పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : సృష్టి క్రమంబు

 •  
 •  
 •  

2-36-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఖిల భూతములందు నాత్మరూపంబున-
నీశుండు హరి యుండు నెల్ల ప్రొద్దు,
బుద్ధ్యాది లక్షణంబులఁ గానఁబడును, మ-
త్సేవనీయుఁ డర్నిశంబు
వందనీయుఁడు, భక్త త్సలుం, డత్యంత-
నియతుఁడై సతతంబు నియతబుద్ధి
నాత్మరూపకుఁడగు రికథామృతమును-
ర్ణ పుటంబులఁ గాంక్ష దీరఁ

2-36.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గ్రోలుచుండెడు ధన్యులు కుటిలబహుళ
విషయ మలినీకృతాంగముల్ వేగ విడిచి,
విష్ణుదేవుని చరణారవింద యుగము
డకుఁ జనుదురు సిద్ధంబు కౌరవేంద్ర!

టీకా:

అఖిలన్ = సమస్తమైన; భూతములున్ = భూతములు; అందున్ = లోను; ఆత్మ = ఆత్మ అగు; రూపంబునన్ = రూపములో; ఈశుండు = అధిపతియైన; హరి = విష్ణువు; ఉండున్ = ఉండును; ఎల్ల = అన్ని; ప్రొద్దున్ = వేళలందును; బుద్ధి = బుద్ధి; ఆది = మొదలగు; లక్షణంబులన్ = లక్షణములలో; కానన్ = చూడ; పడునున్ = పడును; మహత్ = గొప్పవారిచే; సేవనీయుఁడు = సేవింపదగినవాడు; అహర్నిశంబున్ = ఎల్లప్పుడును; వందనీయుఁడు = నమస్కరించదగినవాడు; భక్త = భక్తులందు; వత్సలుండు = వాత్సల్యము కలవాడు; అత్యంత = మిక్కిలి; నియతుడున్ = నియముతోనుండువాడును; ఐ = అయ్యి; సతతంబున్ = ఎడతెగని; నియత = నిగ్రహింపబడుచున్న; బుద్ధిన్ = బుద్ధితో; ఆత్మ = ఆత్మ; రూపకుడు = రూపముకలవాడు; అగు = అయినట్టి; హరి = భగవంతుని; కథా = కథలు అను; అమృతంబున్ = అమృతమును; కర్ణ = చెవుల; పుటంబులన్ = డొప్పలలో; కాంక్షన్ = కోరిక; తీరన్ = తీరునట్లు; క్రోలుచున్ = తాగుచు; ఉండెడి = ఉండునట్టి;
ధన్యులు = అదృష్టవంతులు; కుటిల = వక్రమైన, చెడ్డ; బహుళ = అనేకమైన; విషయ = కోరికలచేత; మలినీకృత = మలినము చేయబడిన; అంగములన్ = శరీరములను; వేగన్ = తొదరగ; విడిచి = విడిచిపెట్టి; విష్ణుదేవునిన్ = హరియొక్క; చరణ = పాదములు అను; అరవింద = పద్మముల; యగమున్ = జంట; కడకున్ = వద్దకు; చనుదురు = వెళ్తారు; సిద్ధంబున్ = తప్పకుండగ; కౌరవ = కౌరవవంశస్తులలో; ఇంద్ర = శ్రేష్ఠుడా.

భావము:

జగదధిదేవుడు అయిన శ్రీమన్నారాయణుడు సమస్తప్రాణులలో సదా ఆత్మరూపుడై ఉన్నాడు. బుద్ధి మొదలైన లక్షణాలతో ఆయన మనకు గోచరిస్తాడు. విజ్ఞులకు ఆయన సేవింపదగినవాడు. సమస్తవేళల నమస్కరింపదగిన వాడు. భక్తుల మీద వాత్సల్యం కురిపించేవాడు. నియమ నిష్ఠలు కల్గి ఏకాగ్రమైన బుద్ధితో ఆత్మస్వరూపుడైన శ్రీహరి కథా సుధాపూరాన్ని తనివి దీరా, చెవులార గ్రోలేవారు ధన్యులు. అటువంటివారు కుటిలమైన పలువిషయాలతో దూషితాలైన తమ శరీరాలను త్వరగా త్యజించి విష్ణు దేవుని పాదపద్మాలను చేరుకుంటారు. కౌరవేశ్వరా! ఇది సత్యం.