పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : విరాట్స్వరూపము తెలుపుట

  •  
  •  
  •  

2-19-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హు వర్షంబులు బ్రహ్మ తొల్లి జగ ముత్పాదింప విన్నాణి గా
రిప్రార్థన ధారణా వశమునం గాదే; యమోఘోల్లస
న్మనీయోజ్వల బుద్ధియై భువననిర్మాణప్రభావంబుతో
విరించెన్ నరనాథ! జంతునివహావిర్భావనిర్ణేతయై.

టీకా:

బహు = చాలా; వర్షంబులున్ = సంవత్సరములు వరకు; బ్రహ్మ = బ్రహ్మ; తొల్లి = పూర్వము; జగమున్ = జగత్తును - లోకములను; ఉత్పాదింపన్ = సృష్టి చేయుటకు; విన్నాణిన్ = నేర్పు కలవాడు; కాక = కాకపోయి; హరిన్ = విష్ణుమూర్తి; ప్రార్థనన్ = ప్రార్థన యొక్క; ధారణా = ధారణము; వశంబునన్ = వలననే; కాదే = కదా; అమోఘ = అమోఘమైన, వ్యర్థము గాని; ఉల్లసత్ = విప్పారుతున్న; మహనీయ = గొప్పదైన, గౌరవింపదగిన దైన; ఉజ్వల = ప్రకాశించుతున్న; బుద్ధి = బుద్ధి బలము కలవాడు; ఐ = అయి; భువన = విశ్వమును; నిర్మాణ = నిర్మించగలుగు; ప్రభావంబు = శక్తి; తోన్ = తో; విహరించెన్ = ప్రవర్తిల్లెను; నరనాథ = రాజా; జంతు = జంతువుల; నివహ = సమూహముల; ఆవిర్భావ = ఆవిర్భవించుటను, పుట్టుటను; నిర్ణేత = నిర్ణయించువాడు; ఐ = అయి.

భావము:

మహారాజా! పరీక్షిత్తు! పూర్వం ఆదిలో బ్రహ్మ జగత్తును సృష్టించాలనుకొన్నాడు. పెక్కేండ్లు ప్రయత్నించాడు. అయినా నేర్పరి కాలేకపోయాడు. ఆ పైన ఏకాగ్రచిత్తంతో నారాయణుని ప్రార్థించాడు. ఆ ధారణ వలన మహోన్నతమైన బుద్ధి వికాసం పొందాడు. పిమ్మట ప్రాణి కోట్ల పుట్టుకను నిర్ణయించి జగన్నిర్మాణదక్షుడై విహరించాడు.