పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : తాపసుని జీవయాత్ర

 •  
 •  
 •  

2-27-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"సన్నమరణార్థి యైన తీశుండు-
కాల దేశములను గాచికొనఁడు,
నువు విసర్జించు లఁపు జనించిన-
ద్రాసనస్థుఁడై, ప్రాణపవను
నసుచేత జయించి, మానసవేగంబు-
బుద్ధిచే భంగించి, బుద్ధిఁ దెచ్చి
క్షేత్రజ్ఞుతోఁ గూర్చి, క్షేత్రజ్ఞునాత్మలో-
లఁ జేర్చి, యాత్మను బ్రహ్మ మందుఁ

2-27.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లిపి యొక్కటి గావించి, గారవమున
శాంతితోడ నిరూఢుఁడై, కలకార్య
నివహ మెల్లను దిగనాడి, నిత్యసుఖము
లయు నని చూచు నటఁమీఁద సుమతీశ!

టీకా:

ఆసన్న = దగ్గరకువచ్చిన; మరణ = మరణమును; అర్థి = కోరువాడు; ఐన = అయినట్టి; యతి = యతులలో {యతి - ఇంద్రియములను నియమించి, అధిపత్యము పొందినవాడు}; ఈశుండు = శ్రేష్ఠుడు; కాల = కాలము మరియి; దేశములనున్ = ప్రదేశములు కోసము; కాచికొనఁడు = ఎదురుచూడడు; తనువు = శరీరము; విసర్జించు = వదలవలెనను; తలఁపు = ఆలోచన; జనించినన్ = పుట్టగానే; భద్ర = భద్రమైన - పద్మ {భద్ర, పద్మ ఆసనం - పాదములను తొడల పైకి ముడిచిన ఆసనము}; ఆసనస్థుఁడు = ఆసనమందు ఉన్నవాడు; ఐ = అయ్యి; ప్రాణపవనున్ = ప్రాణవాయువును; మనసు = మనస్సు; చేతన్ = వలన; జయించి = లొంగదీసుకొని; మానస = మనసు యొక్క; వేగంబున్ = చలించుటను; బుద్ధి = బుద్ధి; చేన్ = చేత; భంగించి = అరికట్టి; బుద్ధిన్ = బుద్ధిని; తెచ్చి = తీసుకొని వచ్చి; క్షేత్రజ్ఞున్ = జీవాత్మ {క్షేత్రజ్ఞుడు - బుద్ధి మొదలగువానికి ద్రష్ట ఐ ఉండువాడు}; తోన్ = తో; కూర్చి = కలిపి; క్షేత్రజ్ఞున్ = జీవాత్మను; ఆత్మ = శుద్ధాత్మ; లోపలన్ = అందు; చేర్చి = కలిపి; ఆత్మనున్ = శుద్ధాత్మను; బ్రహ్మము = పరమాత్మ; అందున్ = అందును; కలిపి = కలిపి;
ఒక్కటిన్ = ఐక్యము; కావించి = చేసి; గారవమునన్ = ఆదరముతో; శాంతి = శాంతి; తోడన్ = తో; నిరూఢుఁడు = ప్రసిద్ధుడు; ఐ = అయ్యి; సకల = సమస్త; కార్య = కార్యముల - పనుల; నివహ = సమూహములను; మెల్లను = స్థిమితముగ; దిగనాడి = విడిచిపెట్టి; నిత్య = నిత్యమైన; సుఖమున్ = ఆనందమును; వలయున్ = కావలెను; అని = అని; చూచున్ = అభిలషించును; అట = ఆ; మీఁదన్ = తరువాత; వసుమతి = భూమికి; ఈశ = ప్రభువా - రాజా.

భావము:

రాజా ప్రారబ్ధకర్మలు నశింపగా శరీరం త్యజించాలనుకొన్న యతి పుంగవుడు దేశకాలాలకోసం ఎదురుచూడడు. ఆ భావన కలగగానే అతడు సుఖాసనాసీను డవుతాడు. మనస్సుతో ప్రాణవాయువును నిగ్రహిస్తాడు. మనోవేగాన్ని బుద్ధితో అరి కడతాడు. బుద్ధిని క్షేత్రజ్ఞు డనబడే జీవాత్మతో పొందిస్తాడు. జీవాత్మను శుద్ధాత్మలో చేరుస్తాడు. శుద్ధాత్మను పరమాత్మలో లీనంచేస్తాడు. అలా చేసి శాంతాత్ముడై కార్యాలు / కర్మలు అన్నింటినీ పరిత్యజిస్తాడు. ఆపై నిత్యసుఖం కావాలని అభిలషిస్తాడు.