పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : మాయా ప్రకారంబు

  •  
  •  
  •  

2-256-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుదెంచి తండ్రికిం బ్రియ
మొరఁగ శుశ్రూషణంబు లొనరిచి యతఁడుం
దెసఁ బ్రసన్నుఁ డగుటయుఁ
ని భగవన్మాయ దెలియఁగా నుత్సుకుఁడై.

టీకా:

చనుదెంచి = వచ్చి; తండ్రిన్ = తండ్రి; కిన్ = కి; ప్రియము = ప్రీతి; ఒనరఁగన్ = కలుగునట్లు; శుశ్రూషణంబులున్ = సేవలు; ఒనరిచి = కలిగించి, చేసి; అతఁడున్ = అతను; తన = తన; దెసఁన్ = వైపు, అందు; ప్రసన్నుఁడు = ప్రసన్నుడు; అగుటయుఁన్ = అగుట; కని = చూసి; భగవత్ = భగవంతుని; మాయన్ = మాయను; తెలియఁగాన్ = తెలిసికొన; ఉత్సుకుఁడు = కుతూహలము కలవాడు; ఐ = అయి.

భావము:

అలా వచ్చిన నారదమహర్షి తండ్రి యైన బ్రహ్మదేవునికి శుశ్రూషలు చేసి, ప్రసన్నుడగుట గమనించి భగవంతుని మాయని వివరంగా తెలుపమని కుతూహలంగా అడిగాడు.