పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : ఖట్వాంగు మోక్ష ప్రకారంబు

  •  
  •  
  •  

2-9-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కౌరవేశ్వర! తొల్లి ట్వాంగుఁడను విభుం-
డిలనేడు దీవులనేలుచుండి,
క్రాది దివిజులు సంగ్రామభూముల-
నుగ్రదానవులకు నోడి వచ్చి
మకుఁ దో డడిగిన, రనుండి దివి కేఁగి-
దానవవిభుల నంఱ వధింప,
'ర మిత్తు' మనుచు దేతలు సంభాషింప,-
  'జీవితకాలంబు సెప్పుఁ డిదియ

2-9.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రము నాకు నొండు రమొల్ల' ననవుడు,
నాయు వొక ముహూర్తమంత తడవు
ల దటంచుఁ బలుక, గనయానమున న
మ్మానవేశ్వరుండు హికి వచ్చి.
[ఖట్వాంగుని మోక్షం]

టీకా:

కౌరవేశ్వర = పరీక్షిన్మహారాజా {కౌరవేశ్వరుడు - కురువంశపు రాజు, పరీక్షిత్తు}; తొల్లి = పూర్వము; ఖట్వాంగుఁడు = ఖట్వాంగుడు {ఖట్వాంగుడు - సరియగు అంగములు కలవాడు - సప్త ఖండములు అంగములుగ కలవాడు (ఖట్వము - మంచము)}; అను = అనబడు; విభుండు = రాజు; ఇలన్ = భూమిలోని; ఏడు = ఏడు (7); దీవులన్ = ఖండములను; ఏలుచుండి = పరిపాలిస్తూ; శక్ర = ఇంద్రుడు; ఆది = మొదలగు; దివిజులు = దేవతలు; సంగ్రామ = యుద్ధ; భూములన్ = భూములలో; ఉగ్ర = భీకరమైన; దానవులు = రాక్షసులు; కున్ = కు; ఓడి = పరాజితులై; వచ్చి = వచ్చి; తమ = వారల; కున్ = కు; తోడున్ = సహాయము; అడిగిన = అడుగగా; ధరన్ = భూమి; నుండి = నుండి; దివి = స్వర్గము; కిన్ = నకు; ఏగి = వెళ్లి; దానవ = రాక్షస; విభులన్ = రాజులను; అందఱన్ = అందరిని; వధింపన్ = సంహరించగ; వరమున్ = వరమును; ఇత్తుము = ఇచ్చెదము; అనుచున్ = అని; దేవతలు = దేవతలు; సంభాషింపన్ = అడుగగా; జీవిత = (శేష) జీవిత; కాలంబున్ = కాలమును; చెప్పుఁడు = చెప్పండి; ఇదియ = ఇదే;
వరము = వరము - కోరునది; నాకున్ = నాకు; ఒండు = మరియొక; వరమున్ = వరమును; ఒల్లన్ = అంగీకరించను; అనవుడున్ = అనగా; ఆయువు = శేషజీవితము; ఒక = ఒక; ముహూర్తము = ముహూర్త కాలము; అంత = అంత; తడవున్ = సమయము మాత్రమే; కలదు = ఉన్నది; అటంచున్ = అని; పలుకన్ = పలుకగ; గగన = ఆకాశ మార్గ; యానమున = ప్రయాణముతో; ఆ = ఆ; మానవ = మానవులకు; ఈశ్వరుడు = ప్రభువు - మహారాజు - ఖట్వాంగుడు; మహి = భూమి; కిని = కి; వచ్చి = వచ్చి.

భావము:

ఓ కౌరవరాజా! పరీక్షిత్తు! పూర్వం ఖట్వాంగు డనే రాజు భూమండలంలోని సప్తద్వీపాలనూ పరిపాలిస్తూ ఉండేవాడు. ఇంద్రాదిదేవతలు యుద్ధంలో భీకరులైన రాక్షసుల చేతుల్లో ఓడిపోయి, ఆయన దగ్గరకు వచ్చి తమకు సాయపడమని ప్రార్థించారు. ఆయన భూలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్లి దానవరాజుల నందరినీ సంహరించాడు. అప్పుడు దేవతలు సంతోషించి ఖట్వాంగుణ్ణి వరం కోరుకోమన్నారు. “నేనెంత కాలం బ్రతుకుతానో చెప్పండి. ఇదే నేను కోరే వరం, మరో వరం నా కక్కరలే” దన్నాడు ఆ మహానుభావుడు. “నీకు ఆయువు ఇక ఒక ముహూర్తకాలమే ఉంది.” అని వేల్పు లన్నారు. వెంటనే ఆ భూపాలుడు విమాన మెక్కి భూలోకానికి వచ్చాడు.