పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శ్రీహరి నిత్యవిభూతి

  •  
  •  
  •  

2-271-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పొలుపగు సకల విలక్షణ
ములు గల యాద్యంత శూన్యమును నిత్యమునై
లి సూక్ష్మమై మనో వా
క్కుకుం దలపోయఁగా నగోచర మగుచున్.

టీకా:

పొలుపగు = అందమైన; సకల = సమస్త; విలక్షణములున్ = విశిష్ట లక్షణములు; కల = కలిగినది యును; ఆది = మొదలు; అంత = అంతములు; శూన్యమును = లేనట్టిదియును; నిత్యమున్ = నిత్యమైనదియును; ఐ = అయి; లలి = అత్యంత; సూక్ష్మ = సూక్ష్మము; ఐ = అయి; మనస్ = మనసు; వాక్కులన = మాటల; కున్ = కు; తలపోయఁగాన్ = ఆలోచించుటకు; అగోచరము అగుచున్ = అందనిది అగుచు;

భావము:

విరాట్పురుషుని సూక్ష్మరూపం విలక్షణమైనది. దానికి మొదలు తుది లేవు. అది నిత్యమైనది, సూక్ష్మమైనది. ఆలోచించి చూసిన మనస్సుకు, వాక్కుకు గోచరం కానిది.