పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : ధారణా యోగ విషయంబు

  •  
  •  
  •  

2-14-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని రాజునకు నవధూత విభుం డిట్లనియె.

టీకా:

అనిన = అనగా; విని = విని; రాజు = పరీక్షన్మహారాజు; కున్ = నకు; అవధూత = అవధూతలలో, సన్యాసులలో {అవధూత - బ్రహ్మనిష్ఠతో వర్ణాశ్రమాచారములను విడిచిన సన్యాసి, దిగంబర రూప సన్యాసి}; విభుండు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఆ మాటలు విని అవధూతలలో శ్రేష్ఠుడైన శుకుడు పరీక్షిత్తు మహారాజును జూసి ఇలా పలికాడు.