పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శ్రీహరి నిత్యవిభూతి

  •  
  •  
  •  

2-274-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుర, సిద్ద, సాధ్య, కిన్న, వర చారణ,-
రుడ, గంధర్వ, రాక్షస, పిశాచ,
భూత, వేతాళ, కింపురుష, కూశ్మాండ, గు-
హ్యక, డాకినీ, యక్ష, యాతుధాన,
విద్యాధరాప్సరో, విషధర, గ్రహ, మాతృ-
ణ, వృక, హరి, ఘృష్టి, గ, మృగాళి,
ల్లూక, రోహిత, శు, వృక్ష యోనుల-
వివిధ కర్మంబులు వెలయఁ బుట్టి

2-274.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల నభో భూ తలంబుల సంచరించు
జంతు చయముల సత్త్వరస్తమో గు
ములఁ దిర్యక్సురాసుర ర ధరాది
భావముల భిన్ను లగుదురు పౌరవేంద్ర!

టీకా:

సుర = దేవతలు {సురలు - దేవతలు - వేల్పులు}; సిద్ద = సిద్ధులు {సిద్ధులు - సిద్ది పొందినవారు}; సాధ్య = సాధ్యులు {సాధ్యులు - గణదేవతావిశేషము, వీరు పన్నెండుగురు - మనువు, హనుమంతుడు, విష్ణువు, ధర్ముడు, నారాయణుడు మొదలగువారు}; కిన్నర = కిన్నెరలు {కిన్నెరలు - అశ్వ ముఖము నర దేహము కల దేవయోనివారు, చెడ్డవారు}; వర = గొప్ప; చారణ = చారణులు {చారణులు - ఒకజాతి ఖేచరులు}; గరుడ = గరుడులు {గరుడ - ఒక జాతి పక్షి}; గంధర్వ = గంధర్వులు {గంధర్వులు - పాటలు పాడుటలో విశిష్టులు, దేవయోని విశేషము}; రాక్షస = రాక్షసులు {రాక్షసులు - రక్కసులు}; పిశాచ = పిశాచములు {పిశాచ - దేహమున మాంసముపై ఆధార పడి వర్తించు శక్తులు}; భూత = భూతములు {భూత - దేహము విడచినను కోరికలు వదలక వర్తించు ఆత్మలు, పిశాచభేదము}; వేతాళ = బేతాళులు {బేతాళ - భూతావశిష్ట మృత శరీరము}; కింపురుష = కింపురుషులు {కింపురుషులు - అశ్వ ముఖము నర దేహము కల దేవయోనివారు, చెడ్డవారు}; కూశ్మాండ = కూశ్మండులు {కూశ్మాండ - పిశాచభేదము}; గుహ్యక = గుహ్యకులు {గుహ్యక - యక్షుల భేదము, పాతాళవాసులు}; డాకినీ = డాకినీ {డాకిని - దాగి ఉండు పిశాచభేదము}; యక్ష = యక్షులు {యక్ష - సంచారులు, దేవయోని విశేషము, ఖేచరులు}; యాతుధాన = యాతుధానులు {యాతుధాన - నిరృతి, రాక్షసవిశేషము, యాతనలు కలిగించు శక్తులు}; విద్యాధర = విద్యాధరులు {విద్యాధర - గ్రహణ, ధారణాది శక్తుల కధిపతులు}; అప్సరస = అప్సరసలు {అప్సరస - దేవవేశ్యలు}; విషధర = పాములు {విషధర - విషము ధరించునవి, సర్పములు}; గ్రహ = గ్రహదేవతలు {గ్రహ - గ్రహ అధిదేవతలు, జ్యోతిషాధిపతులు}; మాతృగణ = అమ్మవార్లు {మాతృగణ -అమ్మవార్లు, గ్రామదేవతలు}; వృక = తోడేళ్ళు; హరి = సింహములు; ఘృష్టి = అడవి పందులు; ఖగ = పక్షులు; మృగాళి = లేళ్ళ గుంపులు; భల్లూక = ఎలుగుబంట్లు; రోహిత = కేసరిమృగములు; పశు = పశువులు; వృక్ష = వృక్షములు; యోనులన్ = (మొదలగువాని) యోనులలో; వివిధ = అనేక రకములైన; కర్మంబులున్ = కర్మమములు; వెలయఁన్ = కలుగునట్లు; పుట్టి = జనించి;
జల = నీటి; నభో = ఆకాశ; భూ = భూముల యొక్క; తలంబుల = మండలములలో; సంచరించున్ = సంచరించునట్టి; జంతు = జంతువుల; చయములన్ = సమూహములు; సత్త్వ = సత్వ; రజ = రజో; తమో = తమో; గుణములఁన్ = గుణములుతో; తిర్యక్ = జంతువులు {తిర్యక్కులు - చలనము కల జీవులు, జంతువులు}; సుర = దేవతలు; అసుర = రాక్షసులు; నర = మానవులు; ధర = పర్వతములు; ఆది = మొదలైన; భావములన్ = భావములుతో; భిన్నులు = విభజింప బడినవారు; అగుదురు = అవుతున్నారు; పౌరవ = పురుని వంశస్తులలో; ఇంద్ర = శ్రేష్ఠుడ (పరీక్షిత).

భావము:

ఓ పురువంశపు రాజోత్తమా! జీవులు తాము చేసిన నానా విదాలైన కర్మల్ని అనుసరించి సురలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, చారణులు, గరుడులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచాలు, భూతాలు, బేతాళాలు, కింపురుషులు, కూశ్మాండులు, గుహ్యకులు, డాకినులు, యక్షులు, యాతుధానులు, విద్యాధరులు, అచ్చరలు, నాగులు, గ్రహాలు, మాతృగణాలు, తోడేళ్ళు, సింహాలు, సూకరాలు, పక్షులు, మృగాలు, ఎలుగుబంట్లు, చేపలు, పశువులు, చెట్లు మున్నగు బహు జాతులలో పుట్టి నీటిలోను, నింగిలోను, నేలమీద సంచరిస్తారు. సత్త్వగుణ, రజోగుణ, తమోగుణాలు కల్కి ఉంటారు. ఈ ప్రాణిజాత మంత తిర్యక్కులు, సురలు, అసురులు, నరులు, గిరులు ఇలా విభిన్న రూపాలతో ఉంటుంది.