పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : బ్రహ్మకు ప్రసన్ను డగుట

  •  
  •  
  •  

2-250.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మందు లీనమైన ద్వితీయుండనై
యుండు నాకు నన్య మొకటి లేదు
సృష్టికాలమందు సృజ్యమానం బగు
గము మత్స్వరూప గును వత్స!

టీకా:

పరికింపన్ = సరిగ చూసిన; మత్ = నాయొక్క; స్వరూప = స్వరూప; స్వభావములునున్ = స్వభావములును; మహిమ = ప్రభావములు; అవతార = అవతారములు; కర్మమములు = ఆచరించిన పనులు; తెలియు = గ్రహింపగల; తత్త్వ = తత్త్వశాస్త్ర {తత్త్వము - విచారించు జ్ఞనము, లక్షణము, ఉన్నయదార్థస్థితి, తత్త్వశాస్త్రము}; విఙ్ఞానంబున్ = విఙ్ఞానము; తలకొని = చక్కగ, పొటమరించి; మత్ = నాయొక్క; ప్రసాదమున్ = అనుగ్రహము వలన; కల్గెడిన్ = కలుగును; నీకుఁన్ = నీకు; కమలన్ = కమలమందు; గర్భ = పుట్టిన వాడ (బ్రహ్మ దేవ); సృష్టి = సృష్టికి; పూర్వమునన్ = ముందుననే; చర్చింపన్ = తెలిసికొని చూసిన; నేన్ = నేను; ఒకరుండన్ = ఒక్కడనే; కలిగి = ఉండి; ఉండుదున్ = ఉండేవాడను; వీత = తొలగిన; కర్మిన్ = కర్మములు కలవాడను; అగుచున్ = అగుచు; సమధిక = చాలాఎక్కువ; స్థూల = స్థూలమైన {స్థూలరూపము - కంటికి కనిపించు పంచభూతాత్మక స్వరూపము}; సూక్ష్మ = సూక్ష్మమైన {సూక్ష్మరూపము - కంటికి కనిపించని సూక్ష్మ స్థాయిలోని ఆత్మైకరూపము}; స్వరూపములున్ = స్వరూపములు; తత్ = వానికి; కారణ = కారణమైన; ప్రకృతియుఁన్ = ప్రకృతియును; తగన్ = తగ; మత్ = నాయొక్క; అంశన్ = కళలలు; అందున్ = లో;
లీనమైనన్ = లీనమైపోయి; అద్వితీయుండను = అద్వితీయమైనవాడను {అద్వితీయము - ద్వితీయము (సాటికా గల రెండవది) లేనిది}; ఐ = అయ్యి; ఉండున్ = ఉండే; నాకు = నాకు; అన్యము = ఇతరము; ఒకటి = ఒకటైనను; లేదు = లేదు; సృష్టి = సృష్టికి; కాలము = సమయము; అందున్ = లో; సృజ్యమానంబున్ = సృష్టింపబడుచున్నవి; అగు = అయిన; జగముల్ = లోకములు; మత్ = నా యొక్క; రూపము = స్వరూపము; అగును = అయిఉన్నవి; వత్స = నాయనా.

భావము:

ఓ పద్మజుడ! బ్రహ్మదేవుడ! తెలిసికొంటే, నా యొక్క స్వరూపము, స్వభావములు, మహిమలు, అవతారాలు - కృృత్యములు అధ్యయనం చేయవలెను. దానితో నా దయవలన తత్వవిజ్ఞానము లభించును. ఈ జగత్తు సృష్టించబడుటకు ముందు నుండి నేను ఒక్కనిగనే (ఏకలుడగనే) ఉన్నాను. ఏ కర్మబంధాలు నాకు అంటవు. స్థూల సూక్ష్మ స్వరూపాలు, కారణభూతమైన ప్రకృతి సమస్తం నా అంశలే. అవన్నీ నాలో లీనమై ఉంటాయి. పుత్రా! బ్రహ్మదేవుడ! నాకు ఇతరమైనది ఏదీ లేనే లేదు. అలాగే సృష్ఠి జరుగుతుండె కాలంలో వచ్చేవి సర్వం నా స్వరూపమే అని గ్రహించు." అని విష్ణుదేవుడు వివరించసాగాడు.