పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : మాయా ప్రకారంబు

  •  
  •  
  •  

2-255-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లినాసన నందను
లై సనందాది మునుల గ్రేసరుఁడున్
మానుగఁ బ్రియతముఁడును నగు
నా నారదుఁ డేగుదెంచె బ్జజు కడకున్.

టీకా:

ఆ = ఆ; నలినన్ = తామరపువ్వునందు {నలినాసననందనులు - నళిన (తామరపువ్వు) లో ఆసన (కూర్చున్న వాడు, బ్రహ్మదేవుడు) నందనులు (పుత్రులు), నారదుడు మరియు సనకసనందనాదులగు యోగులు}; ఆసనన్ = కూర్చున్నవాని, బ్రహ్మదేవుని; నందనున్ = పుత్రులు; ఐన = అయిన; సనంద = సనందుడు; ఆది = మొదలగు; మునులున్ = మునుల; కున్ = కు; అగ్రేసరుఁడున్ = పెద్దవాడును; మానుఁగన్ = మానుగ, చక్కగ; ప్రియతముఁడునున్ = అత్యంత ప్రియమైనవాడు {ప్రియ - ప్రియతరము - ప్రియతమము}; అగున్ = అయిన; ఆ = ఆ; నారదుఁడున్ = నారదుడు; ఏగుదెంచెన్ = వచ్చెను; అబ్జజున్ = బ్రహ్మదేవుని {అబ్జజుడు - అబ్జము (పద్మము) అందు జుడు (పుట్టినవాడు)}; కడకున్ = వద్దకు.

భావము:

కమలజుడైన బ్రహ్మదేవుని దగ్గరకి తనకు ప్రియపుత్రుడు, సనకసనందాదులకు అన్నగారు అయిన నారదమహర్షి వచ్చాడు.