పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శ్రీహరి నిత్యవిభూతి

  •  
  •  
  •  

2-268.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దాలు జిహ్వాదికంబు లుద్భవము నొందె
నందు నుదయించె నానావిధైక రసము
లెనయ నవి యెల్ల జిహ్వచే నెఱుఁగఁబడును
మొనసి పలుక నపేక్షించు ముఖమువలన.

టీకా:

అట్టి = అటువంటి; విరాఠ్ = విరాఠ్; విగ్రహ = విగ్రహము యొక్క; అంతర = లోపలి; ఆకాశంబున్ = ఆకాశము; వలన = వలన; ఓజస్ = ఓజస్సు, గ్రహణ శక్తి; సహస్ = సహస్సు, ధారణా శక్తి; బలము = బలము, భౌతిక శక్తి; అయ్యెఁన్ = కలలిగినవి; ప్రాణంబున్ = ప్రాణము; సూక్ష్మ = సూక్షమమైన; రూప = రూపము; క్రియ = క్రియా; శక్తి = శక్తి; చేన్ = చేత; జనియించెన్ = పుట్టినది; ముఖ్య = ముఖ్యమైన; అసువు = ప్రాణము; అనఁగన్ = అని; పరఁగెన్ = ప్రసిద్ధి కెక్కెను; వెలువడి = బయల్పడి; చను = వర్తించు; జీవిన్ = ప్రాణిని; వెనుకొని = వెంటపడి; ప్రాణముల్ = ప్రాణములు; చనుచుండున్ = వెళ్ళుచుండును; నిజ = తన; నాథున్ = యజమానిని; అనుసరించు = అనుసరించే; భటులన్ = సేవకులు; చందంబునన్ = వలె; పాటిల్లున్ = కలుగును; క్షుత్తునున్ = ఆకలి; భూరి = గొప్ప; తృష్ణయున్ = దప్పులు; మఱి = మళ్ళీ; ముఖము = ముఖము; వలనఁన్ = వలన; తాలు = అంగిలి;
జిహ్వ = నాలుక; ఆదికము = మొదలైనవి; ఉద్భవము = పుట్టుకను; ఒందెన్ = పొందినవి; అందున్ = అందు; ఉదయించెన్ = కలిగెను; నానా = అనేక; విధైక = రకములైన; రసములు = రుచులు; ఎనయన్ = తెలుసుకొనిన; అవి = అని; ఎల్లన్ = సమస్తమును; జిహ్వ = నాలుక; చేన్ = చేత; ఎఱుఁగఁబడునున్ = తెలియబడును; మొనసి = పూనుకొని; పలుకన్ = పలుకవలెనని; అపేక్షించున్ = కోరే; ముఖము = ముఖము; వలనన్ = వలన.

భావము:

ఇలాంటి విరాట్పురుషుని శరీరం లోపలి ఆకాశం నుండి ప్రవృత్తి సామర్థ్యరూపమైన ఓజస్సు. వేగసామర్థ్యం, బలం అనే ధర్మాలు కలిగాయి. సూక్ష్మరూపమైన క్రియాశక్తి వల్ల ప్రాణం పుట్టింది. అది సమస్త ప్రాణులకు ముఖ్యమైనది. యజమాని ననుసరించు సేవకులలాగ ప్రాణాలు జీవి ననుసరించి వెడలిపోతుంటాయి. విరాట్పురుషునకు జఠరాగ్ని దీపించగానే ఆకలిదప్పులు ఏర్పడ్డాయి. ముఖం నుండి దవుడలు, నాలుక మొదలైననవి పుట్టాయి. అందుండే ఆరు విధాలైన రసాలు జనించాయి. ఆ రసభేదా లన్నీ నాలుకతోనే గ్రహింపబడుతున్నాయి. ముఖం సంభాషించాలని భావించింది.