పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : భాగవత దశలక్షణంబులు

  •  
  •  
  •  

2-263-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లజనాభ దయాకటాక్షప్రసాద
బ్ధి నఖిలైక లోకపాక విభూతి
హిమఁ బొందిన వారి ధర్మములు విస్త
మునఁ బలుకుట మన్వంతములు భూప!

టీకా:

జలజనాభ = పద్మనాభుని {జలజనాభుడు - జల (నీట) జ (పుట్టిన, పద్మము) నాభుడు (బొడ్డున కలవాడు), విష్ణువు}; దయా = దయతోకూడిన; కటాక్ష = అనుగ్రహ; ప్రసాద = ప్రసాదము; లబ్ధిన్ = లభించుటచే; అఖిల = సమస్తమైన; ఏక = ముఖ్యమైన; లోక = లోకములను; పాలక = పాలించుటాది; విభూతిన్ = వైభవములు, ఐశ్వర్యములు; మహిమన్ = గొప్పతనములు; పొందిన = పొందిన; వారిన్ = వారి; ధర్మములు = ధర్మములు, విధానములు; విస్తరమునన్ = విస్తారముగ; పలుకుటన్ = తెలుపుట యే; మన్వంతరములున్ = మన్వంతరములు; భూప = భూమికి పతి, రాజా {భూప - భూమికి పతి, రాజు}.

భావము:

నరవరేణ్య పరీక్షిత్తు! పద్మనాభుడు, విష్ణుమూర్తి కటాక్షవీక్షణలతో అనుగ్రహ ప్రసాదంతో సర్వ లోకాధిపతులు అధికారాన్ని అందుకోగలుగుతారు. అలా హరి అనుగ్రహ ప్రసారంతో లోకపాలనాది మహావైభవములు, మహత్వములు విస్తరించుటను మన్వంతరములు అంటారు.