుల్.

టీకా:

హరియున్ = హరి కూడ; తన = తన; మాయన్ = మాయ; గతిన్ = విధామును; పరింకించియున్ = విచారించినను; కానడు = తెలిసికొనలేడు; అయ్యెన్ = ఆయెను; పరిమితి = అవధి; లేమిన్ = లేకపోవుటచేత; మఱి = మరియును; మాయా = మాయ యొక్క; వినిమోహిత = మిక్కిలి మోహింపజేయు; చరితమున్ = వర్తనమును; కనుగొందురు = తెలిసికొనగలరు; ఎట్లు = ఏనిధముగా; చతురాస్య = బ్రహ్మదేవుడు {చతురాస్యుడు - నాలుగు (చతుర) ముఖము (అస్యము)లవాడు, బ్రహ్మదేవుడు}; ఆదుల్ = మొదలగువారు.

భావము:

ఓ మహానుభావా! విదురా! ఆ హరికూడా అనంతమైన తన మాయావ్యవహారాన్ని అవగాహనం చేసుకోలేక పోయాడంటే మాయావిని అయిన ఆ మహామోహుని ప్రభావం బ్రహ్మాదులకు మాత్రం ఎలా అంతుపట్టుతుంది.

3-227-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దివిజాధీశుఁడు మహ
దాదులు దిక్పతులుఁ బంకజాసనుఁడున్ గౌ
రీయితుఁడు గనఁజాలని
శ్రీదేవుని పదయుగంబుఁ జింతింతు మదిన్."

టీకా:

ఆ = ఆ; దివిజాధీశుఁడు = ఇంద్రుడు {దివిజాధీశుఁడు - దేవతలకు ప్రభువు, ఇంద్రుడు}; మహత్ = మహత్తు; ఆదులు = మొదలగువారు; దిక్పతులు = దిక్పాలకులు; పంకజాసనుడున్ = బ్రహ్మదేవుడును {పంకజాసనుడు - పద్మము (పంకమున పుట్టినది) ఆసనముగా కలవాడు, బ్రహ్మదేవుడు}; గౌరీదయితుడున్ = శివుడు కూడ {గౌరీదయితుడు - పార్వతీదేవి (గౌరి) ప్రియుడు (దయితుడు), శివుడు}; కనన్ = చూడ; చాలని = లేని; శ్రీదేవుని = విష్ణుని {శ్రీదేవుడు - లక్ష్మీదేవి (శ్రీ) యొక్క దేవుడు, విష్ణువు}; పద = పాదముల; యుగమున్ = జంటను; చింతింతున్ = ధ్యానించెదను; మదిన్ = మనసులో.

భావము:

మహేంద్రుడూ, మహదాది తత్త్వాలూ, దిక్పాలకులూ, పద్మసంభవుడూ, పరమశివుడూ కూడా చూడలేని ఆ దేవదేవుని పాద పద్మాలను నా మనస్సులో ధ్యానిస్తాను.”

3-228-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని మైత్రేయుం డవ్విదు
రు కెఱిఁగించిన తెఱంగు రుచిరముగా న
ర్జుపౌత్రునకుఁ బరాశర
మునిమనుమం డెఱుఁగజెప్పె ముదము దలిర్పన్.

టీకా:

అని = అని; మైత్రేయుండు = మైత్రేయుడు; ఆ = ఆ; విదురున = విదురున; కున్ = కు; ఎఱింగించిన = తెలియజేసిన; తెఱంగున్ = విధమును; రుచిరముగాన్ = మనోహరముగా; అర్జునపౌత్రున = పరీక్షిత్తున {అర్జునపౌత్రుడు - అర్జునుని (కొడుకు అభిమన్యుని కొడుకు) మనుమడు, పరీక్షిత్తు}; కున్ = కు; పరాశరమునిమనుమడు = శుకయోగి {పరాశరముని మనుమడు - పరాశరుని (పుత్రుడు వ్యాసుడు అతని పుత్రుడు) మనుమడు, శుకయోగి}; ఎఱుగన్ = తెలియునట్లు; చెప్పెన్ = చెప్పెను; ముదము = సంతోషము; తలిర్పన్ = వికసించగా.

భావము:

అలా మైత్రేయ మహర్షి విదురునకు వెల్లడించిన విశేషాలను పార్థుని పౌత్రుడైన పరీక్షిత్తునకు పరాశరుని పౌత్ర్తుడైన శుకమహర్షి హర్షపూర్వకంగా విశదీకరించి మళ్ళీ ఇలా అన్నాడు.

3-229-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెండియు నిట్లనియె.

టీకా:

వెండియున్ = మఱియును; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఇంకా ఇలా అన్నాడు.

3-230-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"భూమీశ్వర! మైత్రేయ మ
హాముని విదురునకు నట్లు రిగుణ శుభలీ
లామాహాత్మ్యముఁ జెప్పిన
నా మైత్రేయునకు విదురుఁ నియెన్ మఱియున్.

టీకా:

భూమీశ్వర = రాజా {భూమీశ్వర - భూమికి ప్రభువు, రాజు}; మైత్రేయ = మైత్రేయుడు అను; మహా = గొప్ప; ముని = ముని; విదురున = విదురున; కున్ = కు; అట్లు = ఆవిధముగ; హరి = విష్ణుని; గుణ = గుణముల; శుభ = శుభకరమైన; లీలా = లీలలు యొక్క; మహాత్యమున్ = గొప్పదనమును; చెప్పినన్ = చెప్పగా; ఆ = ఆ; మైత్రేయున్ = మైత్రేయున; కున్ = కు; విదురుడు = విదురుడు; అనియెన్ = అనియెను; మఱియున్ = ఇంకనూ.

భావము:

పరీక్షిత్తూ! అలా మైత్రేయ మహాముని అత్యంత మంగళప్రదాలైన హరిలీలా మహత్త్వాలను విదురునికి విశదీకరించగా విని మైత్రేయునితో విదురుడు మళ్ళీ ఇలా అన్నాడు.

3-231-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"అగుణున కవికారునకున్
దవనోద్భవ వినాశ త్కర్మములుం
గులీలఁ బెట్టు లాతఁడు
గుణుండై యుండు టెట్టు సౌజన్యనిధీ!"

టీకా:

అగుణున్ = గుణములు లేనివాని; కిన్ = కి; అవికారున్ = వికారములు లేని వాని {వికారము - మానసిక లేదా రూపములలో కలుగు మార్పు లేదా సక్రమత లోని నష్టము}; కున్ = కి; జగత్ = లోకములను; అవన = రక్షించుట; ఉద్భవన = పుట్టుట; వినాశ = నశింపచేయుట అను; సత్ = మంచి; కర్మములున్ = కర్మములను; తగు = తగు; లీలన్ = లీలలు; ఎట్టులు = ఎలా చేయును; అతడు = అతడు; సగుణుండు = గుణములతో కూడినవాడు; ఐ = అయి; ఉండుట = ఉండుట; ఎట్టు = ఏలా అగును; సౌజన్య = మంచితనమునకు; నిధీ = నివాసమైనవాడ.

భావము:

ఓ సౌజన్యమూర్తీ! మైత్రేయా! భగవంతుడు నిర్గుణ పరబ్రహ్మ కదా; మరి ఈ లోకాలన్నీ పుట్టించటం రక్షించటం లయం చెయ్యటం ఆయన క్రీడావిశేషాలు కదా; నిర్గుణుడైన వానికి ఈ క్రీడలూ, ఈ లీలలూ ఎలా పొసగుతాయి? నిర్గుణుడైన ఈశ్వరుడు సగుణుడుగా ఎలా ఉంటాడు? ఇది పరస్పర విరుద్ధంగా లేదా?”

3-232-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యర్భకునిగతి నుకొని మైత్రేయ-
మునిఁ జూచి విదురుఁ డిట్లనియె మరల
"బాలుఁడు క్రీడావిలోమానసమున-
దీపించు లీలానురూపుఁ డగుచుఁ
గానిచోఁ గామానుతుఁడై రమించును-
ర్భకుఁ డర్థి వస్త్వంతరమున
ర్భకాంతరమున నైనను బాలకే-
ళీసంగుఁ డగుచు నోలినిఁ జరించు

3-232.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రియు నెపుడు నివృత్తుఁ డత్యంతతృప్తుఁ
గుట వర్తించు టెట్లు క్రీడాదు లందు
ఱియుఁ ద్రిగుణాత్మకంబైన మాయఁ గూడి
ఖిల జగములఁ గల్పించె నుట యెట్లు?

టీకా:

అని = అని; అర్భకుని = బాలుని, మూర్ఖుని; గతిన్ = వలె; అనుకొని = అనుకొని (తనను తాను); మైత్రేయ = మైత్రేయుడు అను; మునిన్ = మునిని; చూచి = చూసి; విదురుడు = విదురుడు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను; మరల = మళ్లా; బాలుడు = పిల్లవాడు; క్రీడా = ఆటలందు; విలోల = మునిగిపోయిన; మానమునన్ = మనసుతో; దీపించు = ప్రకాశించుట; లీలన్ = విధముగ; అనురూపుడు = అనుసరించు వాడు; అగుచున్ = అవుతూ; కానిచోన్ = కాకపోతే; కామ = కోరికల; అనుగతుడు = వెంటబడువాడు; ఐ = అయ్యి; రమించునున్ = ఆనందించును; అర్భకుండు = మూర్ఖుడు; అర్థిన్ = కోరి; వస్త్వంతరమున = విషయాంతరమున; అర్భక = మూర్ఖత్వమునకు; అంతరమున = వేరైనవిధమున; ఐనను = అయినప్పటికిని; బాల = పిల్లల; కేళీ = ఆటలందు; సంగుండు = తగుల్కొన్నవాడు; అగుచున్ = అవుతూ; ఓలిన్ = మరుగున; చరించు = వర్తించు; షవీ హరియున్ = విష్ణువు; ఎపుడు = ఎల్లప్పుడును; నివృత్తుడు = వర్తనములు లేనివాడు; అత్యంత = బహుమిక్కిలి {అతి - అత్యంతరము -అత్యంతము}; తృప్తుడు = తృప్తికలవాడు; అగుటన్ = అగుటచే; వర్తించుటన్ = ప్రవర్తించుట; ఎట్లు = ఏలా అగును; క్రీడా = క్రీడలు; ఆదులు = మొదలగువాని; అందు = అందులో; మఱియున్ = ఇంకనూ; త్రిగుణ = త్రిగుణములతో; ఆత్మకంబు = కలిసినది; ఐన = అయిన; మాయన్ = మాయతో; కూడి = కూడి; అఖిల = సమస్త; జగములన్ = లోకములను; కల్పించెన్ = సృష్టించెను; అనుట = అనుట; ఎట్లు = ఏలా అగును.

భావము:

అని అడిగి విదురుడు, ఒక వేళ భగవంతుడు బాలునిలాగ క్రీడిస్తాడేమో అనుకొని, మైత్రేయుణ్ణి చూచి మళ్ళీ ఇలా అన్నాడు “బాలుడు ఆడుకోవాలి అనుకున్నప్పుడు అతడి మనస్సు క్రీడలలో లగ్నమౌతుంది. అందుకు తగినట్లుగా ఆడుకుంటాడు. బాలుడు ఆడుకోటానికి ఆటవస్తువులు కావాలి. లేదా మరికొందరు బాలకులు కావాలి. అప్పుడు ఆనందంగా ఆట సాగుతుంది. కాని భగవంతుడు ఎటువంటి కోరికలు లేని వాడూ, నిత్య సంతృప్తుడూ గదా? అటువంటి వానికి ఆట లందు ఆసక్తి కలగటం అశ్చర్యంగా ఉంది. త్రిగుణాత్మకమైన మాయను సృష్టించి ఆ మాయవల్ల సమస్తలోకాలనూ కల్పించే కుతూహలం ఆయనకు ఎలా కలిగిందో చిత్రంగా ఉంది.

3-233-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మ్మాయచేత నీ ఖిలంబు సృజియించి-
పాలించి పొలియించి రమపురుషు
నఘాత్మ! దేశకాలావస్థ లందును-
నితరుల యందునహీనమైన
జ్ఞాస్వభావంబుఁ బూని యాప్రకృతితో-
నెబ్భంగిఁ గలసెఁ దానేక మయ్యుఁ
గోరి సమస్తశరీరంబు లందును-
జీవరూపమున వసించి యున్న

3-233.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జీవునకు దుర్భరక్లేశసిద్ధి యెట్టి
ర్మమున సంభవించెను? డఁగి నాదు
చిత్త మజ్ఞాన దుర్గమస్థితిఁ గలంగి
ధికఖేదంబు నొందెడు నఘచరిత!

టీకా:

ఆ = ఆ; మాయ = మాయ; చేతన్ = చేత; ఈ = ఈ; అఖిలంబున్ = సమస్తమును; సృజియించి = సృష్టించి; పాలించి = పాలించి; పొలియించి = నాశముజేసి; పరమపురుషుండు = విష్ణుమూర్తి; అనఘాత్మ = పుణ్యవంతుడా; దేశ = ప్రదేశము; కాలము = కాలముల; అవస్థలు = స్థితి విశేషములు; అందున్ = అందును; ఇతరుల = ఇతరముల; అందున్ = అందును; అహీనము = గొప్పది; ఐన = అయిన; జ్ఞాన = విజ్ఞానము కల; స్వభావంబున్ = లక్షణములను; పూని = ధరించి, సంకల్పించి; ఆ = ఆ; ప్రకృతి = ప్రకృతి; తోన్ = తోటి; ఎబ్భంగిన్ = ఏవిధముగ; కలసెన్ = కలిసెను; తాన్ = తను; ఏకము = ఒకడే; అయ్యున్ = అయినప్పటికిని; కోరి = కోరి; సమస్త = సమస్తమైన; శరీరంబులు = దేహములు; అందునున్ = అందును; జీవ = జీవము యొక్క; రూపమున = రూపములో; వసించి = నివసిస్తూ; ఉన్న = ఉన్నట్టి;
జీవున = జీవున; కున్ = కు; దుర్భర = భరింపలేని; క్లేశ = బాధలు; సిద్ధి = కలుగుట; ఎట్టి = ఎటువంటి; కర్మమున = కర్మములవలన; సంభవించెన్ = కలిగివవి; కడగి = పూని; నాదు = నాయొక్క; చిత్తము = మనసులో; అజ్ఞాన = అజ్ఞానమును; దుర్గమ = దాటలేని; స్థితిన్ = పరిస్థితికి; కలంగి = కలతపడి; అధిక = మిక్కిలి; ఖేదంబును = బాధను; ఒందెడున్ = పొందును; అనఘచరిత = పుణ్యవర్తన.

భావము:

ఓ పుణ్య మైత్రేయుడా! తన మాయచేత ఈ లోకాలన్నింటినీ సృష్టించి, పాలించి, లయంచేసే ఆ పరమాత్ముడు దేశం కాలం మొదలైన అవస్థలను కల్పించుతున్నాడు. ఇతరులను సృష్టించి వారియందు అఖండమైన జ్ఞానంతో వర్తిస్తున్నాడు. కేవలం జ్ఞాన స్వరూపుడైన భగవంతుడు ఆ ప్రకృతితో తాను ఏ విధంగా కలసి ఉంటాడు? దేవుడు ఒక్కడై ఉండి అన్ని శరీరాల్లోనూ జీవుడూగా వసించి ఉంటున్నాడు గదా; దేవుడైన జీవునకు భరింపరాని గర్భనరకం వంటి కష్టాలు ఏ కర్మ వల్ల సంభవిస్తున్నాయి? ఈ సందేహాలతో నామనస్సు చాల వ్యాకుల పడుతున్నది. ఈ అజ్ఞానావస్థ నుండి బయట పడలేక తల్లడిల్లి పోతున్నాను.

3-234-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదిగావున సూరిజనోత్తముండ వైన నీవు మదీయ మానసిక సంశ యంబులఁ దొలగింప నర్హుండవు" అని విదురుండు మైత్రేయమునీంద్రు నడిగె" నని బాదరాయఁతనూభవుం డభిమన్యునందనున కిట్లనియె

టీకా:

అదిగావున = అందుచేత; సూరి = పండితులైన {సూరి - పదునైన బుద్ధికలవాడు, పండితుడు}; జన = జనులలో; ఉత్తముండవు = ఉత్తమమైనవాడవు; ఐన = అయినట్టి; నీవు = నీవు; మదీయ = నాయొక్క; మానసిక = మనసులో కలిగిన; సంశయంబులన్ = అనుమానములను; తొలగింపన్ = తొలగించుటకు; అర్హుండవు = అర్హత కల వాడవు; అని = అని; విదురుండు = విదురుడు; మైత్రేయ = మైత్రేయుడు అను; ముని = మునులలో; ఇంద్రున్ =శ్రేష్ఠుని; అడిగెను = అడిగెను; అని = అని; బాదరాయ = వ్యాసుని {బాదరాయణుడు - బదరీవనవాసి, వేదవ్యాసుడు}; తనూభవుండు = పుత్రుడు; అభిమన్యు = అభిమన్యుని {అభిమన్యునందనుడు - పరీక్షిన్మహారాజు}; నందనున్ = పుత్రుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;

భావము:

ఈ నా మనస్సులోని సందేహాలను తొలగించడానికి విద్వాంసులలో అగ్రగణ్యుడవైన నీవే సమర్థుడవు” అని విదురుడు మైత్రేయుణ్ణి వేడుకున్నాడు” అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు.

3-235-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ససిరుహోదరు మంగళ
రితామృతపానకుతుక సంగంబున ని
ర్భరుఁ డగు విదురునకు మునీ
శ్వరుఁ డగు మైత్రేయుఁ డనియె జ్జనతిలకా!

టీకా:

సరసిరుహోదరు = విష్ణుని {సరసిరుహోదరుడు - పద్మము (సరసీరుహము) ఉదరమున కలవాడు, విష్ణువు}; మంగళ = శుభకరమైన; చరిత = కథలు అను; అమృత = అమృతమును; పాన = తాగు; కుతుకన్ = లాలసతో; సంగంబునన్ = కూడుట; నిర్భరుడు  = అధికముగా కలవాడు; అగు = అయిన; విదురున్ = విదురున; కున్ = కు; ముని = మునులలో; ఈశ్వరుడు = శ్రేష్ఠుడు; అగు = అయిన; మైత్రేయుడు = మైత్రేయుడు; అనియెన్ = పలికెను; సత్ = మంచి; జన = జనులో; తిలకా = శ్రేష్ఠుడా {తిలకా - నుదిటి తిలకము వలె ఉన్నత స్థానమున ఉండువాడ}.

భావము:

నృపకుల తిలకా! పరీక్షిత్తూ! కల్యాణదాయకమైన కమలనాభుని మధుర కథా సుధారసాన్ని ఆస్వాదించాలనే కుతూహలంతో ఉవ్విళ్ళూరుతున్న విదురునితో మహనీయుడైన మైత్రేయుడు ఇట్లా అన్నాడు.

3-236-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము వితర్కవాదములు విష్ణుని ఫుల్లసరోజపత్రనే
త్రుని ఘనమాయ నెప్పుడు విరోధముసేయుఁ బరేశు నిత్యశో
యుతు బంధనాధిక విద్దశలుం గృపణత్వ మెప్పుడే
యముఁ బొందలేవు విభుఁ డాద్యుఁ డనంతుఁడు నిత్యుఁ డౌటచేన్.

టీకా:

వినుము = విను; వితర్క = విపరీత తర్కములతో కూడిన; వాదములు = వాదములు; విష్ణుని = విష్ణుని; ఫుల్లసరోజపత్రనేత్రుని = విష్ణుని {ఫుల్లసరోజపత్రనేత్రుడు - వికసించిన (ఫుల్ల) పద్మముల (సరోజ) రేకులు (పత్ర)వంటి నేత్రములు కలవాడు, విష్ణువు}; ఘన = గొప్ప; మాయన్ = మహిమను; ఎప్పుడున్ = ఎప్పుడూ; విరోధముసేయున్ = వ్యతిరేకించును; పరేశు = విష్ణుని {పరేశుడు - పరమునకు (అన్నిటికి పైనున్న బ్రహ్మమునకు) అధిపతి, విష్ణువు}; నిత్యశోభనయుతు = విష్ణుని {నిత్యశోభనయుతుడు - శాశ్వతమైన శుభములతో కూడి ఉండువాడు, విష్ణువు}; బంధన = పరిస్థితులకు బంధీఅగుట; అధిక = మొదలగు; విపద్దశలున్ =ఆపదలను; కృపణత్వమున్ = దీనత్వమును; ఎప్పుడేని = ఎప్పుడునూ; అవశ్యము = బొత్తిగా; పొంద = పొంద; లేవు = లేవు; విభుండు = విష్ణుమూర్తి {విభుండు - ప్రభువు, విష్ణువు}; ఆద్యుడు = విష్ణుమూర్తి {ఆద్యుడు - సృష్టికి ముందు నుండి ఉన్నవాడు, విష్ణువు}; అనంతుడు = విష్ణుమూర్తి {అనంతుడు - అంతములేని వాడు , విష్ణువు}; నిత్యుడు = శాశ్వతుడు; ఔట = అగుట; చేన్ = చేత.

భావము:

“ఓ విదురా! వినవయ్యా! వికసించిన కమలాలవంటి కన్నులు గల విష్ణుదేవుని మాయ అజేయమైనది. కేవలం పిడివాదాలైన ఈ తర్కవితర్కాలు ఆ మాయను స్పృశింపలేవు. ఆయన ఆద్యుడు, అనంతుడు, నిత్యుడు అయిన కారణంగా నిత్య మంగళ స్వరూపుడైన ఆ పరమేశ్వరుణ్ణి ఈ బంధాలు, ప్రతి బంధాలూ, విపత్తులూ, విషాదాలూ అంటవు. ఆయన వీటి కన్నింటికీ అతీతుడు.

3-237-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియును.

టీకా:

మఱియున్ = ఇంకనూ.

భావము:

అంతేకాకుండా.

3-238-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురుషుఁడు నిద్రవోఁ గలల బొందు సమస్త సుఖంబు లాత్మసం
ణ శిరోవిఖండనము లాదిగ జీవునికిం బ్రబోధమం
యఁగఁ దోఁచుచున్నగతి నాదిఁ బరేశుఁడు బంధనాదులం
బొయక తక్కు టెట్లనుచు? బుద్ధిని సంశయ మందెదేనియున్.

టీకా:

పురుషుడు = పురుషుడు; నిద్రన్ = నిద్ర; పోన్ = పోయి; కలలన్ = కలలను; పొందు = పొందు; సమస్త = సమస్త; సుఖంబులున్ = సుఖములును; ఆత్మసంహరణ = తను చంపబడుట; శిరోవిఖండనము = తల నరకుట; ఆదిగ = మొదలగు; జీవునికిన్ = జీవునికి; ప్రబోధము = మెలకువ; అందు = లో; అరయగ = పరిశీలించి చూడగా; తోచుచున్న = తెలియుచున్న; గతిన్ = విధముగ; ఆదిన్ = మొదట; పరేశుడు = విష్ణుమూర్తి {పరేశుడు - పరమునకు (అన్నిచికి పైనున్న బ్రహ్మమునకు) అధిపతి, విష్ణువు}; బంధన = చిక్కులు; ఆదులన్ = మొదలగువానిలో; పొరయక = పొందకుండుట; తక్కుట = తప్పుకొనుట; ఎట్లు = ఏ విధముగ; అనుచున్ = అని; బుద్ధిని = మనసులో; సంశయము = అనుమానము; అందెదు = పొందెదవు; ఏనియున్ = అయినట్లైతే.

భావము:

ఇంకా విను. పురుషుడు నిద్రపోయే సమయంలో ఏవేవో కలలు వస్తాయి. ఎన్నో సుఖాలు పొందుతున్నట్లూ, తనను ఎవరో చంపేసినట్లూ, తన శిరస్సు ఖండించి వేసినట్లూ కలలు కంటాడు. మెలకువ వచ్చిన పిమ్మట అవన్నీ అసత్యాలని తెలుసుకుంటాడు. ఆ విధంగానే దేవుడు జీవుడుగా నటించునప్పుడు ఈ కష్టసుఖాలు ఏవీ ఆయనకు అంటవు. అయితే స్వప్నంలో ఉన్నంత కాలమూ జీవుడు పడే చిక్కులూ బాధలూ జీవుడుగా ఉన్న భగవంతునకు మాత్రం ఎందుకు కలుగవు అనే సందేహం కలిగినట్లైతే విను.

3-239-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అవ్విధం బతనికిం గలుగనేరదు; అది యెట్లంటేని.

టీకా:

ఆ = ఆ; విధంబు = విధముగ; అతనికిన్ = అతనికి; కలుగన్ = కలుగుటకు; నేరదు = వీలుకాదు; అది = అది; ఎట్లు = ఎట్లు; అంటేని = అంటే.

భావము:

భగవంతుడికి ఆ విధమైన బాధలూ బంధనాలూ ఏవీ అంటవు. అది ఎలాగంటే

3-240-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లిత విలోల నిర్మలజప్రతిబింబిత పూర్ణచంద్రమం
ము దదంబుచాలన విడంబనహేతువు నొందియున్ వియ
త్తమునఁ గంపమొందని విధంబున సర్వశరీరధర్మముల్
లిగి రమించు నీశునకుఁ ల్గఁగ నేరవు కర్మబంధముల్.

టీకా:

లలిత = అందమైన; విలోల = కదులుచున్న; నిర్మల = నిర్మలమైన; జల = నీటిలో; ప్రతిబింబిత = ప్రతిఫలించిన; పూర్ణ = నిండు; చంద్ర = చంద్ర; మండలము = బింబము; తత్ = ఆ; అంబు = నీటిలో; చాలన = కదలికలు; విడంబన = అనుకరించునట్టి; హేతువును = కారణము; ఒందియున్ = పొందియును; వియత్ = ఆకాశ; తలమునన్ = స్థలమున; కంపము = కదలికలు; ఒందని = పొందని; విధంబునన్ = విధముగ; సర్వ = సర్వమైన; శరీర = శరీర; ధర్మములు = లక్షణములు; కలిగి = కూడి ఉండి; రమించు = క్రీడించు; ఈశున్ = విష్ణుని; కున్ = కి; కల్గగ = కలుగ; నేరవు = సమర్థములు కావు; కర్మ = కర్మముల యొక్క; బంధముల్ = బంధములు.

భావము:

అందంగా అటూ ఇటూ కదలుతూ ఉన్న స్వచ్ఛమైన కోనేటి నీటిలో ప్రతిబింబించే నిండు పున్నమి నాటి చంద్రబింబం ఆ నీటి కదలిక వల్ల కదులు తున్నట్లు కన్పిస్తుంది. జలం కదలిక వల్ల ప్రతిబింబం కదలినా ఆకాశంలో ఉన్న చంద్రబింబం ఏ మాత్రం చలించదు. అదే విధంగా, సర్వజీవుల శరీర ధర్మాలను కలిగి క్రీడించే ఈశ్వరునకు కర్మబంధాలు ఏ మాత్రమూ అంటవు.

3-241-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున జీవునకు నవిద్యామహిమం జేసి కర్మబంధనాదికంబు సంప్రాప్తం బగు గాని సర్వభూతాంతర్యామి యైన యీశ్వరునకు బ్రాప్తంబు గానేర; దని.

టీకా:

కావున = కనుక; జీవున్ = జీవున; కున్ = కు; అవిద్యా = అజ్ఞానము యొక్క; మహిమన్ = ప్రభావమున; చేసి = వలన; కర్మ = కర్మల యొక్క; బంధన = బంధనములు; ఆదికంబులున్ = మొదలగునవి; సంప్రాప్తంబు = ప్రాప్తించుట; అగున్ = జరుగును; కాని = కాని; సర్వ = సర్వమైన; భూత = భూతములకును; అంతర్యామి = లోపల వసించువాడు; యైన = అయిన; ఈశ్వరున్ = విష్ణుని; కున్ = కి; ప్రాప్తంబున్ = ప్రాప్తించుట; కానేరదు = కాలేదు; అని = అని.

భావము:

కనుకనే, జీవునకు మాత్రమే అజ్ఞాన ప్రభావంవల్ల కర్మబంధాలు కలుగుతున్నాయి. కాని సర్వభూతాల్లో అంతర్యామిగా ఉండే పరాత్పరునకు బంధనాలు ప్రాప్తించవు.

3-242-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రునకు నాత్మదేహజ గుణంబులఁ బాపఁగనోపు పంకజో
చరణారవింద మహిస్ఫుటభక్తియ యింద్రియంబు లీ
శ్వ విషయంబు లైన మది సంచిత నిశ్చలతత్త్వమైనచో
సిజనేత్రుకీర్తనమె చాలు విపద్దశలన్ జయింపఁగన్.

టీకా:

నరునకున్ = మానవునకు; ఆత్మ = మనసున; దేహ = దేహమున; జ = జనించిన; గుణంబులన్ = గుణములను; పాపగన్ = పోగొట్ట; ఓపు = కలది; పంకజోదర = విష్ణుని {పంకజోదరుడు - ఉదరమున పద్మము (పంకజము) కలవాడు, విష్ణువు}; చరణ = పాదములు అను; అరవింద = పద్మములు యొక్క; మహిత = గొప్ప; స్ఫుట = గట్టి; భక్తియ = భక్తి మాత్రమే; ఇంద్రియంబులు = ఇంద్రియములు; ఈశ్వర = ఈశ్వరుని; విషయంబులు = సంబంధించినది; ఐన = అయిన; మదిన్ = మనసు; సంచిత = కూడబెట్టబడిన; నిశ్చల = నిశ్చలమైన; తత్త్వము = స్వభావము కలది; ఐనన్ = అయిన; చోన్ = ఎడల; సరసిజనేత్రు = విష్ణుని {సరసిజనేత్రుడు - పద్మముల(సరసున పుట్టునది) వంటి నేత్రములు కలవాడు, విష్ణువు}; కీర్తనమె = కీర్తించుటయే; చాలు = చాలు; విపద్దశలన్ = ఆపదల సమయమును {విపత్తు – ఆపద,ఇడుము, రోగములు అవమానములు, మృత్యువు, అప్పులు మొదలగునవి, వీనికి కారణములు ఆదిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికములు}; జయింపగన్ = దాటుటకు.

భావము:

మానవునకు తన శరీరం నుండి పుట్టిన గుణాలను పోగొట్టడానికి నారాయణుని పాదసరోజాలమీద విశేషించి విస్పష్టమైన భక్తి ఒకటే చాలు. అలాగే ఆపదలను బాపుకొనడానికి పంచేంద్రియాలను భగవంతుని అధీనంచేసి మనస్సును, చలించని ఉన్నతమైన ఏకాగ్రభావంతో నింపి ఆ సరోజాక్షుని సంకీర్తనం చేస్తే చాలు.

3-243-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిచరణారవిందయుగళార్చన సన్నుతి భక్తియోగముల్
నితము గల్గువారు భవ నీరజగర్భుల కందరాని భా
సుపద మందుఁ జేరుదురు సూరిజనస్తవనీయ! యట్టి స
త్పురుషుల పూర్వజన్మఫలమున్ గణుతింపఁ దరంబె యేరికిన్."

టీకా:

హరి = విష్ణుని; చరణ = పాదములు అను; అరవింద = పద్మములు యొక్క; యుగళ = జంటని; అర్చన = పూజించుట; సన్నుతి = కీర్తించుట; భక్తి = భక్తి కలిగి యుండుటలు; నిరతము = ఎల్లప్పుడును; కల్గు = కలుగు; వారు = వారు; భవ = శివునికి {భవుడు - శుభములను ఇచ్చువాడు, శివుడు}; నీరజగర్భులు = బ్రహ్మదేవువికిను {నీరజగర్భుడు - పద్మము (నీరజము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; అందరాని = దొరకని; భాసుర = ప్రకాశమానమైన; పదము = స్థానమును; అందున్ = అందు; చేరుదురు = చేరుతారు; సూరి = పండితులైన; జన = జనులచే; స్తవనీయ = స్తుతింపదగినవాడ; అట్టి = అటువంటి; సత్ = మంచి; పురుషుల = మానవుల; పూర్వ = ముందు; జన్మ = జన్మముల; ఫలమున్ = ఫలమును; గణుతింపగన్ = లెక్కించుటకు; తరంబె = తరమే; ఏరికిన్ = ఎవరికైనను.

భావము:

ఓ విదురా! నీవు విద్వజ్జనులుచే వినుతింపదగిన వర్తన గల వాడవు. ఎవరైతే శ్రీహరి పాదపద్మాలను పూజించుతూ సన్నుతించుతూ నిరంతరమూ భక్తియోగంలో సమాసక్తులై ఉంటూ ఉంటారో వారు, శివుడికీ బ్రహ్మదేవుడికీ సైతం అందకోరాని దివ్యమైన స్థానాన్ని చేరుకుంటారు. అటువంటి పుణ్యపురుషుల పూర్వజన్మ సుకృత విశేషాన్ని పొగడడానికి ఎటువంటి వారికైనా సరే చేతకాదు.”

3-244-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని చెప్పిన విదురుండు మైత్రేయుం గనుంగొని ముకుళిత హస్తుండును వినమిత మస్తకుండును నగుచుఁ దన మనంబున శ్రీహరిం దలంచుచు వినయవచనరచనుండై యిట్లనియె "మునీంద్రా! భవదీయ వాక్యములచేత నామనంబున నారాయణుండు లోకైకనాథుం డెట్లయ్యె ననియు, శరీరధారి యైన జీవునికిఁ గర్మబంధంబు లేరీతి సంభవించె ననియునుం బొడమిన సంశయంబు నేఁడు నివృత్తం బయ్యె; ఎట్లనిన లోకంబున కీశ్వరుండు హరి యనియు, జీవుండు పరతంత్రుం డనియునుఁ దలంపుదు; నారాయణ భక్తి ప్రభావంబు ప్రాణిగోచరం బైన యవిద్యకు నాశనకారణం బనం దనరుచుండు; నారాయణుండు దనకు నాధారంబు లేక సమస్తంబునకుం దాన యాధారభూతుం డై విశ్వంబుం బొదివి యందుఁ దా నుండు తెఱం గెట్లు; శరీరాభిమానంబును బొంది యెవ్వఁడు మూఢతముం డై సంసారప్రవర్తకుం డగు; నెవ్వండు భక్తిమార్గంబునఁ బరమాత్ముం డైన పుండరీకాక్షునిఁ జెందు; వీర లిద్దఱును సంశయ క్లేశంబులు లేమింజేసి సుఖానంద పరిపూర్ణులై యభివృద్ధి నొందువార లగుదురు; ఎవ్వండు సుఖదుఃఖాను సంధానంబుచే లోకానుగతుం డగుచుం బ్రమోద వేదనంబుల నొందు నతండు దుఃఖాశ్రయుండగు; నారాయణభజనంబున సమస్త దుఃఖనివారణం బగు నని భవదీయచరణసేవా నిమిత్తంబునం గంటి; ప్రపంచంబు ప్రతీతి మాత్రంబు గలిగియున్న దైన నందులకుఁ గారణంబు లేకుండుటంజేసి తెలియని వాడనై వర్తింతు" నని వెండియు.

టీకా:

అని = అని; చెప్పినన్ = చెప్పగా; విదురుండు = విదురుడు; మైత్రేయున్ = మైత్రేయుని; కనుంగొని = చూసి; ముకుళిత = నమస్కరిస్తున్న; హస్తుండును = చేతులు కలవాడును; వినమిత = నమ్రతతో వంగిన; మస్తకుండును = శిరస్సు కలవాడును; అగుచున్ = అవుతూ; తన = తన; మనంబునన్ = మనసులో; శ్రీహరిన్ = విష్ణుని; తలంచుచు = ధ్యానిస్తూ; వినయ = వినయపూర్వకమైన; వచన = సంభాషణములు; రచనుండు = చేయువాడు; ఐ = అయి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠుడా; భవదీయ = నీ యొక్క; వాక్యముల = మాటల; చేతన్ = చేత; నా = నా; మనంబునన్ = మనసులో; నారాయణుండు = విష్ణువు {నారాయణుండు - నారముల (నీటిలో) వసించువాడు, విష్ణువు}; లోకైకనాథుండు = విష్ణువు {లోకైకనాథుడు - లోకమునకు ఒకడే ఐన ప్రభువు, విష్ణువు}; ఎట్లు = ఏవిధముగ; అయ్యెను = ఆయెను; అనియున్ = అనియు; శరీరధారి = దేహమును ధరించిన వాడు; ఐన = అయిన; జీవున్ = జీవుని; కిన్ = కి; కర్మ = కర్మములందలి; బంధంబులు = బంధనములు; ఏరీతిన్ = ఏ విధముగ; సంభవించెన్ = కలుగెను; అనియునున్ = అనియు; పొడమిన = కలిగిన; సంశయంబు = అనుమానములు; నేడు = ఈరోజు; నివృత్తంబు = తీరినవి; అయ్యెన్ = ఆయెను; ఎట్లు = ఏ విధముగ; అనినన్ = అనగా; లోకంబున్ = లోకమున; కున్ = కి; ఈశ్వరుండు = ఈశ్వరుడు; హరి = విష్ణువు; అనియు = అనియును; జీవుండు = జీవుడు; పరతంత్రుండు = పరతంత్రుడు {పరతంత్రుడు - పరులచే నడపబడువాడు}; అనియున్ = అనియును; తలంపుదు = అనుకొనెదను; నారాయణ = విష్ణుని; భక్తి = భక్తి యొక్క; ప్రభావంబు = ప్రభావము; ప్రాణి = జీవులకు; గోచరంబు = కనిపించునది; ఐన = అయిన; అవిద్య = అవిద్య; కున్ = కు; నాశన = నాశనమున; కారణంబు = కారణము; అనన్ = అగుచు; తనరుచున్ = తెలియబడుచు; ఉండు = ఉండే; నారాయణుండు = విష్ణువు; తనకున్ = తనకు; ఆధారంబు = ఆధారము; లేక = లేక; సమస్తంబున్ = సమస్తమున; కున్ = కు; తాన = తాను; ఆధారభూతుండు = ఆధార వస్తువు; ఐ = అయి; విశ్వంబున్ = విశ్వమును; పొదవి = రూపొందించి; అందున్ = అందులో; తాన్ = తాను; ఉండు = ఉండెడి; తెఱంగు = విధము; ఎట్లు = ఏలాగ; శరీర = దేహమందలి; అభిమానంబున్ = అభిమానమును; పొంది = పొంది; ఎవ్వడు = ఎవరు; మూఢతముండు = అతిమిక్కిలి మూఢుడు {మూఢుడు - మూఢతరుడు - మూఢతముడు}; ఐ = అయి; సంసార = సంసారమందు; ప్రవర్తకుండు = తిరుగువాడు; అగు = అగును; ఎవ్వండు = ఎవరు; భక్తి = భక్తి; మార్గంబునన్ = మార్గములో; పరమాత్ముడు = పరబ్రహ్మ; ఐన = అయిన; పుండరీకాక్షునిన్ = విష్ణుని; చెందు = చెందునట్టి; వీరలు = వీరు; ఇద్దఱును = ఇద్దరును; సంశయ = అనుమానపు; క్లేశము = బాధలు; లేమిన్ = లేకపోవుట; చేసి = చేత; సుఖ = సుఖమును; ఆనంద = ఆనందములతో; పరిపూర్ణులు = సంతృప్తులు; ఐ = అయి; అభివృద్దిన్ = అభివృద్దిని; ఒందు = పొందు; వారలు = వారు; అగుదురు = అవుతారు; ఎవ్వండు = ఎవరు; సుఖ = సుఖమును; దుఃఖ = దుఃఖములను; అనుసంధానంబు = కలుగుట; చే = చేత; లోక = లోకమును; అనుగతుండు = బట్టి; ప్రమోద = సంతోషమును; వేదనంబులన్ = బాధలను; ఒందు = పొందునో; అతండు = అతడు; దుఃఖ = దుఃఖములను; ఆశ్రయుండు = ఆశ్రయించినవాడు; అగు = అగును; నారాయణ = భగవంతుని; భజనంబున = సేవించుటవలన; సమస్త = సమస్తమైన; దుఃఖ = దుఃఖములను; నివారణంబు = పోగొట్టబడుట; అగున్ = అగును; అని = అని; భవదీయ = నీ యొక్క; చరణ = పాదములను; సేవ = సేవించు; నిమిత్తంబునన్ = కారణము వలన; కంటి = తెలుసుకొంటి; ప్రపంచంబు = ప్రపంచము {ప్రపంచము - 1 పంచభూతములు 2 పంచకర్మేంద్రియములు 3 పంచజ్ఞానేంద్రియములు 4పంచతన్మాత్రలు 5 పంచవాయువులు (పంచ పంచముల) ఐదింటిచే ఏర్పడిన సృష్టి}; ప్రతీతి = ఉన్నదనిపించుటకు; మాత్రంబున్ = మాత్రమే; కలిగి = ఉండి; ఉన్నది = ఉన్నది; ఐనందులకు = అవుటకు; కారణంబు = కారణము; లేకుండుటన్ = లేకపోవుట; చేసి = వలన; తెలియని = తెలియని; వాడను = వాడిని; ఐ = అయి; వర్తింతును = ప్రవర్తింతును; అని = అని; వెండియు = మరల.

భావము:

అని మైత్రేయ మహాముని చెప్పగా వింటున్న విదురుడు ఒక్కమాటు తలయెత్తి మైత్రేయుణ్ణి చూసాడు. చేతులు జోడించి, శిరస్సు వంచి నమస్కరించాడు. తన మనస్సుతో శ్రీహరిని స్మరిస్తూ వినయమొలుకు పలుకులతో ఇలా అన్నాడు. మునిముఖ్యా! నారాయణుడు లోకానికి ఏకైక ప్రభువు ఎలా అయ్యాడు? శరీరాన్ని ధరించిన జీవునకు కర్మబంధాలు ఏ విధంగా కలిగాయి? అనే అనుమానాలు ఇప్పుడు మీ మాటలవల్ల తొలగిపోయాయి. సమస్త లోకాలకు ఈశ్వరుడైన శ్రీహరి సర్వస్వతంత్రుడనీ, జీవుడు అస్వతంత్రుడనీ తెలుసుకొన్నాను. నారాయణుని మీద భక్తి గల్గి ఉండటం ఒక్కటే జీవులోని అవిద్యను తొలగించడానికి మూలం అవుతుంది. అని భావిస్తున్నాను.
నారాయణుడు తనకు తాను ఏ ఆధారం లేకుండానే సమస్త లోకాలకి తానే ఆధారమైన ఈ విశ్వాన్నంతా పొదివి పట్టుకొని ఆ విశ్వంలోనే తానుండటం ఎలా కుదురుతుంది? ఎవడు కేవలం శరీరంపై అభిమానం పెంచుకొని పరమ మూర్ఖుడై సంసారాన్ని సాగిస్తూ ఉంటాడో, ఎవడు భక్తిమార్గంలో ప్రవర్తించి పరబ్రహ్మమైన శ్రీహరిని చేరుకుంటాడో వీళ్లిద్దరూ సంశయమూ క్లేశమూ లేనివారవటం వల్ల సుఖమూ ఆనందమూ అతిశయించినవారై అభివృద్ధి పొందుతారు. ఎవరు గొప్పవాడు ఎవడు సుఖిస్తాడు అనే సంశయ తర్కాలు దుఃఖాలు లేకుండడంవల్ల సుఖానందాల్ని సమృద్ధిగా పొందిన వారవుతారు. ఎవడు సుఖ దుఃఖాలలో మనస్సు నిలిపి లోకాన్ని అనుసరిస్తాడో వాడు సుఖదుఃఖాలు అనుభవిస్తూ చివరకు చిక్కులపాలవుతాడు.
నారాయణ సంసేవనంవల్ల సకలదుఃఖాలూ పటాపంచ లౌతాయని మీ పాదసేవవల్ల తెలుసుకొన్నాను. ఈ ప్రపంచం సమస్తం ఉన్నట్లుగా మనకు గోచరిస్తున్నది. అటువంటి ప్రతీతి కల్గి ఉండటానికి కారణం మాత్రం తెలియడం లేదు.

3-245-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"లలి నా మదిఁ దలఁపుదు సుమ
తులు గొనియాడంగఁ దగిన తోయజనాభుం
వడఁ డల్ప తపోనిర
తు తలపోఁతలకు మిగుల దుర్లభుఁ డనియున్.

టీకా:

లలిన్ = క్రమముగ; నా = నా; మదిన్ = మనసున; తలపుదు = అనుకొనెదను; సు = మంచి; మతులు = మనసు కలవారు; కొనియాడంగన్ = స్తుతించుటకు; తగిన = తగిన; తోయజనాభుండు = విష్ణుమూర్తి {తోయజనాభుడు - పద్మము (తోయమున జన్మంచునది) నాభిన కలవాడు, విష్ణువు}; అలవడడు = అందడు; అల్ప = కొంచము; తపస్ = తపస్సు; నిరతుల = చేయువారి; తలపోతల = ఊహల; కున్ = కు; మిగుల = మిక్కిలి; దుర్లభుడు = దొరకుట కష్టమైనవాడు; అనియున్ = అనియు.

భావము:

విజ్ఞులచే స్తుతింపబడువాడైన మధుసూదనుడు అంతంత మాత్రం తపస్సు చేసేవారి అలోచనలకు అందరానివాడు అని నా మనస్సులో అనుకుంటూ ఉంటాను.

3-246-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇంద్రియంబులతోడ నెలమి నొప్పెడి మహ-
దాదుల నితరేతరానుషంగ
ముగఁ జేసి వానియం దొగి విరాడ్దేహంబు-
పుట్టించి యందుఁ జేట్టి తాను
సియించు నాతఁడు రుస సహస్రసం-
ఖ్యాకంబులగు మస్తకాంఘ్రి బాహు
లిత సత్పురుషునిఁగా బ్రహ్మవాదులు-
లుకుదు రా విరాట్ప్రభువు నందు

3-246.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భువన జాలంబు లలజడి బొరయకుండుఁ
బ్రాణదశకంబు నింద్రియార్థములు నింద్రి
యాధిదైవతములుఁ గూడ నఘ త్రివిధ
గుచు విప్రాది వర్ణము య్యె నందు.

టీకా:

ఇంద్రియంబులన్ = ఇంద్రియములు; తోడన్ = తో; ఎలమిన్ = కుతూహలముతో; ఒప్పెడి = ఒప్పుతుండే; మహత్ = మహత్తు; ఆదులన్ = మొదలగువానిచే; ఇతరేతర = ఒకదానితోనొకటి; అనుషంగముగన్ = దగ్గరగా ఉండునట్లు; చేసి = చేసి; వాని = వాటి; అందున్ = అందు; ఒగిన్ = క్రమముగా; విరాడ్దేహంబున్ = విరాట్విగ్రహమును; పుట్టించి = సృష్టించి; అందున్ = అందులో; చేపట్టి = స్వీకరించి; తాను = తను; వసియించున్ = నివసించు; అతడు = అతడు; వరుసన్ = క్రమముగ; సహస్ర = వేలకొలది; సంఖ్యాకంబులు = సంఖ్యలలో; అగు = ఉండే; మస్తక = తలలు; అంఘ్రి = కాళ్ళు; బాహు = చేతులు; కలిత = కలిగిన; సత్పురుషునిగా = విష్ణునిగా {సత్పురుషుడు - నిజమైన పురుషుడు, విష్ణువు}; బ్రహ్మవాదులు = బ్రహ్మతత్వ ఉపదేశించువారు; పలుకుదురు = చెప్పుదురు; ఆ = ఆ; విరాట్ప్రభువున్ = విష్ణుమూర్తి {విరాట్ప్రభువు - విరాట్టు స్వరూపమై ప్రభావము చూపువాడు, విష్ణువు}; అందున్ = అందు;
భువన = లోకముల; జాలంబులున్ = గుత్తులు; అలజడిన్ = కలవరములు; పొరయక = పొందకుండగ; ఉండు = ఉండును; ప్రాణ = ప్రాణములు {ప్రాణదశకము - 1 ప్రాణము 2 అపానము 3 వ్యానము 4 ఉదానము 5 సమానము 6 నాగము 7 క్రుకరము 8 కూర్మము 9 దేవదత్తము 10 ధనంజయము అను దశప్రాణవాయువులు}; దశకంబున్ = పదియును; ఇంద్రియ = ఇంద్రియములకు; అర్థములు = అర్థమగునవి; ఇంద్రియ = ఇంద్రియములకు; అధి = అధిపతులు అగు; దైవతములు = దేవతలు; కూడన్ = కూడా; అనఘా = పుణ్యవంతుడా; త్రివిధము = త్రిగుణములతో {త్రిగుణములు - సత్వాది ,సత్త్వరజస్తమో గుణములు}; అగుచున్ = కూడినవి అవుతూ; విప్ర = బ్రాహ్మణులు {విప్రాది - చతుర్వర్ణములు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు}; ఆది = మొదలగు; వర్ణములు = వర్ణములు; అయ్యెన్ = ఆయెను; అందున్ = అందులో.

భావము:

భగవంతుడు ఇంద్రియాలతో కూడిన మహదాదులకు పరస్పర సంబంధం కల్పించి విరాట్ దేహాన్ని పుట్టించి అందు నివాసం చేస్తూ ఉంటాడు గదా బ్రహ్మవేత్తలైనవారు ఆ పరాత్పరుణ్ణి సహస్రశీర్షునిగా సహస్రపాదునిగా సహస్రబాహునిగా పేర్కొంటున్నారు. ఆ విరాట్పురుషునిలో అఖిల లోకాలూ అలజడి పొందకుండా ఉంటున్నాయి. అటువంటి విరాటం స్వరూపం నుండే పది ప్రాణాలూ, ఇంద్రియగోచరా లయిన విషయాలూ, ఇంద్రియాల కధిపతులైన దేవతలూ, మూడువిధాలైన బ్రాహ్మణాది వర్ణాలూ ఏర్పడ్డాయి.

3-247-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లఁ బుత్రపౌత్రసంపద
లిగిన వంశములతోడఁ డుఁ జోద్యముగా
లిఁ బ్రజ లేగతిఁ గలిగిరి
లిగిన యా ప్రజలచే జము లెట్లుండెన్?

టీకా:

ఇలన్ = భూమిమీద; పుత్ర = పుత్రులు; పౌత్ర = మనుమలు అను; సంపద = సంపద; కలిగినన్ = కలిగినట్టి; వంశముల = వంశముల; తోడన్ = తో; కడు = మిక్కిలి; చోద్యముగన్ = విచిత్రముగన్; లలిన్ = అతిశయించి; ప్రజలు = మానవులు; ఏ = ఏ; గతిన్ = విధముగ; కలిగిరి = పుట్టిరి; కలిగిన = పుట్టిన; ఆ = ఆ; ప్రజలన్ = ప్రజల; చేన్ = చే; జగములు = లోకములు; ఎట్లు = ఏ విధముగ; ఉండెన్ = ఉండెను.

భావము:

వీటిలోనుండి ఈ భూమిపై మహాశ్చర్యం కలిగేలా కొడుకులూ మనుమలూ అనే వంశపరంపరలతో పలురూపాల ప్రజలు ఏ విధంగా ఆవిర్భవించారు. ఆ ప్రజలతో నిండిన ఈ ప్రపంచం ఏ విధంగా ప్రవర్తిల్లుతున్నది?

3-248-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తురత దీపింపఁ బ్రజా
తులకుఁ బతి యనఁగ వెలయు ద్మాపతి యే
తిఁ బుట్టించెను? స్రష్టృ
ప్రతులచే నవవిధప్రపంచము మఱియున్.

టీకా:

చతురతన్ = నేర్పు; దీపింపన్ = ఒప్పుతుండగ; ప్రజాపతుల = ప్రజాపతుల; కున్ = కు; పతి = ప్రభువు; అనగన్ = అనగా; వెలయు = ప్రకాశించు; పద్మాపతి = విష్ణుమూర్తి {పద్మాపతి - పద్మ (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు}; ఏ = ఏ; గతిన్ = విధముగ; పుట్టించెను = పుట్టించెను; సష్టృ = బ్రహ్మల {సష్టృ - సృష్టికర్తలు, బ్రహ్మలు}; ప్రతతులన్ = సమూహము; నవవిధప్రపంచము = నవవిధసృష్టి కలది {నవవిధ ప్రపంచము - నవవిధసృష్టి కలది, 6 ప్రాకృత సృష్టులు (1 మహత్తు 2 అహంకారము 3 భూతసృష్టి 4 ఇంద్రియసృష్టి 5 దేవగణ 6 తామససృష్టి) మఱియు 3 వైకృతసృష్టులు (7 స్ఠావరములు 8 తిర్యక్కులు 9 ఆర్వాక్ స్రోతము (నరులు)) అను 9విధముల సృష్టులు కలది}; మఱియున్ = ఇంకనూ.

భావము:

ప్రజాపతులకు అధిపతియైన లక్ష్మీపతి చతురమతియై తాను సృష్టించిన ప్రజాపతులచే నవనవోన్మేషమైన ఈ ప్రపంచాన్ని ఏ విధంగా సృష్టింపజేశాడు?

3-249-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వానిభేదంబులును మనువంశములును
నుకులాధీశ్వరులునుఁ దన్మనుకులాను
రితములునే విభూతినే జాడ దీని
నింతయును బుట్టఁజేసె? నా కెఱుఁగఁ బలుకు.

టీకా:

వాని = వాటి; భేదంబులును = రకములను; మను = మనువుల {మనువులు - పద్నాలుగురు, 1 స్వాయంభువుడు 2 స్వారోచిషుడు 3 ఉత్తముడు 4 తామసుడు 5 రైవతుడు 6 చాక్షుసుడు 7 వైవస్వతుడు 8 సూర్యసావర్ణి 9 దక్షసావర్ణి 10 బ్రహ్మసావర్ణి 11 ధర్మసావర్ణి 12 రుద్రసావర్ణి 13 రౌచ్యుడు 14 భౌచ్యుడు ( పాఠాంతరములు కూడ కలవు) ప్రస్తుతము వైవశ్వతమన్వంతరము జరుగుచున్నది}; వంశములును = వంశములును; మను = మనువుల; కుల = కులములకు; అధీశ్వరులును = అధిపతులును; తత్ = ఆ; మను = మనువుల; అనుచరితములున్ = వర్తనములును; ఏ = ఏ; విభూతిన్ = ఐశ్వర్యమును; ఏ = ఏ; జాడన్ = మార్గమున; దీనిని = దీనిని; అంతయున్ = అంతనూ; పుట్టన్ = పుట్టునట్లు; చేసెన్ = చేసెను; నాకున్ = నాకున్; ఎఱుగన్ = తెలియునట్లు; పలుకు = చెప్పుము.

భావము:

ఆ సృష్టిభేదాలనూ, మనువంశాలనూ, మనువంశాల అధిపతులనూ, వంశానుచరితాలనూ భగవంతుడు ఎటువంటి మహామహిమతో ఎలా పుట్టించాడో నాకు తెలిసేలా చెప్పు.

3-250-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వింగ్రిందన్ మీఁదన్
ణికిఁ గల లోకములను త్తత్థ్సితులన్
రుసం బరిమాణంబుల
నెఱిఁగింపగదయ్య నాకు నిద్ధచరిత్రా!

టీకా:

సరవిన్ = వరుసగా; క్రిందన్ = క్రిందను; మీదన్ = మీదను; ధరణికిన్ = భూమికి; కల = ఉన్న; లోకములన్ = లోకములను; తత్ = ఆ; తత్ = యా; స్థితులను = పరిస్థితులను; వరుసన్ = వరుసగా; పరిమాణంబులన్ = కొలతలు, పరిమితులు; ఎఱిగింపగన్ = తెలుపుము; అయ్య = తండ్రి; నాకున్ = నాకు; ఇద్ద = పరిశుద్దమైన; చరిత్రా = వర్తనకలవాడా.

భావము:

ప్రసిద్ధమైన వర్తన గల ఓ మైత్రేయా! ఈ భూమికి దిగువనున్న లోకాలనూ, ఎగువనున్న లోకాలనూ వానివాని పరిస్థితులనూ వాటి పరిమాణములనూ నాకు వివరించు.

3-251-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సు తిర్యఙ్నర రాక్షస
రుడోరగ సిద్ధసాధ్య గంధర్వ నభ
శ్చముఖ భవములు మునికుం
! గర్భస్వేదజాండముల తెఱంగున్.

టీకా:

సుర = దేవతలు; తిర్యక్ = జంతువులు; నర = నరులు; రాక్షస = రాక్షసులు; గరుడ = గరుడులు; ఉరగ = సర్ప; సిద్ధ = సిధ్ధులు; సాధ్య = సాధ్యులు; గంధర్వ = గంధర్వులు; నభశ్చరములు = ఆకాశమున చరించునవి; ముఖ = మున్నగు; భవములు = పుట్టుకలు; ముని = మునులలో; కుంజర = శ్రేష్ఠుడా {కుంజర - ఏనుగు వంటివాడ, శ్రేష్ఠుడా}; గర్భ = గర్భము నందు; స్వేద = తేమ యందు; జ = పుట్టునవి; అండజముల = గ్రుడ్డున పుట్టు వాని; తెఱంగున్ = విధమును.

భావము:

మునికుల తిలకా! దేవతలు, జంతువులు, మనుష్యులు, రాక్షసులు, గరుడులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, ఖేచరులు మొదలైన వారంతా ఎలా పుట్టారు? ఇంకా గర్భజములూ, స్వేదజములూ, అండజములూ అయిన జీవులు జన్మించిన విధానం కూడా నాకు విశదీకరించు.

3-252-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్రిగుణప్రధానకంబులు
గునవతారములఁ బూర్ణమై వెలసిన యా
దుత్పత్తిస్థితిలయ
నిమముల విధంబు వాని నిలుకడలుఁ దగన్.

టీకా:

త్రిగుణ = త్రిగుణములు {త్రిగుణములు - సత్వాది, సత్త్వరజస్తమో గుణములు}; ప్రధానకంబులు = ప్రధానముగా కలవి; అగు = అయిన; అవతారములన్ = అవతారములను; పూర్ణము = నిండినవి; ఐ = అయి; వెలసిన = ఏర్పడిన; ఆ = ఆ; జగత్ = లోకములు; ఉత్పత్తి = సృష్టి; స్థితి = స్థితి; లయ = లయముల; నిగమముల = వేదముల; విధంబు = విధము; వాని = వాటి; నిలుకడలున్ = వర్తనములును; తగన్ = తగినట్లుగ.

భావము:

సత్త్వరజస్తమోగుణాలు ప్రధానంగా గల అవతారాలనూ, సమగ్రమైన ఈ జగత్తు జన్మస్థితి లయాలనూ, అవి ప్రవర్తించు విధాలనూ వాని శాశ్వతమైన ఉనికినీ నాకు తెలియజెప్పు.

3-253-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రాయుధు సౌందర్య ప
రాక్రమముఖ గుణములును ధరామరముఖ వ
ర్ణక్రమములు నాశ్రమధ
ర్మక్రియలును శీలవృత్తతభావములున్.

టీకా:

చక్రాయుధు = విష్ణుని {చక్రాయుధుడు - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు}; సౌందర్య = సౌందర్యము; పరాక్రమ = పరాక్రమము; ముఖ = మొదలగు ముఖ్యమైన; గుణములను = గుణములను; ధరామర = బ్రాహ్మణులు {ధరామరులు - భూమి (ధర)కు అమరులు (దేవతలు), బ్రాహ్మణులు}; ముఖ = మొదలగు; వర్ణ = చతుర్వర్ణముల {చతుర్వర్ణములు - బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నాలుగు వర్ణములు}; క్రమములున్ = విధమును; ఆశ్రమ = చతురాశ్రమముల {చతురాశ్రమములు - బ్రహ్మచర్య గృహస్త వానప్రస్త సన్యాసములు నాలుగు ఆశ్రమములు}; ధర్మ = ధర్మములు; క్రియలును = ఆచరించవలసిన పనులును; శీల = శీలము; వృత్త = ప్రవర్తన; భావములున్ = అభిప్రాయములును.

భావము:

జగన్నాథుడూ, చక్రధరుడూ అయిన విష్ణుని సౌందర్యం, పరాక్రమం మొదలైన సుగుణాలను వెల్లడించు, బ్రాహ్మణులు మొదలైన నాలుగు వర్ణాలనూ, బ్రహ్మచర్యం మొదలైన నాలుగు ఆశ్రమాలనూ, వారివారి ఆయా ధర్మాలనూ, కర్తవ్యాలనూ, స్వభావాలనూ, నడవడులనూ నాకు తెలుపు.

3-254-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యోవిస్తార మహిమలు యాములును
జ్ఞానమార్గంబులునుఁ బరిజ్ఞానసాధ
ములు నై యొప్పు సాంఖ్యయోములు వికచ
లజనయనకృతంబు లౌ శాస్త్రములును.

టీకా:

యోగ = యోగవిద్య యొక్క; విస్తార = విరివియైన; మహిమలు = గొప్పదనములు; యాగములు = వివిధయాగములు; జ్ఞాన = వివిధజ్ఞానముల; మార్గంబులును = మార్గములును; పరిజ్ఞాన = జ్ఞానమునకు; సాధనములును = పద్ధతులు; ఐ = అయి; ఒప్పు = ఒప్పుతుండు; సాంఖ్యయోగములు = సాంఖ్యయోగములు; వికచజలజనయన = విష్ణునిచేత {వికచజలజనయనుడు - వికసించిన పద్మము (జలజము), వంటి నయనములు (కన్నులు) ఉన్నవాడు}; కృతంబులు = చేయబడినవి; ఔ = అగు; శాస్త్రములును = శాస్త్రములును.

భావము:

యోగ విద్యలు వాని విశేష మహిమలూ, యాగాలూ, వాని విధానాలూ, జ్ఞానమార్గాలూ, విజ్ఞానసాధనాలైన సాంఖ్య యోగాలూ, శ్రీమన్నారాయణుని స్మరణమాత్రంచే సంజాతాలైన శాస్త్రాలూ నాకు చెప్పు.

3-255-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాషాండధర్మంబుఁ బ్రతిలోమకులవిభా-
ములు జీవుల గుణర్మములునుఁ
లుకులగతులునుఁ లిగెడి ధర్మమో-
క్షముల యందలి పరస్పరవిరోధ
ములు లేని సాధనమును భూమిపాలక-
నీతివార్తలు దండనీతిజాడ
యునుఁ బృథగ్భావంబులును విధానములునుఁ-
బితృమేధములునుఁ దత్పితృ విసర్గ

3-255.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తులుఁ దారాగ్రహంబులుఁ గాలచక్ర
మున వసించిన నిలుకడలును దపములు
దానములుఁ దత్ఫలంబులఁ నరు ప్రబల
ర్మములుఁ బ్రజ లొనరించు ర్మములును

టీకా:

పాషాండ = వేదములను అంగీకరించనివారి; ధర్మంబు = ధర్మములు; ప్రతిలోమ = ప్రతిలోమ వివాహములవలని {ప్రతిలోమకులములు - అశాస్త్రీయమైన వివాహములవలన పుట్టిన వంశములు, సమాన లేదా నిమ్న వర్ణమునుండి భార్యను పొందుట శాస్త్ర ధర్మము దానికి వ్యతిరేమము ప్రతిలోమము}; కుల = వంశముల; విభాగములు = రకములు; జీవుల = జీవుల; గుణ = గుణములు; కర్మములును = కర్మములును; పలుకుల = సంభాషణముల; గతులును = పద్ధతులు; కలిగెడి = కలిగి ఉండెడి; ధర్మ = ధర్మములు; మోక్షములు = మోక్షములు; అందలి = వాటిలో; పరస్పర = ఒకదానికొకటికి; విరోధములు = విరోధములు; లేని = లేనట్టి; సాధనమును = సాధనములును; భూమిపాలకనీతి = రాజనీతి {భూమిపాలకుడు - భూమిని పరిపాలించువాడు, రాజు}; వార్తలు = వృత్తాంతములు; దండనీతి = దండింపదగ్గవారిని దండించు విధానములు; జాడయును = చారుల, వేగు విద్య; పృథక్ = వివధ; భావంబులును = భావములును; విధానములును = విధానములును; పితృమేథములును = పితృయజ్ఞములును; తత్ = ఆ; పితృ = పితరులకు; విసర్గ = పిండప్రథానాది; వీ గతులును = పద్ధతులును; తారా = తారలు; గ్రహంబులున్ = గ్రహములును; కాలచక్రమున = కాలచక్రములో; వసించిన = ఉండు; నిలుకడలునున్ = సమయములు; తపములున్ = తపస్సులు; దానములున్ = దానములును; తత్ = ఆయా; ఫలంబులన్ = ఫలితములందు; తనరు = ఒప్పు; ప్రబల = విశేష, గట్టి; ధర్మములున్ = ధర్మములును; ప్రజలు = ప్రజలు; ఒనరించు = చేయు; కర్మములును = కర్మములును.

భావము:

నాస్తికు లయినవారి ప్రవర్తనలు యెటువంటివి? అశాస్ర్తీయమైన వివాహాలవల్ల ప్రభవించినవారిని విభజించు విధానం యేది? జీవుల గుణకర్మలు, మాటల తీరుతెన్నులు ఎటువంటివి? ధర్మమోక్షాల్లో అన్యోన్యం విరుద్ధం కాని సాధనలు ఎలాంటివి? రాజనీతి, దండనీతి, పంపకాల విధానాలు, పితృయజ్ఞాలు, పితృతర్పణాలు, తారలు, గ్రహాలు, ఈ కాల చక్రంలో వాటి నిలుకడలు, తపస్సులు, దానాలు, వాటి ఫలితాలు, విశేషధర్మాలు, ప్రజలు చేసే కర్మలు, వాటి ఫలితాలు నాకు తెలియజెప్పు.

3-256-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లక భూజనావళికి చ్చు విపద్దశధర్మముల్ సరో
ళనిభాక్షుఁ డేగతిని సంతసమందెడు నెట్టివారి మే
ల్వలక కానవచ్చు గురులం బ్రియశిష్యులు గొల్వ వారు స
మ్మమునఁ గోరునర్థములు మానుగ నెట్లెఱిఁగింతు రిమ్ములన్.

టీకా:

వదలక = విడువక; భూ = భూమిపై వసించు సర్వ; జనావళి = జనసమూహమున; కిన్ = కిని; వచ్చు = వచ్చునట్టి; విపద్దశ = ఆపదల; ధర్మముల్ = విధానములును; సరోజదళనిభాక్షుడు = విష్ణుమూర్తి {సరోజదళనిభాక్షుడు - సరోజ (పద్మముల) దళముల నిభ (వంటి) అక్షుడు (కన్నులున్నవాడు), విష్ణువు}; ఏ = ఏ; గతిన్ = విధముగ చేస్తే; సంతసము = సంతోషము; అందెడున్ = పొందునో; ఎట్టి = ఎటువంటి; వారి = వారి; మేల్ = పుణ్యము, ఉపకారము; వదలక = తప్పక; కానవచ్చు = ఫలించును; గురులన్ = గురువులను; ప్రియ = ప్రియమైన; శిష్యులు = శిష్యులు; కొల్వ = కొలువగా; వారు = వారు; సమ్మదమున = సమ్మతమగునట్లు; కోరున్ = కోరెడు; అర్థములు = విషయములు; మానుగన్ = చక్కగా; ఎట్లు = ఏవిధముగ; ఎఱింగింతురు = తెలిపెదరు; ఇమ్ములన్ = ఇంపుగా.

భావము:

భూలోకపు ప్రజలకు సంబంధించిన ఆపద్ధర్మాలు ఎలాంటివి? అరవిందాక్షుడైన శ్రీహరి ఏవిధంగా సంతోషిస్తాడు ఎటువంటివారు చేసిన మేలు ఎల్లప్పుడు కనిపిస్తూ ఉంటుంది. శిష్యులు గురువులను సేవించగా వారు సంతోషంగా కోరే పరమార్థాలూ, వాటిని చక్కగా తీర్చగల మార్గాలూ నాకు బోధించు.

3-257-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వియాది భేదముల న
య్యఘునిఁ బరమేశు నెవ్వ రంచితభక్తిం
గొలుతు రదెవ్వరిలో ను
త్కలికన్ సుఖియించు జీవత్త్వము మఱియున్.

టీకా:

విలయ = విలయములు; ఆది = మొదలగు; భేదములన్ = రకములను; ఆ = ఆ; అలఘునిన్ = విష్ణుని {అలఘుడు - గొప్పవాడు, విష్ణువు}; పరమేశున్ = విష్ణుని {పరమేశుడు - అత్యున్నతమైన ప్రభువు, విష్ణువు}; ఎవ్వరు = ఎవరు; అంచిత = చక్కటి; భక్తిన్ = భక్తితో; కొలుతురు = సేవింతురు; అది = అది; ఎవ్వరి = ఎవరి; లోన్ = అందు; ఉత్కలికన్ = సంతోషముతో; సుఖియించున్ = సుఖించును; జీవ = జీవుని; తత్త్వము = స్వభావము; మఱియున్ = ఇంకనూ.

భావము:

ప్రళయం ఎన్ని విధాలు సర్వేశ్వరుడైన పరాత్పరుణ్ణి ఎవరు అచంచల భక్తితో సేవిస్తారు. జీవతత్త్వం ఎవరిలో వికాసాతిశయంతో ప్రకాశిస్తుంది?

3-258-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గోవిందుని రూపంబున
జీబ్రహ్మలకు నైక్యసిద్దియు నెటులౌ
భాన నుపనిషదర్థం
బై వెలసెడి జ్ఞాన మెట్టి దార్యస్తుత్యా!

టీకా:

గోవిందుని = విష్ణుని {గోవిందుడు - గోవుల (నీళ్ళు)కి ఒడయుడు, నారాయణుడు, విష్ణువు}; రూపంబునన్ = ద్వారా, కారణమున; జీవ = జీవునికిని; బ్రహ్మల = పరబ్రహ్మల; కున్ = కిని; ఐక్య = ఐక్యము; సిద్ధియున్ = అగుట; ఎటుల = ఏ విధముగ; ఔ = అగును; భావనన్ = భావించుటకు; ఉపనిషత్ = ఉపనిషత్తుల; అర్థంబు = అర్థము; ఐ = అయి; వెలసెడి = ప్రకాశించెడి; జ్ఞానము = విజ్ఞానము; ఎట్టిది = ఎటువంటిది; ఆర్య = పూజ్యులచే; స్తుత్యా = స్తుతింపబడువాడా.

భావము:

మహాత్ములచే కీర్తింపడేవాడా! మైత్రేయా! గోవిందుని స్వరూప నిరూపణం ఎలాగు? జీవబ్రహ్మలకు ఏకత్వం ఎలా కలుగుతుంది. ఎటువంటి జ్ఞానం గలిగితే ఉపనిషత్తుల అర్థం ఊహకు అందుతుంది?

3-259-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిత మగు నట్టి శిష్యప్రయోజనములు
జ్జనులచేత విజ్ఞానసాధనములు
నేమి పలుకంగఁబడు వాని నెల్ల మఱియుఁ
బొలుచు వైరాగ్యమునఁ దగు పురుషభక్తి.

టీకా:

ఉచితము = తగినవి; అగు = అయిన; అట్టి = అటువంటి; శిష్య = శిష్యుల; ప్రయోజనములు = కార్యములు; సజ్జనులు = మంచివారి; చేతన్ = చేత; విజ్ఞాన = విజ్ఞానమును; సాధనములున్ = సాధనములు; ఏమి = ఎట్టివి; పలుకంగబడున్ = ఉపదేశింపబడును; వానిన్ = వాటిని; ఎల్లన్ = అన్నిటిని; మఱియున్ = ఇంకనూ; పొలుచు = అతిశయించు; వైరాగ్యమునన్ = వైరాగ్యములో; తగు = తగినవి; పురుష = విష్ణుని {పురుషుడు - లోకైకపురుషుడు, విష్ణువు}; భక్తిన్ = భక్తిని.

భావము:

ఉత్తములైన శిష్యులు కలిగినందువల్ల కలిగే ప్రయోజనాలూ, సజ్జనులు బోధించే విజ్ఞాన సాధనాలూ, వైరాగ్యం వల్ల ప్రకాశించే భగవద్భక్తి ఎటువంటివో వివరించు.

3-260-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నియుఁ దెలియనానతి యిచ్చి నన్ను
ర్థి రక్షింపు యజ్ఞదానాది పుణ్య
లము వేదంబు సదివిన లము నార్త
నులఁ గాచిన ఫలముతో మముగావు."

టీకా:

ఇన్నియున్ = ఇవన్నియును; తెలియన్ = తెలియునట్లు; ఆనతి = అనుగ్రహించి; యిచ్చి = చెప్పి; నన్నున్ = నన్ను; అర్థిన్ = కోరినవానిని; రక్షింపు = కాపాడుము; యజ్ఞ = యాగములు; దాన = దానములును; ఆది = మొదలగు వాని; పుణ్య = పుణ్యముల; ఫలము = ఫలితము; వేదంబున్ = వేదమును; చదివిన = అధ్యయనము చేసిన; ఫలము = ఫలితము; ఆర్త = సహాయమును అర్థించు; జనులన్ = వారిని; కాచిన = కాపాడిన; ఫలము = ఫలితము; తోన్ = తో; సమము = సమానము; కావు = కావు.

భావము:

వీటి నన్నింటినీ వివరంగా చెప్పి విపన్నుడైన నన్ను రక్షించు. యజ్ఞాలు చేసిన ఫలం; దానాలు ఇచ్చిన ఫలం; వేదాలు చదివిన ఫలం; ఇవన్నీ కలసి ఆర్తులైనఅర్థించిన వారిని ఆదరించిన ఫలంతో సమానం కావు.”

3-261-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని విదురుఁడు మైత్రేయుని
వియంబునఁ దెలియ నడుగు విధ మెల్లను వ్యా
సునిసుతుఁ డభిమన్యునినం
నున కెఱింగించి మఱియుఁ గ నిట్లనియెన్.

టీకా:

అని = అని; విదురుడు = విదురుడు; మైత్రేయుని = మైత్రేయుని; వినయంబునన్ = వినయముగా; తెలియన్ = తెలుపమని; అడుగు = అడిగిన; విధమున్ = విధానము; ఎల్లన్ = అంతయు; వ్యాసుని = వేదవ్యాసుని {వ్యాసుని సుతుడు - శుకమహర్షి}; సుతుడు = పుత్రుడు; అభిమన్యుని = అభిమన్యుని {అభిమన్యు నందనుడు - పరీక్షిత్తు}; నందనుని = పుత్రున; కిన్ = కిని; ఎఱిగించి = తెలిపి; మఱియున్ = మరల; తగన్ = చక్కగా; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అని వినయంగా విదురుడు మైత్రేయుణ్ణి అడిగినట్లు శుకమహర్షి పరీక్షిత్తునకు చెప్పి మళ్లీ ఇట్లా అన్నాడు.

3-262-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"లఁ గల మానవావళికి నెల్ల నుతింప భజింప యోగ్యమై
వెసిన పూరువంశము పవిత్రముసేయఁగఁ బుట్టి సద్గుణా
లిత యశఃప్రసూనలతికాతతికిం బ్రతివాసరంబుఁ బెం
రఁగ బ్రోదివెట్టుదు గయ్య ముకుందకథామృతంబునన్.

టీకా:

ఇలన్ = భూమిపై; కల = ఉన్న; మానవ = మానవుల; ఆళికిన్ = అందరి; కిన్ = కిని; ఎల్లన్ = ఎల్లప్పుడు; నుతింపన్ = కీర్తించుటకు; భజింపన్ = సేవించుటకును; యోగ్యము = తగినది; ఐ = అయి; వెలసిన = ప్రకాశించిన; పూరు = పూరువు యొక్క; వంశము = వంశము; పవిత్రమున్ = పవిత్రము ఆగునట్లు; చేయగన్ = చేయుటకు; పుట్టి = పుట్టి; సద్గుణా = సద్గుణములతో; కలిత = కూడిన; యశస్ = యశస్సు అను; ప్రసూన = పుష్ప; లతికా = లతల; తతి = గుంపున; కిన్ = కిని; ప్రతి = ప్రతి; వాసరంబున్ = దినమును; పెంపు = పుష్టితో; అలరగన్ = అలరునట్లు; ప్రోది = పోషణము; పెట్టుదు = ఇత్తువు; కదా = కదా; అయ్య = తండ్రి; ముకుంద = విష్ణుని {ముకుందుడు - ఎఱ్ఱతామర మాలలచే అలంకృతుడు, వ్యు . “ముకుమ్ + దా + క”, ‘ముకుమ్’ మకారాంతమైన అవ్యయము, మోక్షవాచకము, మోక్షమును ఇచ్చువాడు, విష్ణుమూర్తి}; కథా = కథలు అను; అమృతంబునన్ = అమృతముతో.

భావము:

“ఓ రాజా పరీక్షిత్తూ! భూలోకంలో గల ప్రజలందరికీ ప్రశంసనీయమూ, పూజనీయమూ అయింది పూరువంశం. అటువంటి పూరువంశాన్ని మరింత పవిత్రం చెయ్యటానికి జన్నించినవాడవు నీవు. మంచి గుణాలనే పుష్పాలతో నిండి నీ కీర్తి లతావితానానికి ప్రతిదినం కమలాక్ష కథాసుధారసం నింపి పెంపు కలిగిస్తూ ఉంటావు కదా.

3-263-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్పతరమైన సుఖముల నందుచున్న
నుల దుఃఖంబు మాన్పంగఁ జాలునట్టి
పుండరీకాక్షు గుణకథా ప్రోతమైన
విత నిగమార్థ మగు భాగము నీకు

టీకా:

అల్పతరము = మిక్కిలి అల్పమైన {అల్పము - అల్పతరము - అల్పతమము}; ఐన = అయిన; సుఖములన్ = సౌఖ్యములను; అందుచున్న = పొందుచున్న; జనులన్ = ప్రజల; దుఃఖంబు = దుఃఖము; మాన్పగన్ = పోగొట్ట; చాలున్ = కలిగిన; అట్టి = అటువంటి; పుండరీకాక్షున్ = విష్ణుని {పుండరీకాక్షుడు - పుండరీకములు (తెల్లతామరల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; గుణ = గుణములు; కథా = కథలుతోను; ప్రోతము = అల్లబడిన; ఐన = అయిన; వితత = విస్తారమైన; నిగమ = నిగమముల; అర్థము = సారము; అగు = అయిన; భాగవతము = భాగవతము; నీకున్ = నీకు.

భావము:

బహు అల్పములైన సుఖముల అందుచున్న, జనుల దుఃఖములను మాన్ప జాలువట్టి పుండరీకాక్ష గుణకథా పూరితమూ, వితత నిగమార్థ కలితము అయిన భాగవతము నీకు చెప్తాను.

3-264-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఎఱింగింతు విను" మని యిట్లనియె.

టీకా:

ఎఱింగింతున్ = తెలిపెపెదను; వినుము = విను; అని = అని; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.

భావము:

భాగవతం నీకు వివరిస్తాను, విను” అని శ్రీశుకుడూ పరీక్షిత్తుకు ఇలా చెప్పసాగాడు.

3-265-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మ్మహాభాగవతామ్నాయ మొకనాఁడు-
గైకొని పాతాళలో మందు
ప్రతీకజ్ఞానియై వాసుదేవాఖ్యఁ-
బొలుచు సంకర్షణమూర్తి దివ్య
పురుషుండు దనుఁదాన బుద్ధిలోఁ జూచుచు-
లితధ్యాన ముకుళితనేత్రుఁ
డై సనందాభ్యుదయార్థంబు గనువిచ్చి-
చూచిన వారు సంస్తుతు లొనర్ప

3-265.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మర గంగావగాహనులై యహీంద్ర
న్య లార్ధ్రజటాబంధలిత లగుచు
ర్తృ వాంఛానుబుద్ధి నప్పరమపురుషుఁ
దియ నేతెంచి తత్పాదమలయుగము.

టీకా:

ఆ = ఆ; మహా = గొప్ప; భాగవత = భాగవతము అను; ఆమ్నాయమున్ = వేదమును; ఒకనాడు = ఒకరోజు; కైకొని = స్వీకరించి; పాతాళ = పాతాళ; లోకమున్ = లోకము; అందున్ = లో; అప్రతీక = సంపూర్ణ; జ్ఞాని = జ్ఞాని; ఐ = అయ్యి; వాసుదేవ = వాసుదేవుడు అను; ఆఖ్యన్ = పేరుతో; పొలుచు = ప్రసిద్దికెక్కిన; సంకర్షణ మూర్తి = విష్ణుమూర్తి {సంకర్షణుడు - నామాదులను కరిగించుకున్న వాడు, విష్ణువు}; దివ్య = దివ్యమైన; పురుషుండు = పురుషుడు; తనున్ = తనను; తాను = తాను; బుద్ధిన్ = మనసు; లో = లో; చూచుచున్ = చూస్తూ; సలలిత = చక్కటి; ధ్యాన = ధ్యానమునందు; ముకుళిత = మూసిన; నేత్రుడు = కన్నులు కలవాడు; ఐ = అయ్యి; సనంద = సనందాదుల; అభ్యుదయ = వృద్ధి; అర్థంబున్ = కొరకు; కనున్ = కళ్ళు; విచ్చి = విప్పికొని; చూచినన్ = చూసినప్పుడు; వారు = వారు; సంస్తుతులు = చక్కటి స్తుతులు; ఒనర్పన్ = చేయగా; అమర = దేవ; గంగా = గంగ యందు; ఆవగాహనులు = స్నానము చేయువారు; ఐ = అయ్యి;
అహి = సర్పము లలో; ఇంద్ర = శ్రేష్ఠులైన; కన్యలు = కన్యలు; ఆర్ద్ర = తడిసిన; జటా = జడలు; బంధ = చుట్టులు; కలితలు = కలిగినవారు; అగుచున్ = అవుతూ; భర్తృ = భర్తగా కావలెనను; వాంఛా = కోరికతో; అను = కూడిన; బుద్ధిన్ = బుద్ధితో; ఆ = ఆ; పరమపురుషున్ = విష్ణుమూర్తి; కదియన్ = దగ్గరకు; ఏతెంచి = వచ్చి; తత్ = అతని; పాద = పాదములు అను; కమల = కమలముల; యుగము = జంటను.

భావము:

వాసుదేవుడు అనే పేరుతో ప్రకాశించేవాడూ, కేవల జ్ఞానస్వరూపుడూ, దివ్యపురుషుడు అయిన సంకర్షణుడు ఒకనాడు వేదసారమైన భాగవతాన్ని పాతాళలోకంలోనికి తీసుకొనిపోయాడు. తన మనస్సులో తన్ను తానే చూచుకొంటూ తదేక ధ్యానంలో కొద్దిసేపు కన్నులు మూసుకున్నాడు సంకర్షణుడు. సనక సనందనాదుల అభ్యుదయం కోరిన వాడై కన్నులు విప్పి చూచాడు. సనక సనందనాదులు సంస్తుతులు చేశారు. అంతలో ఆకాశగంగలో స్నానం చేసిన నాగకన్యకలు తడిసిన జడలతో జుట్టుముడులతో అచ్చటికి వచ్చారు. ఆ నాగకన్యలు ఆ దివ్యపురుషుడే తమకు భర్త కావాలని భావించారు. ఆ పరమపురుషుని సమీపించి ఆయన పాదపద్మాలను సేవించారు.

3-266-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సేవించి భక్తితో నా
నావిధ పూజోపహార తి నుతులను నా
దేవుని హృదయము వడసిరి
యా వేళ సనందనాదు మ్మహితాత్మున్.

టీకా:

సేవించి = సేవించి; భక్తితో = భక్తితో; నానా = అనేక; విధ = విధములైన; పూజ = పూజలు; ఉపహార = నైవేద్యములు; నతి = నమస్కారములు; నుతులనున్ = కీర్తించుటలతోను; ఆ = ఆ; దేవుని = విష్ణుదేవుని; హృదయమున్ = మనసును; పడసిరి = పొందిరి; ఆవేళ = ఆ సమయములో; సనందన = సనందన; ఆదులు = మొదలగువారు; ఆ = ఆ; మహితాత్మున్ = గొప్పవానిని.

భావము:

అలా సేవించి భక్తితో అనేక విధాలైన పూజలు చేశారు. కానుకలు సమర్పించారు. నమస్కరించారు. స్తోత్రాలతో ఆ దేవుని హృదయాన్ని వశపరచుకొన్నారు. ఆ సమయంలో సనక సనందనాదులు పరమ పురుషుణ్ణి ప్రస్తుతింపసాగారు.

3-267-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సాహస్ర కిరీటరత్న విలసత్కాంతప్రసిద్ధప్రభా
నితోదగ్ర రుచిప్రకాశిత ఫణాసాహస్రుఁ డౌ దేవతా
రక్షాచణు రూపకృత్యము లొగిన్ వాంఛం బ్రశంసించి వా
నురాగస్ఖలితోక్తు లొప్ప నడుగన్ ర్షించి యా దేవుడున్.

టీకా:

ఘన = గొప్ప; సాహస్ర = వేలకొలది; కిరీట = కిరీటము లందలి; రత్న = రత్నముల; విలసత్ = వెలువడుచున్; కాంత = మనోహరమైన; ప్రసిద్ధ = స్పష్టమైన; ప్రభా = కాంతుల వలన; జనిత = పుట్టిన; ఉదగ్ర = అతిశయించు; రుచి = వెలుగుచే; ప్రకాశిత = ప్రకాశిస్తున్న; ఫణా = పడగలు; సహస్రుడు = వేయి కలవాడు; ఔ = అవుతుండగ; దేవతా = దేవతలు అను; వన = సమూహమును; రక్షణా = రక్షించుట అను; చణుడు = లక్షణము కలవాని; రూప = రూపములు; కృత్యములున్ = వర్తనలు; ఒగిన్ = వరుసగా; వాంఛన్ = కోరికతో; ప్రశంసించి = స్తుతించి; వారు = వారు; అనురాగ = అనురాగము; స్ఖలిత = ఒలుకు; ఉక్తులన్ = పలుకులు; ఒప్పన్ = ఒప్పునట్లు; అడుగన్ = అడగగా; హర్షించి = సంతోషించి; ఆ = ఆ; దేవుడున్ = దేవుడును.

భావము:

ఆ దేవదేవుడు వేలకొలది శిరస్సులు కలిగి ఉన్నాడు. ఆ శిరస్సులపై కిరీటాలు అలంకరింపబడి ఉన్నాయి. ఆ కిరీటాలలోని రత్నాలు రమణీయమైన కాంతులు వెదజల్లుతున్నాయి. ఆ కాంతి పుంజాల వెనుక ఆదిశేషుని వేయిపడగలు సుందరంగా వెలుగొందుతున్నాయి. అటువంటి స్వామిని, దేవతలను రక్షించు ప్రభువును సంనందనాదులు మిక్కిలి వేడుకతో సంస్తుతించారు. ఆయన అవతారాలను, ఆయన చేసిన ఘనకార్యాలను ప్రశంసించారు. అలా స్తుతించేటప్పుడు వారి మాటలు దేవునిపై గల అనురాగం వల్ల తడబడ్డాయి. వారి సంస్తుతులకు ఆ దేవుడు సంతోషించాడు.

3-268-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూరి నిగమార్థసార విచా మగుచుఁ
నరు నీ భాగవతము సారతఁ బలికె
లినభవసూతి యైన సత్కుమార
కునకు నెఱిఁగించె సాంఖ్యాయనునకు నతఁడు.

టీకా:

భూరి = అతివిస్తారమైన; నిగమ = వేదముల; అర్థ = ప్రయోజనము; సార = సారమును; విచారము = తర్కించునది; అగుచున్ = అవుతూ; తనరు = అతిశయించునట్టి; ఈ = ఈ; భాగవతమున్ = భాగవతమును; సాదరతన్ = ఆదరముతో; పలికెన్ = పలికెను; నలినభవ = బ్రహ్మదేవుని {నలినభవుడు - నలినము (పద్మము)న భవ (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; సూతి = పుత్రుడు; ఐన = అయినట్టి; సనత్కుమారకున్ = సనత్కుమారున; కున్ = కు; ఎఱిగించెన్ = తెలిపెను; సాంఖ్యాయనున = సాంఖ్యాయనుడి {సాంఖ్యాయనుడు - సాంఖ్యమును అధ్యయనము చేసినవాడు}; కున్ = కి; అతడు = అతడు.

భావము:

సనక సనందనాదుల ప్రార్ధనలకు ప్రసన్నుడైన భగవంతుడు సమస్త వేదసారమై పరిఢవిల్లే ఈ భాగవతాన్ని బ్రహ్మదేవుని కుమారుడైన సనత్కుమారునికి సాదరంగా ఉపదేశించాడు. ఆయన సాంఖ్యాయనునకు వెల్లడించాడు.

3-269-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రఁగ నతం డంతఁ బరా
రునకు నుపదేశమిచ్చె; న్మతి నతఁడున్
సుగురున కొసఁగె; నాతఁడు
మరుదుగ నాకుఁ జెప్పఁ గైకొని యేనున్.

టీకా:

పరగన్ = ప్రసిద్దముగా; అతండు = అతడు; అంతన్ = అంతట; పరాశరున = పరాశరున; కున్ = కు; ఉపదేశము = ఉపదేశము; ఇచ్చెన్ = ఇచ్చెను; సత్ = మంచి; మతిన్ = మనసుతో; అతడున్ = అతడును; సురగురున = బృహస్పతి {సురగురుడు - దేవతల గురువు, బృహస్పతి}; కున్ = కి; ఒసగెన్ = ఇచ్చెను; ఆతడున్ = అతడు; కరము = మిక్కిలి; అరుదుగా = అపురూపముగా; నాకున్ = నాకు; చెప్పెన్ = చెప్పెను; కైకొని = స్వీకరించి; ఏనున్ = నేనును.

భావము:

ఆ సాంఖ్యాయనుడు మంచిమనస్సుతో పరాశరునకు ఉపదేశించాడు. పరాశరుడు సురగురువైన బృహస్పతికి తెలిపాడు. ఆయన ఏకాంతంగా నాకు (మైత్రేయునకు) చెప్పాడు.

3-270-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీ కిప్పుడు వివరించెద
నార్ణింపుము సరోరుహాక్షుండగు సు
శ్లోకుని చరితామృతపరి
షేకుఁడ వై ముదము గదురఁ జెలగుము విదురా!

టీకా:

నీకున్ = నీకు; ఇప్పుడు = ఇప్పుడు; వివరించెదన్ = వివరముగా చెప్పెదను; ఆకర్ణింపుము = వినుము; సరోరుహాక్షుండు = పద్మాక్షుడు {సరోరుహాక్షుడు - సరోరుహ (సరసున పుట్ట పద్మము) వంటి అక్షులు (కన్నులు) కలవాడు, విష్ణువు}; అగు = అయినట్టి; సుశ్లోకుని = విష్ణుని {సుశ్లోకుడు - మంచిగా కీర్తింపబడువాడు, విష్ణువు}; చరితము = వర్తనలు అను; అమృత = అమృతముచే; పరి = చక్కగా; షేకుడవు = మునిగినవాడవు; ఐ = అయి; ముదమున్ = సంతోషము; కదురన్ = కలుగగా; చెలగుము = చెలరేగుము; విదురా = విదురుడా.

భావము:

ఓ విదురా! నేను ఆ భాగవతాన్ని ఇప్పుడు నీకు వివరంగా చెబుతున్నాను. ఉత్తమశ్లోకుడైన పురుషోత్తముని చరిత్ర అనే అమృత వర్షంలో తడిసినవాడవై హర్షోత్కర్షంతో ఆకర్ణించు.