పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శౌనకుడు సూతు నడుగుట

  •  
  •  
  •  

2-281-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విని శౌనకుండు సూతుం
నుఁగొని యిట్లనియె "సూత !రుణోపేతా!
నుత గుణసంఘాతా!
పుణ్యసమేత! విగతలుషవ్రాతా!

టీకా:

విని = విని; శౌనకుండున్ = శౌనకుడు; సూతున్ = సూతుని; కనుఁగొని = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; సూత = సూతుడా; కరుణ = దయతో; ఉపేతా = కూడినవాడా; జన = జనులచే; నుత = పొగడతగ్గ; గుణ = గుణముల; సంఘాతా = సంఘములు కలవాడా; ఘన = గొప్ప; పుణ్య = పుణ్యములు; సమేత = కూడినవాడా; విగత = విడిచిన; కలుష = పాపముల; వ్రాతా = సమూహము కలవాడా.

భావము:

భాగవతలక్షణాలు, ఫ్రళయాది వివరాలు అన్ని తెలియచెప్పగా విని శౌనకుడు ఇలా అడగసాగాడు. "ఓ సూతమహర్షి! నీవు దయామయుడవు. సజ్జనులచే పొగడదగ్గ సుగుణాలు అనేకం కలవాడవు. సర్వ పాపములను విడిచిన వాడవు. అని ఇంకా ఇలా అడుగసాగాడు.