పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శ్రీహరి నిత్యవిభూతి

  •  
  •  
  •  

2-279-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణీశోత్తమ! భూత సృష్టి నిటు సంస్థాపించి రక్షించు నా
రి కర్తృత్వము నొల్ల కాత్మగత మాయారోపితం జేసి తా
నివద్యుండు నిరంజనుండుఁ బరుఁడున్ నిష్కించనుం డాఢ్యుఁడున్
నిపేక్షుండును నిష్కళంకుఁ డగుచున్ నిత్యత్వముం బొందెడిన్.

టీకా:

ధరణీశ = రాజులలో; ఉత్తమ = ఉత్తముడా, రాజా; భూత = జీవుల; సృష్టిన్ = సృష్టిని; ఇటు = ఇలా; సంస్థాపించి = చక్కగ ఏర్పరచి; రక్షించున్ = రక్షించును; ఆ = ఆ; హరి = విష్ణువు; కర్తృత్వమున్ = కర్తృత్వమును; ఒల్లక = అంగీకరింపక; ఆత్మ = తన; గతన్ = అందు; మాయా = మాయ అందు; ఆరోపితన్ = ఆరోపింపబడిన దానిని; చేసి = చేసి; తాన్ = తను; నిరవద్యుండున్ = నిరవద్యుడు {నిరవద్యుడు - నిందలేని వాడు, భగవంతుడు}; నిరంజనుండుఁన్ = నిరంజనుడు {నిరంజనుడు - దోషము లేని వాడు, భగవంతుడు}; పరుఁడున్ = పరుడు {పరుడు - ఉత్తముడు, భగవంతుడు}; నిష్కించనుడున్ = నిష్కించనుడు {నిష్కించనుడు - వెలితి లేని వాడు, భగవంతుడు}; ఆఢ్యుఁడున్ = ఆఢ్యుడు {ఆఢ్యుడు - మించిన వాడు}; నిరపేక్షుండునున్ = నిరపేక్షుడు {నిరపేక్షుడు - దేనిని కోరని వాడు}; నిష్కళంకుఁడున్ = నిష్కళంకుడు {నిష్కళంకుడు - కళంకము (మచ్చ) లేని వాడు}; అగుచున్ = అగుచు; నిత్యత్వమున్ = శాశ్వతత్వమును; పొందెడిన్ = పొందుచుడెన్.

భావము:

ఓ భూపాలకోత్తమ! ఈ విధంగా ప్రాణులను సృష్టించి, రక్షిస్తున్న ఆ శ్రీహరి తనకు కర్తృత్వం అంగీకరించడు. దానినంతా తన మాయకే ఆరోపిస్తాడు. తాను నిరవద్యుడు, నిరంజనుడు, నిష్కించనుడు, నిరపేక్షుడు, నిష్కళంకుడు, పరుడు, ఆఢ్యుడు అయిన వాడై శాశ్వతత్వాన్ని పొందుతాడు.