పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శ్రీహరి నిత్యవిభూతి

  •  
  •  
  •  

2-272.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యుండు నట్టి యీశ్వరుండు నారాయణుం
ఖిలధృత జగన్నియంతయైన
చిన్మయాత్మకుండు సృజియించు నీ ప్రజా
తుల ఋషులఁ బితృ వితుల నెలమి.

టీకా:

అలఘు = గొప్పదైన; తేజో = తేజస్సుతో; మయంబున్ = నిండి ఉన్నది; ఐన = అయిన; రూపంబున్ = స్వరూపము; ఇది = ఇది; క్షితిన్ = భూమికి; నాథ = ప్రభువ, రాజ; నా = నా; చేతన్ = చేత; చెప్పఁబడియెన్ = చెప్పబడినది; మానిత = మన్నింపబడే; స్థూల = స్థూలమైన; సూక్ష్మ = సూక్ష్మమైన; స్వరూపంబులన్ = స్వరూపములు; వలనన్ = వలన; ఒప్పెడున్ = ఒప్పుచుండు; భగవత్ = భగవంతుని; స్వరూపము = స్వరూపము; ఆ = ఆ; మహాత్మకుని = గొప్పఆత్మ కలవాని; మాయా = మాయ యొక్క; బలంబునన్ = బలమైన ప్రభావము; చేసి = వలన; దివ్య = దేవతలు; మునీంద్రులుఁన్ = ఋషులైనను; తెలియలేరు = తెలుసుకొనలేరు; వసుధన్ = భూమికి; ఈశ = ప్రభువ, రాజ; వాచ్యము = వాక్కు; ఐ = అయ్యి; వాచకంబున్ = వాక్కుయొక్క అర్థము; ఐ = అయ్యి; నామన్ = (సమస్త) పేర్లు; రూపముల్ = (సమస్త) రూపములు; క్రియలున్ = (సమస్త) పనులును; రూఢిఁన్ = నిశ్చయముగ; తాల్చి = ధరించి;
ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; ఈశ్వరుండు = ఈశ్వరుడు {ఈశ్వరుడు - ప్రభుత్వము కలవాడు, భగవంతుడు}; నారాయణుండు = నారాయణుడు {నారాయణుడు - నారములందు వసించువాడు, భగవంతుడు}; అఖిలధృత = అఖిలధృత {అఖిలధృత - సమస్తమును ధరించువాడు, భగవంతుడు}; జగన్నియంత = జగన్నియంత {జగన్నియంత - లోకములను నియమించువాడు, భగవంతుడు}; ఐన = అయిన; చిన్మయాత్మకుండు = చిన్మయాత్మకుడు {చిన్మయాత్మకుండు - చైతన్యము నిండిన స్వరూపము కలవాడు, భగవంతుడు}; సృజియించున్ = సృష్టించును; ఈ = ఈ సమస్తమైన; ప్రజాపతులన్ = ప్రజాపతులను; ఋషులఁన్ = ఋషులను; పితృ = పితృదేవతల; వితతులన్ = సమూహములను; ఎలమిన్ = కోరి, వికాశముతో.

భావము:

మహారాజా! మహాతేజస్సుతో నిండిన భగవత్స్వరూపాన్ని గూర్చి నే నిప్పుడు వివరిస్తాను. స్థూలమని, సూక్ష్మమని రెండు రూపాలతో విలసిల్లే ఆ భగవదాకారాన్ని ఆ పరమాత్ముని మాయాప్రభావంవల్ల దివ్య తేజోధనులైన మునులు కూడ తెలిసికొనలేకున్నారు. వాచ్యమై, వాచకమై, నామరూపక్రియలు దాల్చిన ఈశ్వరుడు సమస్త లోకాలకు నియామకుడు అయ్యి ఉన్నాడు. చిన్మయ స్వరూపుడైన ఆ శ్రీమన్నారాయణుడు ప్రజాపతులను, ఋషులను. పితృదేవతలను ప్రీతితో సృష్టిస్తున్నాడు.