పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శ్రీహరి నిత్యవిభూతి

  •  
  •  
  •  

2-277.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డాదిమధ్యాంతశూన్యుం, డనాదినిధనుఁ,
తని వలనను సంభూత మైన యట్టి
సృష్టి హేతు ప్రకార మీక్షించి తెలియఁ
జాల రెంతటి మునులైన నవరేణ్య!

టీకా:

హరి = విష్ణువు; అందున్ = అందు; ఆకాశమున్ = ఆకాశము; ఆకాశమునన్ = ఆకాశములో; వాయువు = గాలి {వాయువు - వ్యాపించునది, గాలి}; అనిలంబున్ = గాలి {అనిలము - నిలబడి ఉండనిది, గాలి}; వలనన్ = వలన; హుతాశనుండున్ = అగ్ని {హుతాశనుడు - యజ్ఞములో హుతము చేయుటకు ఆశించు వాడు, అగ్ని}; హవ్యవాహనున్ = అగ్ని {హవ్యవాహనుడు - యజ్ఞమందలి హవ్యములను (ఆయా) దేవతలకు చేర్చువాడు, అగ్ని}; అందున్ = అందు; అంబువున్ = నీరు; ఉదకంబున్ = నీటి; వలనన్ = వలన; వసుంధర = నేల; కలిగెన్ = కలిగినవి; ధాత్రిన్ = నేల; వలనన్ = వలన; బహు = వివిధమైన; ప్రజ = జీవుల; ఆవళి = రాశి, సమూహములు; ఉద్భవంబున్ = పుట్టుట; అయ్యెన్ = జరిగెను; ఇంత = దీనంత; కున్ = కి; మూలము = మూలకారణము; ఐ = అయ్యి; ఎసఁగున్ = అతిశయించును; అట్టి = అటువంటి; నారాయణుండు = నారాయణుడు {నారాయణుడు - నారములందు వసించువాడు, భగవంతుడు}; చిదచిదానంద = సచేతనాచేతన ఆనందముల {చిదచిదానందస్వరూపకుడు - సచేతన అచేతన ఆనందములు తన స్వరూపమే అయిన వాడు, భగవంతుడు}; స్వరూపకుండు = స్వరూపకుడు; అవ్యయుండు = అవ్యయుడు {అవ్యయుండు - వ్యయము (తరుగు) లేనివాడు, భగవంతుడు}; అజుఁడు = అజుఁడు {అజుడు - జన్మము లేనివాడు, భగవంతుడు}; అనంతుడు = అనంతుడు {అనంతుడు - అంతము లేనివాడు, భగవంతుడు}; ఆఢ్యుఁడు = ఆఢ్యుడు {ఆఢ్యుడు - సకల సంపదలు కలవాడు, భగవంతుడు}; ఆది = ఆది {ఆదిమధ్యాంతశూన్యుడు - మొదలు మధ్య అంతములు లేనివాడు, భగవంతుడు};
మధ్యాంత = మధ్యాంత; శూన్యుండు = శూన్యుడు; అనాదినిధనుఁడు = అనాదినిధనుడు {అనాదినిధనః - పుట్టుక చావు లేనివాడు, విష్ణుసహస్రనామములలో 42వ నామం}; అతని = అతని; వలనను = వలన; సంభూతము = పుట్టినది; ఐనన్ = అయినది; అట్టి = అటువంటి; సృష్టిన్ = సృష్టికి; హేతువు = కారణములు; ప్రకార = విధానములు; ఈక్షించి = చూసి; తెలియఁన్ = తెలియుటకు; చాలరు = సరిపోరు; ఎంతటి = ఎంతటి; మునులు = మునులు; ఐనన్ = అయినను; జన = జనులకు; వరేణ్య = శ్రేష్ఠుడ, రాజ.

భావము:

శ్రీహరినుండి ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి వాయువు పుట్టింది. వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు పుట్టాయి. నీటి నుండి భూమి పుట్టింది. భూమి నుండి నానావిధ జీవజాలము పుట్టింది. దీనంతటికి మూలమై ప్రకాశించేవాడు ఆ నారాయణుడే. ఆయన జ్ఞానానంద స్వరూపుడు, అవ్యయుడు, పుట్టుకలేని వాడు, అంతంలేనివాడు, ప్రభువు, ఆదిమధ్యాంత రహితుడు, జనన మరణాలు లేనివాడు. ఆయననుండి జనించిన ఈ సృష్టికి హేతువేమిటో, దాని స్వరూపా మెలాంటిదో ఎంత పరీక్షించినా ఎంతటి మునీశ్వరులైనా తెలుసుకోలేకున్నారు.