పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : బ్రహ్మకు ప్రసన్ను డగుట

  •  
  •  
  •  

2-241-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పట మునులకెంత కాలమునకు నైన
సంతసింప నేను లజగర్భ!
చిరతపస్సమాధిఁ జెంది విసర్గేచ్ఛ
మెలఁగు నిన్నుఁ బరిణమింతుఁ గాని.

టీకా:

కపట = కపటము కల; మునులన్ = మునులను; ఎంతన్ = ఎంత; కాలమునకున్ = కాలమునకు; ఐనన్ = అయినప్పటికిని; సంతసింపన్ = సంతోషింపను; నేనున్ = నేను; జలజగర్భ = బ్రహ్మదేవ {జలజగర్భుడు - జలజ (నీట పుట్టిన, పద్మము) అను గర్భమున పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు}; చిర = చిరకాలము చేసిన; తపస్ = తపస్సు చేయుచు; సమాధిఁన్ = సమాధిని; చెందిన్ = పొంది; విసర్గ = చక్కటి సృష్టిచేయు; ఇచ్చన్ = కోరికతో; మెలఁగు = వర్తిస్తున్న; నిన్నున్ = నిన్ను; పరిణమింతున్ = మెచ్చుదును; కాని = కాని.

భావము:

"దొంగ మునులు దొంగ తపస్సులు చేస్తుంటే ఎంత కాలానికైనా నేను వారిని అనుగ్రహించనయ్యా. ఓ పద్మసంభవ! బ్రహ్మదేవుడ! గాఢమైన తపస్సమాధి పొంది చక్కటి సృష్టి చేయాలనే సంకల్పంతో వర్తిస్తున్ననిన్ను అనుగ్రహిస్తాను అని బ్రహ్మదేవునికి సాక్షాత్కరించిన హరి అనుగ్రహించాడు.