పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : వైకుంఠపుర వర్ణనంబు

  •  
  •  
  •  

2-230.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గు సునందుండు నందుండు ర్హణుండుఁ
బ్రబలుఁడును నాది యగు నిజపార్శ్వచరులు
ఱియు వైడూర్య విద్రుమాల మృణాళ
తుల్యగాత్రులు దను భక్తితో భజింప.

టీకా:

స = చక్కటి; లలిత = మనోఙ్ఞమైన; ఇందీవర = నల్లకలువలు వంటి; శ్యామాయమాన = నల్లని రంగుతో; ఉజ్జ్వల = ప్రకాశిస్తున్న; అంగులు = దేహములు కలవారు; నవ్య = కొత్త; పీత = పచ్చని పట్టు; అంబరులున్ = వస్త్రములును; ధవళ = తెల్లని; అరవింద = పద్మముల వంటి; సుందర = అందమైన; పత్ర = దళముల వంటి; నేత్రులు = కన్నులు కలవారు; సుకుమార = సుకుమారమైన; తనులు = శరీరములు కలవారు; భాసుర = కాంతివంతమైన; విన్నూత్న = సరికొత్త; రత్న = మణులతో; విభూషణ = విశేష ఆభరణములు; గ్రైవేయ = దండలు; కంకణ = కంకణములు; హార = హారములు; కేయుర = దండ వంకీలు; మంజీర = అందెలు, నూపురములు; ధరులు = ధరించిన వారు; నిత్య = నిత్యము; యౌవనులు = యువకులుగ నుండువారు; వినిర్మల = చక్కటి నిర్మలమైన; చరితులు = ప్రవర్తన కలవారును; రోచిష్ణులునున్ = కాంతులు చిందించు వారును; హరి = విష్ణవుయొక్క; రూప = రూపమును; ధరులు = ధరించిన వారును; అగు = అయిన;
సునందుండు = సునందుడు; నందుండు = నందుడు; అర్హణుండు = అర్హణుడు; ప్రబలుఁడునున్ = ప్రబలుడును; ఆదియగు = మొదలగు; నిజ = తన; పార్శ్వచరులు = సహచరులు; మఱియున్ = ఇంకను; వైడూర్య = వైడూర్యములు {వైడూర్యములు - విడూర దేశమున పుట్టిన రత్నములు}; విద్రుమ = పగడములు; అమల = నిర్మలమైన; మృణాళ = తామర తూడులతో; తుల్య = సమానమైన; గాత్రులు = శరీరులు; తనున్ = తనను; భక్తిన్ = భక్తి; తోన్ = తో; భజింపన్ = సేవిస్తుండగ.

భావము:

విష్ణు పరిచారకులు సునందుడు, నందుడు, అర్హణుడు, ప్రబలుడు మొదలైనవారు భగవానుని భక్తితో భజిస్తున్నారు. వాళ్ళు నల్లకలువల్లాగా నీలమై నిగనిగలాడే శరీరాలతో నివ్వటిల్లుతున్నారు. పచ్చని కొంగ్రొత్త వస్తములను కట్టుకొన్నారు. తెల్లతామర రేకుల వంటి కన్నులతో శోభిల్లుతున్నారు. వారివి సుతిమెత్తని దేహాలు, వాళ్లు ధగధగలాడే రత్నాభరణాలూ, కంఠహారాలూ, కంకణాలూ, ముత్యాల సరాలూ, భుజకీర్తులూ, అందెలూ ధరించి వున్నారు. మాసిపోని యౌవనంతో భాసిస్తున్నారు. పవిత్రమైన ప్రవర్తన కలిగి వున్నారు. అందరు హరిరూపాలు ధరించి జాజ్వల్యమానంగా వెలుగొందుతున్నారు. వారు వైడూర్యాలతోటి, పగడాలతోటి, తామర తూండ్లతోటి సమానమైన శరీరాలు కలిగి వున్నారు. వారు అందరు భక్తితో శ్రీమన్నారాయణుని భజిస్తున్నారు.