పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : బ్రహ్మకు ప్రసన్ను డగుట

  •  
  •  
  •  

2-247-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రివచనంబు లాత్మకుఁ బ్రియం బొనరింపఁ బయోజగర్భుఁ "డో!
మపదేశ! యోగిజనభావన! యీ నిఖిలోర్వి యందు నీ
యని యట్టి యర్థ మొకఁడైననుఁ గల్గునె? యైన నా మదిన్
బెసిన కోర్కి దేవ! వినిపింతు దయామతిఁ జిత్తగింపవే.

టీకా:

హరి = విష్ణువు {హరి - సర్వ పాపములను హరించు వాడు, భగవంతుడు}; వచనంబున్ = మాటలు; ఆత్మ = మనసున; కున్ = కు; ప్రియంబున్ = సంతోషమును; ఒనరింపన్ = కలిగింపగ; పయోజ = పద్మమున {పయోజగర్భుడు - పయోజ (నీట పుట్టినది, పద్మము) లో పుట్టిన వాడు, బ్రహ్మ దేవుడు}; గర్భుఁడు = పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు; ఓ = ఓ; పరమపద = పరమపదమునకు; ఈశ = ప్రభువా; యోగి = యోగుల; జన = సమూహముల; భావన = ధ్యాన స్వరూపుడ; ఈ = ఈ; నిఖిల = సమస్త; ఉర్విన్ = లోకములు; అందున్ = లోను; నీ = నీవు; అరయని = తెలియని; అట్టి = అటువంటి; అర్థము = విషయము; ఒకఁడు = ఒక్కటి; ఐనను = అయినను; కల్గునే = ఉన్నదా; ఐనన్ = అయినను; నా = నా యొక్క; మదిన్ = మనసున; బెరసినన్ = కలిగిన; కోర్కిన్ = కోరికను; దేవ = దేవుడా; వినిపింతున్ = వినిపించెదను; దయా = కరుణతో కూడిన; మతిఁన్ = మనసుతో; చిత్తగింపవే = అవధరింపుము, వినుము.

భావము:

నారాయణుని భాషణములు వినిన బ్రహ్మదేవుడు ఓ పరమపదానికి ప్రభువా! పరమ యోగులు నిన్ను చేరాలని నిత్యం భావిస్తు ఉంటారు. దేవాధిదేవ! ఈ సమస్తమైన లోకము నందు నీకు తెలియని విషయం ఒక్కటైన లేదు కదా. అయినప్పటికి నా మనసులో మెదలిన కోరికను వినిపిస్తాను కృపాదృష్టితో అనుగ్రహించుము. అని విన్నవించుకుంటున్నాడు.