పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శ్రీహరి నిత్యవిభూతి

  •  
  •  
  •  

2-275-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వొందన్ ద్రుహిణాత్మకుండయి రమాధీశుండు విశ్వంబుసు
స్థితం జేసి, హరిస్వరూపుఁడయి రక్షించున్ సమస్త ప్రజో
త్క సంహారము సేయు నప్పుడు హరాంర్యామియై యింతయున్
రియించుం బవనుండు మేఘముల మాయం జేయు చందంబునన్.

టీకా:

ఇరవొందన్ = చక్కగ అమరునట్లు; ద్రుహిణ = బ్రహ్మదేవుని; ఆత్మకుండు = స్వరూపము ధరించిన వాడు; అయి = అయి; రమాధీశుండున్ = లక్ష్మీపతి {రమాధీశుడు - రమ (లక్ష్మీదేవి) కి అధీశుడు (పతి), విష్ణువు}; విశ్వంబున్ = జగత్తును; సుస్థిరతన్ = సమత్వముతో స్థిరముగ ఉన్నదిగ {సుస్థిరత - చక్కగ సరదుచేయబడి స్థిరముగ ఉన్నది}; చేసి = చేసి; హరి = విష్ణువు {హరి - సమస్త దుఃఖములను హరించువాడు}; స్వరూపుఁడు = స్వరూపము ధరించిన వాడు; అయి = అయి; రక్షించున్ = రక్షించును; సమస్త = సమస్తమైన; ప్రజన్ = జీవ; ఉత్కర = రాశిని; సంహారమున్ = ప్రాణహరణము; చేయున్ = చేసే; అప్పుడు = సమయములో; హర = శివుని; అంతర్యామి = లోవ్యాపించిన వాడు; ఐ = అయి; ఇంతయున్ = ఇదంతా; హరియించున్ = అణచుచుండును; పవనుండు = వాయువు; మేఘములన్ = మేఘములను; మాయన్ = మాయమగునట్లు; చేయు = చేసే; చందంబునన్ = విధముగ.

భావము:

లక్ష్మీకాంతుడు చతుర్ముఖుడై జగత్తును సృష్టిస్తాడు. విష్ణు స్వరూపుడై దానిని రక్షిస్తాడు. సంహార సమయంలో హరునికి అంతర్యామిగా ఉంటు, వాయువు మబ్బులను హరించినట్లే సమస్త విశ్వాన్ని సంహరిస్తాడు.