పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : భాగవత దశలక్షణంబులు

  •  
  •  
  •  

2-265.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుగు నయ్యవస్థావిశేషంబు లెల్ల
విదితమగునట్లు వలుకుట ది నిరోధ
న నిది యవాంతరప్రళయం బనంగఁ
రఁగు నిఁక ముక్తి గతి విను పార్థివేంద్ర!

టీకా:

వసుమతీ = భూమికి {వసుమతీనాథుడు - భూమికి ప్రభువు, రాజు}; నాథ = ప్రభువ, రాజ; సర్వ = సమస్తమునకు; స్వామి = యజమాని; ఐనన్ = అయిన; గోవిందుండున్ = గోవిందుడు {గోవిందుడు - గోవు (దిక్కు, శరణము) ఇచ్చు వాడు, గోవులకు అధిపతి, కృష్ణుడు}; చిత్ = సచేతన; అచిత్ = అచేతన; ఆనంద = ఆనందముల; మూర్తి = స్వరూపము అయినవాడును; సలలిత = మనోఙ్ఞము కలిగిన వాడును; స్వ = స్వంత; ఉపాధిన్ = ఉపాధులుగ ఉండగల; శక్తి = శక్తి; సమేతుఁడు = కలిగి ఉన్నవాడును; ఐ = అయ్యి; తనరారున్ = ఒప్పి ఉండును; ఆత్మీయ = స్వంత; ధామ = నివాసము; అందున్ = అందు; ఫణిరాజ = ఆదిశేషుడు అను {ఫణిరాజు - సర్పములలో రాజు, శేషుడు}; మృదుల = మెత్తనైన; తల్పంబున్ = పానుపు; పైన్ = పైన; సుఖ = సుఖమైన; లీలన్ = విధముగ; యోగనిద్ర = యోగనిద్రలో; రతిన్ = ఆనందిస్తు; ఉన్న = ఉన్న; వేళన్ = సమయములో; అఖిల = సమస్తమైన; జీవులు = ప్రాణులు; నిజ = తమ; వ్యాపార = వర్తనలు అన్నీ; శూన్యులు = లేనివి; ఐ = అయ్యి; ఉన్నత = ఉన్నటువంటి; తేజంబులున్ = తేజస్సులు; ఉరలుకొనఁగాన్ = జారిపోవుట;
జరుగున్ = జరిగే; ఆ = ఆ; అవస్థా = స్థితి యొక్క; విశేషంబులున్ = వివరములు; ఎల్లన్ = అన్నీ; విదితమగు = తెలియు; అట్లు = విధముగ; పలుకుటన్ = చెప్పబడే; అది = అది; నిరోధము = నిరోధము; అనన్ = అనగా; ఇది = ఇదియే; అవాంతర = అవాంతర; ప్రళయంబున్ = ప్రళయము; అనఁగఁన్ = అని; పరగు = ప్రసిద్ధమైనది; ఇఁకన్ = ఇంక; ముక్తి = ముక్తి; గతిన్ = విషయమును; విను = వినుము; పార్థివ = పృథివికి; ఇంద్ర = ప్రభువ, రాజ.

భావము:

ఓ పరీక్షిత్తు భూపతి! సర్వేశ్వరుడు, గోవిందుడు, చిదచిదానంద స్వరూపుడు నారాయణుడు. ఆయన స్వయంభూతుడు ఇతరేతర ఉపాధులు లేక ఉండగలవాడు. కల్పాంతమున శ్రీమన్నారాయణుడు తన స్వస్థానమైన పాలసముద్రమున ఆదిశేషుని పాన్పుగా చేసికొని సుఖంగా యోగనిద్రా ముద్రలో ఆనందిస్తు వసించి ఉంటాడు. ఆసమయంలో జీవకోటి సమస్తము తమ తేజస్సులు నశించి నిర్వ్యాపారులై ఆయనలో లయమైపోతాయి. ఆ అవస్థా విశేషములు తెలుపనది నిరోధము అంటారు. దీనినే అవాంతర ప్రళయము అని పేరుపడింది. ఇక ముక్తి అంటే ఏమిటో తెలుసుకుందాం.