పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : ఖట్వాంగు మోక్ష ప్రకారంబు

  •  
  •  
  •  

2-10-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గిరులంబోలెడి కరులను,
రులం, దన ప్రాణదయితలై మనియెడి సుం
రులను, హితవరులను, బుధ
రులను వర్జించి గాఢవైరాగ్యమునన్.

టీకా:

గిరులన్ = కొండలను; పోలెడిన్ = సరిపోలు; కరులన్ = ఏనుగులను; హరులన్ = గుఱ్ఱములను; తన = తన యొక్క; ప్రాణదయితలు = ప్రాణప్రియులు, భార్యలు; ఐ = అయి; మనియెడి = ఉండెడి; సుందరులన్ = సౌందర్యవంతులను; హిత = మంచిని; వరులన్ = కోరువారలను; బుధ = తెలివి కలిగి సలహాలిచ్చు; వరులన్ = వారలను; వర్జించి = వదలివేసి; గాఢ = గట్టి, స్థిరమైన; వైరాగ్యమున్ = వైరాగ్యముతో {వైరాగ్యము - రాగబంధనములు లేకపోవుట}.

భావము:

అలా వచ్చిన ఖట్వాంగ మహారాజు ప్రగాఢమైన వైరాగ్యంతో పర్వతాలవంటి ఏనుగులను, గుఱ్ఱాలను, ప్రాణప్రియాలైన సుందరాంగులను, సన్నిహితులను, హితులను, పండితశ్రేష్ఠులను పరిత్యజించాడు.
(విడువరాని సకల భౌతికసంపదలను, బంధుమిత్రులను, మమత్వాలను చటుక్కున పరిత్యజించాడు)