పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : బ్రహ్మకు ప్రసన్ను డగుట

  •  
  •  
  •  

2-246-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యానతిచ్చి “కమలజ!
యెయఁగ భవదీయమానసేప్సిత మేమై
ను నిత్తు; వేఁడు మనినను
రుహసంభవుఁడు వికచదనుం డగుచున్.

టీకా:

అని = అని; ఆనతిచ్చి = అనుగ్రహించి; కమలజ = బ్రహ్మదేవ {కమలజుడు - కమలమున పుట్టినవాడు}; ఎనయఁగన్ = తగినట్లుగ; భవదీయన్ = నీ యొక్క; మానస = మనసులోని; ఈప్సితమున్ = కోరికను; ఏమి = ఏది; ఐననున్ = అయినను; ఇత్తున్ = ఇచ్చెదను; వేఁడుము = కోరుకొనుము; అనినను = అనగా; వనరుహ = పద్మమున {వనరుహము - నీట పుట్టినది, పద్మము}; సంభవుఁడున్ = పుట్టినవాడును, బ్రహ్మదేవుడును {వనరుహసంభవ - పద్మమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; వికచ = వికసించిన; వదనుండున్ = ముఖము కలవాడు; అగుచున్ = అగుచు.

భావము:

ఆలా అనుగ్రహించిన విష్ణుమూర్తి ఇంకా ఇలా అన్నాడు. ఓ పద్మభవ! నీ మనోవాంఛితము ఏదైనా సరే, కోరుకో. కోరిన కోరికతీరుస్తాను.. అంతట బ్రహ్మదేవుని ముఖము సంతోషంతో వికసించింది.