పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : వైకుంఠపుర వర్ణనంబు

  •  
  •  
  •  

2-227-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సూర్యచంద్రానలస్ఫురణలఁ జొరనీక-
నిజదీధితిస్ఫూర్తి నివ్వటిల్ల
దివ్యమణిప్రభా దీపిత సౌధ వి-
మాన గోపుర హర్మ్య మండపములుఁ
బ్రసవ గుచ్ఛస్వచ్ఛరిత కామిత ఫల-
సంతాన పాదప ముదయములుఁ
గాంచన దండ సంత మారుతోద్ధూత-
రళ విచిత్ర కేనచయములు

2-227.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వికచకైరవ దళదరవింద గత మ
రందరసపాన మోదితేందిందిరప్ర
భూత మంజుల నినదప్రబుద్ధ రాజ
హంసశోభిత వరకమలాకరములు.

టీకా:

సూర్య = సూర్యుని; చంద్ర = చంద్రుని; అనల = అగ్నిల; స్పురణలఁన్ = వెలుగులను; చొరనీక = ప్రవేశించ నీయని; నిజ = తమ; దీధితి = ప్రకాశము యొక్క; స్ఫూర్తిన్ = వెలుగులు; నివ్వటిల్లన్ = అతిశయించు; దివ్య = గొప్ప; మణి = మణుల; ప్రభా = ప్రకాశము యొక్క; దీపిత = వెలుగులు నిండిన; సౌధ = సౌధములు, మేడలు; విమాన = రాజభవనములు; గోపుర = వాకిళ్ళు; హర్మ్య = హర్మ్యములు, మిద్దెఇళ్ళు; మండపములు = మండపములును; ప్రసవ = పువ్వుల; గుచ్ఛ = గుత్తులు; స్వచ్ఛ = శుభ్రముతో; భరిత = కూడిన; కామిత = కోరిన; ఫల = ఫలములిచ్చు, ఫలితములిచ్చు; సంతాన = సంతాన, నిధుల వంటి {1 సప్త సంతానములు - తటాకము, నిధి, అగ్రహారము, దేవాలయము, వనము, ప్రభందము, పుత్రుడు. 2 కల్పవృక్ష విశేషములు - ఐదు (5), మందారము, పారిజాతము, సంతానము, కల్పవృక్షము, హరి చందనము.}; పాదప = వృక్షముల; సముదాయములుఁన్ = గుంపులును; కాంచన = బంగారు; దండ = దండమునకు, కఱ్ఱకి; సంగత = కట్టబడి; మారుత = గాలికి; ఉద్ధూత = ఎత్తబడి; తరళ = చలిస్తున్న, రెపరెపలాడుతున్న; విచిత్ర = చిత్ర విచిత్ర; కేతన = జండాల; చయములు = వరుసలును;
వికచ = వికసించిన; కైరవన్ = తెల్ల కలువల; తళత్ = మెరుస్తున్న; అరవింద = పద్మముల; గత = అందలి; మరంద = మకరంద; రస = రసమును; పాన = తాగి; మోదిత = ఆనందించిన; ఇందిందిరన్ = తుమ్మెదలకి; ప్రభూత = వెలువడిన; మంజుల = ఇంపైన; నినద = నాదములతో; ప్రబుద్ధ = మేల్కొన్న; రాజహంస = రాజహంసలతో; శోభిత = శోభిస్తున్న; వర = శ్రేష్ఠమైన; కమలాకరములు = కలువకొలనులు.

భావము:

అక్కడ వైకుంఠపురంలో మేడలు, విమానాలు, గోపురాలు, మిద్దెలు, మండపాలు, దివ్యమణికాంతులతో దేదీవ్యమానంగా తేజరిల్లుతున్నాయి. ఆ దీప్తులు సూర్యచంద్రాగ్నుల తేజస్సులను చొరనీయటం లేదు. ఇంకా ఆ వైకుంఠపురంలో పూలగుత్తులతో నిండి కోరిన ఫలాలు ప్రసాదించే కల్పవృక్ష సమూహాలు ఉన్నాయి. బంగారు కఱ్ఱలకు తగిలించిన రంగు రంగుల పతాకలు గాలికి రెపరెప లాడుతున్నాయి. వికసించిన కలువల్లోనూ, కమలాల్లోనూ మకరందముం గ్రోలుతూ మధుకర బృందాలు ఆనందంతో ఝంకారం చేస్తున్నాయి. అక్కడి తటాకాలు ఆ శబ్దానికి మేల్కొన్న కలహంసలతో కనులపండువుగా శోభిస్తున్నాయి.