పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : తాపసుని జీవయాత్ర

  •  
  •  
  •  

2-25-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మొత్తుదురు గదల, మంటల
కెత్తుదు రడ్డంబు, దేహమింతింతలుగా
నొత్తుదు, రసిపత్రికలను
త్తుదురు కృతాంతభటులు రివిరహితులన్.

టీకా:

మొత్తుదురు = గట్టిగ కొట్టుదురు; గదలన్ = గదలతో; మంటలు = మంటలు; కిన్ = కి; ఎత్తుదురు = ఎత్తిపడవేయుదురు; అడ్డంబున్ = అడ్డముగ; దేహమున్ = శరీరమును; ఇంతింతలున్ = చిన్నచిన్నముక్కలు; కాన్ = అగునట్లు; ఒత్తుదురు = నొక్కి వేయుదురు; అసిపత్రికలను = కత్తుల వాదర (పదును అంచుల) తో; హత్తుదురు = నాట్లు పెట్టెదురు; కృతాంత = యముని; భటులు = భటులు; హరి = విష్ణుని; విరహితులన్ = ఇష్టపడనివారిని.

భావము:

భగవంతుని భజించని పాషండులను యమకింకరులు గదలతో మోదుతారు. వాళ్ల శరీరాలను మంటలలో వేస్తారు. వాళ్ల అవయవాలను కరకు కత్తులతో ముక్కలు ముక్కలుగా ఖండిస్తారు.