పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : మాయా ప్రకారంబు

  •  
  •  
  •  

2-253.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్భుఁ డాత్మహితార్థమై కాక సకల
భువనహితబుద్ధి నున్నత స్ఫురణ మెఱసి
మానితంబైన యమ నియములు రెంటి
నాచరించెను సమ్మోదితాత్ముఁ డగుచు.

టీకా:

అవనీశ = రాజా {అవనీశుడు - అవనికి (భూమికి) ఈశుడు (ప్రభువు)}; బ్రహ్మ = బ్రహ్మ దేవుడు; ఇట్లు = ఈ విధముగ; అంతర్హితుండు = అదృశ్యుడు; ఐనఁన్ = అవ్వగా; పుండరీకాక్షునిన్ = పుండరీకాక్షుని {పుండరీకాక్షుడు - పుడరీక (తెల్లకలువ) వంటి అక్షుడు}; బుద్ధిన్ = బుద్ధి యందు; నిలిపి = నిలిపుకొని; ఆనందమునన్ = ఆనందమును; పొందిన్ = పొంది; అంజలి = చేతులు జోడించి నమస్కారము; కావించి = చేసి; తత్ = అతడు; పరిగ్రహంబునన్ = స్వీకరించుటను; తనదున్ = తన; బుద్ధిన్ = మనసున; కైకొని = గ్రహించి; పూర్వ = ముందటి; ప్రకారంబునన్ = విధముగనే; సమస్త = సమస్తమైన; ప్రపంచంబునున్ = ప్రపంచమును; తగన్ = తగినట్లుగ; సృజించి = సృష్టించి; మఱియొకన్ = ఇంకొక; నాఁడున్ = రోజు; ధర్మ = ధర్మమును అనుసరించి; ప్రవర్తకుఁడు = నడచువాడు; ఔచున్ = అగుచు; అఖిల = సమస్తమైన; ప్రజ = ప్రజలకును, సృష్టికిని; పతి = అధిపతి; ఐనఁన్ = అయిన; కమల = కమలమున;
గర్భుఁడు = పుట్టినవాడు; ఆత్మ = తన; హిత = మేలు; అర్థము = కోసము; ఐ = అయ్యి; కాక = కాకుండగ; సకల = సమస్తమైన; భువన = లోకముల; హిత = మేలు కొరకైన; బుద్ధిన్ = బుద్ధితో; ఉన్నత = గొప్ప; స్పురణన్ = ఆలోచనతో; మెఱసి = అతిశయించి; మానితంబున్ = గౌరవింపదగినది; ఐనఁన్ = అయిన; యమ = యమము {యమము - అంతరింద్రియ నిగ్రహము}; నియమము = నియమము {నియమము - బహిరింద్రియ నిగ్రహము}; రెంటిన్ = రెండింటిని; ఆచరించెన్ = అచరించెను; సమ్మోదిత = సంతోషము తోకూడిన; ఆత్ముఁడు = మనసు కలవాడు; అగుచున్ = అగుచు.

భావము:

ఓ పరీక్షిన్మహారాజా! ఆ విధంగా మాయమైపోయిన పద్మాక్షుడు శ్రీమన్నారాయణమూర్తిని హృదయంలో నిలుపుకొని ఆనందాన్ని పొందాడు. చేతులు జోడించి నమస్కరించాడు. ఆయన అనుగ్రహాన్ని తలచుకుంటు ఇదివరకులాగే సమస్తమైన ప్రపంచాన్ని చక్కగా సృష్టించసాగాడు. తరువాత ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు సర్వలోకాలకు మేలు ఒనగూర్చుటకొరకు గొప్ప ధర్మప్రవర్తకునిగా పూజితములైన యమనియమాలను రెంటినీ సంతోషచిత్తుడై ఆచరించాడు.