పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : సృష్టి క్రమంబు

  •  
  •  
  •  

2-35-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను, మంభోజభవుండు మున్ను మదిలో వేదంబు ముమ్మాఱు ద
ర్శ యజ్ఞత్వముతోడ నెంతయుఁ బరార్శించి, మోక్షంబు ద
క్కి మార్గంబుల వెంట లే దనుచు భక్తిం జింత సేసెన్ జనా
ర్దను నాత్మాకృతి నిర్వికారుఁ డగుచుం న్మార్గ నిర్ణేతయై.

టీకా:

వినుము = వినుము; అంభోజ = (నీటిలో పుట్టిన) పద్మము నందు; భవుండున్ = పుట్టిన వాడు, బ్రహ్మ; మున్ను = పూర్వము; మదిన్ = మనసు; లోన్ = లో; వేదంబున్ = వేదమును; ముమ్మాఱు = మూడు (3) సార్లు; దర్శన = తరిచి చూచు; యజ్ఞత్వము = గట్టి ప్రయత్నము; తోడన్ = తో; ఎంతయున్ = ఎంతగానో; పరామర్శించి = పరిశీలించి; మోక్షంబున్ = మోక్షము; తక్కిన = ఇతరమైన; మార్గంబులన్ = మార్గముల; వెంటన్ = ద్వారా; లేదు = లేదు; అనుచున్ = అనుచు; భక్తిన్ = భక్తితో; చింతన్ = ధ్యానము; చేసెన్ = చేసెను; జనార్ధనున్ = విష్ణువును; ఆత్మా = తన యొక్క; ఆకృతిన్ = రూపములో; నిర్వికారుఁడు = వికార విమోచనుడు; అగుచున్ = అగుచు; తత్ = ఆ; మార్గ = మార్గమును; నిర్ణేత = నిర్మించినవాడు; ఐ = అయి.

భావము:

ఇది ఇంకా వివిరంగా చెపుతాను వినుము. పూర్వం బ్రహ్మ మనసులో మూడుసార్లు వేదాన్ని ధర్మపరాయణమైన దృష్టితో పరామర్శించాడు. అలా పరామర్శించి భక్తితో తప్ప మరో మార్గాన మోక్షం లభించదని నిశ్చయించాడు. ఆ మార్గాన్నే తరణోపాయంగా నిర్ణయించుకొని వికారానికి లోనుగాకుండా జనార్దనుని ఆత్మస్వరూపాన్ని భక్తితో ధ్యానించాడు.