పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శౌనకుడు సూతు నడుగుట

  •  
  •  
  •  

2-283-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వినుఁ డిపుడు మీరు నన్నడి
గి తెఱఁగున శుకమునీంద్రగేయుఁ బరీక్షి
జ్జపతి యడిగిన నతఁడా
ని కెఱిఁగించిన విధంబుఁ గ నెఱిఁగింతున్.

టీకా:

వినుఁడు = వినండి; ఇపుడున్ = ఇప్పుడు; మీరున్ = మీరు; నన్నున్ = నన్ను; అడిగిన = అడిగిన; తెఱంగునన్ = విధముగనే; శుక = శుకుడు అను; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠులచే; గేయున్ = కీర్తింపబడు వానిని; పరీక్షిత్ = పరీక్షిత్తు; జన = జనులకు; పతి = ప్రభువు, మహారాజు; అడిగిన = అడిగిన; అతఁడున్ = అతడు; ఆతనిన్ = అతనిని; కిన్ = కి; ఎఱింగించినన్ = తెలిపిన; విధంబుఁన్ = ప్రకారముగ; తగ = చక్కగ; ఎఱింగింతున్ = తెలిపెదను.

భావము:

"ఆధ్యాత్మికాది జ్ఞానవిషయమై ఓ శౌనకాది మునులారా! ఇప్పుడు మీరు అడిగినట్లే పూర్వం పరీక్షిత్తు అడుగగా శుకమహర్షి వివరించాడు. అదంతా మీకు చక్కగా తెలియ జెప్తాను" అని సూతుడు చెప్పసాగాడు.