పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : భాగవత దశలక్షణంబులు

  •  
  •  
  •  

2-261-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లోద్రోహినరేంద్రా
నీముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా
వైకుంఠనాథు విజయం
బాల్పస్థాన మయ్యె వనీనాథా!

టీకా:

లోక = లోకములకు; ద్రోహి = ద్రోహము చేయునట్టి; నర = నరులకు {నరేంద్రుడు - నరులకు ఇంద్రుడు, రాజు}; ఇంద్ర = ప్రభువ, రాజ; అనీకమున్ = సమూహమును; పరిమార్చి = సంహరించి; జగమున్ = లోకములను; నెఱిన్ = చక్కగ; నిల్పినన్ = నిలబెట్టిన, రక్షించిన; ఆ = ఆ; వైకుంఠనాథున్ = వైకుంఠనాథుని {వైకుంఠనాథుడు - వైకుంఠమునకు ప్రభువు}; విజయంబున్ = విజయముతో; ఆకల్ప = కల్పాంతము వరకు ఉండేది; స్థానమున్ = స్థానము; అయ్యెన్ = అయినది; అవనీ = భూమికి {అవనీనాథ - భూమికి ప్రభువు, రాజు}; నాథా = ప్రభువ, రాజ.

భావము:

ఓ రాజా పరీక్షిత్తు! లోకద్రోహులైన రాజులను సంహరించి లోకాలను సంరక్షించుటలోని ఆ వైకుంఠుని విజయాలను స్థానము అంటారు. ఈ స్థానము అనే విష్ణు మహిమ కల్పాది నుండి కల్పాంతాలవరకు సాగుతూనే ఉంటుంది.