పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : బ్రహ్మకు ప్రసన్ను డగుట

  •  
  •  
  •  

2-244-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మనఁగ మత్స్వరూపము
మను తరువునకు ఫలవితానము నే నా
ముననే జననస్థి
త్యుసంహరణము లొనర్చుచుండుదుఁ దనయా!

టీకా:

తపము = తపము; అనఁగన్ = అంటే; మత్ = నా యొక్క; స్వరూపము = స్వరూపము; తపము = తపము; అను = అను; తరువునకున్ = వృక్షమునకు; ఫల = ఫలముల; వితానమున్ = సమూహములను; నేన్ = నేనే; ఆ = ఆ; తపముననే = తపస్సు వలనే; జనన = సృష్టి; స్థితి = స్థితి; ఉపసంహరణములన్ = లయములను; ఒనర్చుచున్ = చేయుచు; ఉండుదున్ = ఉండుదును; తనయా = పుత్రా;

భావము:

పుత్రా! బ్రహ్మదేవ! తపస్సు అంటేనే నా స్వరూపం. తపస్సు అనే వృక్షానికి ఫలాన్ని నేనే. ఆ తపస్సు చేతనే సృష్టి స్థితి లయాలు సర్వం నిర్వహిస్తుంటాను. అంటు బ్రహ్మదేవునికి తపస్సు యొక్క రహస్యాన్ని నారాయణుడు వెలిబుచ్చాడు.