పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : తాపసుని జీవయాత్ర

  •  
  •  
  •  

2-21.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లరసాదులు గురియవే పాదపములు;
స్వాదుజలముల నుండవే కల నదులు;
పొసఁగ భిక్షము వెట్టరే పుణ్యసతులు;
నమదాంధుల కొలువేల తాపసులకు?

టీకా:

కమనీయ = చక్కని {కమనీయములు - మనోహరమైనది, కామ్యతే కమనీయం వా, కోరబడునది; అందముగా నున్నది.}; భూమి = చదునైననేల; భాగములు = ప్రదేశములు; లేకున్నవే = లేవా ఏమి; పడియుండుటకున్ = పండుకొనుటకు; దూది = దూది; పణుపులు = పరుపులు; ఏల = ఎందులకు; సహజంబులు = సహజమైనట్టి {సహజంబులు - తోడపుట్టినవి}; అగు = అయిన; కర = చేతి; అంజలులు = దోసిళ్ళు; లేకున్నవే = లేవా ఏమి; భోజన = భుజించు; భాజన = పాత్రల; పుంజము = గుంపు; ఏల = ఎందులకు; వల్కలు = నారచీరలు; అజిన = తోలువస్త్రములు; కుశ = దర్భ; ఆవళులు = కట్టలు - సమూహములు; లేకున్నవే = లేవా ఏమి; కట్టన్ = కట్టుటకు; దుకూల = నాణ్యమైన బట్టల; సంఘంబులు = గుట్టలు; ఏలన్ = ఎందులకు; కొనకొని = పూని; వసియింపన్ = నివసించుటకు; గుహలు = గుహలు; లేకున్నవే = లేవా ఏమి; ప్రసాద = మిద్దెలు; సౌధ = మేడలు; ఆది = మొదలగు; పటలము = పటాలము - గుంపు; ఏలన్ = ఎందులకు;
ఫలరస = పండ్లరసములు; ఆదులున్ = మొదలగునవి; కురియవే = వర్షించవా; పాదపములు = వృక్షములు {పాదపములు - పాదములు (వేళ్ళు) తో నీరు త్రాగునవి - చెట్లు}; స్వాదు = తీయని; జలములన్ = నీటితో; ఉండవే = ఉండవా ఏమి; సకల = సమస్తమైన; నదులు = నదీనదాలు; పొసగన్ = తగినట్లుగ; భిక్షమున్ = భిక్షములు; పెట్టరే = పెట్టరా ఏమి; పుణ్య = పుణ్యవంతులైన; సతులు = గృహిణులు; ధన = ధనముచేత; మద = గర్వము వలన; అంధులన్ = గ్రుడ్డి వారైన వారిని; కొలువన్ = కొలుచుటలు; ఏల = ఎందులకు; తాపసులు = ఋషులు; కున్ = కు.

భావము:

బుద్ధిమంతులు భావనలు ఇలా ఉంటాయి. “పడుకోడానికి చక్కటి నేల ఉండగా, దూది పరుపు లెందుకు? పుట్టుకతో వచ్చిన చేతులు ఉండగా, ఇంకా కంచాలు గరిటలు ఎందుకు? నారచీరలు జింకచర్మాలు ధర్భచాపలు ఉండగా, ఇంకా పట్టుబట్టలు అవి ఎందుకు? చక్కగా ఉండటానికి గుహలు ఉండగా, మేడలు భవనాలు ఎందుకు? చక్కగా రసవంతమైన పళ్ళు కాసే చెట్లు, తియ్యటి మంచి నీటిని యిచ్చే నదులు, పుష్కలంగా భిక్ష పెట్టే పుణ్యస్త్రీలు ఉండగా, హాయిగా తపస్సులు చేసుకొనేవానికి, ధనమదంతో కన్నుమిన్ను కానని వాళ్ళని పోయి ఎందుకు సేవించటం?”
ముక్తికోరుతున్న పరీక్షిన్మహారాజునకు అవధూతోత్తముడు శుకబ్రహ్మ విరక్తి మార్గం చేపట్టి, తపస్సు చేసుకొనే జ్ఞానవంతుల ఆలోచనా సరళి జీవన విధానాలను ఇలా వివరించాడు.