పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : విరాట్స్వరూపము తెలుపుట

  •  
  •  
  •  

2-18-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లలోన జీవుండు కౌతూహలంబునఁ-
బెక్కు దేహంబులఁ బేరువడసి,
యింద్రియంబుల వెంట నెల్లవృత్తంబులు-
నీక్షించి మఱి తన్ను నెఱుఁగు కరణి,
ఖిలాంతరాత్మకుఁగు పరమేశ్వరుఁ-
ఖిల జీవుల హృదముల నుండి
బుద్ధి వృత్తుల నెల్ల బోద్ధ యై వీక్షించు-
ద్ధుండు గాఁడు ప్రావము వలన,

2-18.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్యుఁ డానంద బహుళ విజ్ఞానమూర్తి
తని సేవింప నగుఁగాక, న్యసేవఁ
లుగనేరవు కైవల్య గౌరవములు
పాయ దెన్నఁడు సంసారబంధ మధిప!

టీకా:

కల = కల - స్వప్నము; లోనన్ = లో; జీవుండు = ప్రాణి; కౌతూహలమునన్ = కుతూహలముతో; పెక్కు = అనేకమైన; దేహంబులన్ = శరీరములలో; పేరున్ = కీర్తులు; పడసి = పొంది; ఇంద్రియంబులన్ = ఇంద్రియముల; వెంటన్ = వలన; ఎల్ల = అన్ని; వృత్తములున్ = విషయములు; ఈక్షించి = చూసిన; మఱిన్ = అప్పటికిని; తన్నున్ = తనను; ఎఱుంగున్ = తెలియును; కరణిన్ = ఆవిధముగనే; అఖిల = సమస్తములకును; అంతరాత్మకుఁడు = లోపల ఉండు ఆత్మ ఐన వాడు; అగు = అయినట్టి; పరమ = పరమమైన; ఈశ్వరుండు = ప్రభువు; అఖిల = సమస్త; జీవుల = జీవుల యొక్క; హృదయములన్ = హృదయములలోను; ఉండి = ఉండి; బుద్ధి = బుద్దులను; వృత్తులన్ = ప్రవర్తనలను; ఎల్లన్ = అన్నిటిని; బోద్ధ = తెలిసికొనువాడు - జ్ఞాని; ఐ = అయ్యి; వీక్షించున్ = చూచుచుండును; బద్దుండున్ = బంధింపబడినవాడు; కాడు = కాకుండును; ప్రాభవము = ప్రభుత్వము - నడపు అదికారము {ప్రాభవము - ప్రభావము కలిగి ఉండుట - ప్రభావము చేయ కలవాడు ప్రభువు అతని తత్వము ప్రభుత్వము}; వలనన్ = వలన;
సత్యుఁడు = సత్యమైన వాడు; ఆనంద = ఆనందము; బహుళ = మిక్కిలి; విజ్ఞాన = విజ్ఞానము లకు; మూర్తి = స్వరూపుడు; అతనిన్ = అతనిని; సేవింపన్ = సేవించుట; అగున్ = తగును; కాఁక = కాకుండగ; అన్య = ఇతరమైన; సేవన్ = సేవిండుటలు వలన; కలుగన్ = కలుగట; నేరవు = జరుగవు; కైవల్య = మోక్షముపొందుటను; గౌరవములున్ = గౌరవములు; పాయదు = వదలదు; ఎన్నడున్ = ఎప్పటికిని; సంసార = సంసారముయొక్క; బంధమున్ = బంధనములు; అధిపా = గొప్పవాడా - రాజా.

భావము:

రాజా! కలలు కనేటప్పుడు జీవుడు ఉబలాటంతో పలు శరీరాలు ధరిస్తాడు. పలుపేర్లతో వ్యవహరింప బడతాడు. ఇంద్రియాల ద్వారా విశేషాలన్నీ గమనిస్తాడు. పిమ్మట మెళకువ వచ్చిన తరువాత, తన్ను తాను తెలుసుకుంటాడు. ఇలాగే సమస్తానికి అంతరాత్మగా ఉన్న పరమేశ్వరుడు, సర్వ ప్రాణుల హృదయాలలో ఉండి ప్రజ్ఞావంతుడై బుద్ధివ్యాపారా లన్నింటినీ పరిశీలిస్తుంటాడు. తానే అన్నిటికీ ప్రభువు కాబట్టి, దేనికీ బద్ధుడు కాడు. తాను సత్యస్వరూపుడు. ఆనదంతో నిండిన విజ్ఞానమూర్తి. ఆయన సేవ వల్లే మోక్షం సిద్ధిస్తుంది. ఇతరులను కొలిస్తే మోక్షం లభించదు. ఈ సంసార బంధం వదలదు.