పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : భాగవత దశలక్షణంబులు

  •  
  •  
  •  

2-266.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూతుఁడై పారతంత్ర్యాత్మ బుద్ధి నొప్పి
దివ్య మాల్యానులేపన వ్య గంధ
లిత మంగళ దివ్య విగ్రహ విశిష్టుఁ
గుచు హరిరూప మొందుటే నఘ! ముక్తి

టీకా:

జీవుండు = మానవుడు {జీవుడు - జీవము ఉన్నవాడు, మానవుడు}; భగవత్ = భగవంతుని; కృప = దయ; వశంబునన్ = చిక్కుట; చేసి = వలన; దేహ = శరీర; ధర్మంబులున్ = దర్మములు; ఐ = అయ్యి; ధృతిన్ = ధరింపబడిన; అనేక = అనేకమైన; జన్మ = జన్మలలోను; అనుచరితన్ = జరుగుతు; దృశ్యములు = చూడబడినవి; ఐన = అయినట్టి; ఆ = ఆ; జరా = ముసలితనము; మరణంబున్ = మరణములును; ఆత్మ = తన; ధర్మంబులున్ = లక్షణములు; అయిన = అయినట్టి; ఘన = బహుమిక్కిలి; పుణ్య = పుణ్యములు; పాప = పాపములు యొక్క; నికాయ = సమూహముల నుండి; నిర్మోచన = విడుదలైన; స్థితిన్ = స్థితిలో; ఒప్పి = చక్కగనుండి; పూర్వ = పూర్వ కాలము నుండి; సంచితములు = పోగుపడినవి; ఐనన్ = అయిన; అపహత = తొలగిన; పాప్మవత్త్వ = పాపము కలిగి ఉండుట; ఆది = మొదలగు; అష్ట = ఎనిమిది; తత్ = అతని (భగవంతుని); గుణవంతుఁడు = గుణములు కలవాడు; ఐ = అయ్యి; తగన్ = తగినట్లుగ; భగవత్ = భగవంతుని; శరీర = శరీరము;
భూతుఁడు = తనదైన వాడు; ఐ = అయ్యి; పారతంత్ర్య = (భగవంతుని) పరమైన తంత్రము కల; ఆత్మ = తన; బుద్ధిన్ = బుద్ధితో; ఒప్పి = కూడిన వాడై; దివ్య = దివ్యమైన, శ్రేష్ఠమైన; మాల = మాలలు; అనులేపన = మైపూతలు; భవ్య = శుభములైన; గంధ = గంధములతో; కలిత = కూడిన; మంగళ = శుభకరమైన; దివ్య = దేవతా, శ్రేష్ఠమైన; విగ్రహ = స్వరూపముచే; విశిష్టుఁడు = విశిష్టమైన వాడును; అగుచున్ = అగుచు; హరి = విష్ణువు యొక్క; రూపమున్ = స్వరూపమును; ఒందుటే = పొందుటయే; అనఘ = పాపములు లేని వాడ; ముక్తి = ముక్తి (అను ఉన్నది).

భావము:

మానవుడు జన్మజన్మాంతరాలలో తన దేహధర్మాలను పాటిస్తు అనేక పాప పుణ్య కర్మలు చేసి ఫలితాలు అనుభవిస్తుఉంటాడు. జనన జరామరణాదుల చక్రంలో పడి కొట్టుకుంటు ఉంటాడు. ఈ అనంత పాప పుణ్యచయాలనుండి భగవత్కృపతో కూడిన బహుళసాధనల వలన విడివడతాడు. భగవంతుని అష్టైశ్వార్యాలతో కూడి ఆ పరాత్పరుని సామీప్యం, సాయుజ్యం సంపాదించుకొని, సాక్షాత్భగవస్వరూపం పొందుతాడు. ఆయా దివ్యమైన మాలలు, మైపూతలు మున్నగు వైభోగములన్నీ పొందుతాడు. ఇలా శోభనకరమైన విశిష్ఠ దివ్యదేహంతో హరిస్వరూపం పొందుటను ముక్తి అంటారు.