పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శ్రీహరి ప్రధానకర్త

  •  
  •  
  •  

2-223.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి మాయాగుణంబుల నాత్మ యోలి
బాల్య కౌమార యౌవన భావములను
సుపర్వాది మూర్తులఁ బొసి యేను
నాయదిది యను సంసారమాయఁ దగిలి.

టీకా:

భూ = భూమి; పాలక = పాలించు వారిలో; ఉత్తమ = ఉత్తముడ; భూత = జీవుల; హితుండున్ = మేలు కోరేవాడును; సుఙ్ఞాన = మంచి ఙ్ఞానమే; స్వరూపకుఁడు = తన రూపముగ కలవాడు; ఐన = అయిన; అట్టి = అట్టి; ప్రాణి = జీవి; కిన్ = కి; దేహ = శరీర; సంబంధము = సంబంధము; ఎట్లు = ఏ విధముగ; అగున్ = అగును; అన్నన్ = అంటే; మహిన్ = ప్రపంచమంతా; ఒప్పున్ = ఉండు; ఈశ్వర = ఈశ్వరుని; మాయన్ = మాయ; లేకన్ = లేకుండగ; కలుగదు = కలుగదు; నిద్ర = నిద్ర; లోనన్ = లో; కలన్ = కల; లోనన్ = లో; తోఁచినన్ = తోచిన; దేహ = దేహములతో; బంధంబులన్ = బంధంబుల; తెఱఁగున్ = విధానము; వలెను = వలెననె; హరి = విష్ణుని; యోగ = యోగ {యోగమాయ - యోగింపగల మాయ}; మాయా = మాయ యొక్క; మహత్త్వంబునన్ = ప్రభావము వలన; పాంచ = ఐదు {పాంచభౌతికము - శరీరము - దేహము - పంచ భూతములైన నీరు గాలి నిప్పు మన్ను ఆకాశము లనుండి తయారైనది.}; భౌతిక = భూతములదైన; దేహ = శరీరము; సంబంధుఁడు = సంబంధము కలవాడు; అగుచున్ = అగుచుండును; అట్టి = అట్టి;
మాయా = మాయ తోకూడిన; గుణంబులన్ = గుణముల వలన; ఆత్మ = తాను; యోలిన్ = వరుసగ; బాల్య = బాల్యము; కౌమార = కౌమారము; యౌవన = యౌవనము అను; భావములనున్ = భావములను; నర = మానవ; సుపర్వ = దేవత {సుపర్వులు - మంచి పుణ్యులు, దేవతలు}; ఆది = మొదలగు; మూర్తులఁన్ = ఆకారములను; బొరసిన్ = పొందును; ఏను = నేను; నాయది = నాది; ఇదిన్ = ఇది; అను = అనే; సంసార = సంసారము యొక్క; మాయఁన్ = మాయలో; తగిలి = తగుల్కొని, పడి.

భావము:

“ఓ రాజశ్రేష్ఠుడ! జీవుడు భూతాలకెల్ల మేలు చేకూర్చేవాడు, జ్ఞానమే స్వరూపంగా కలవాడు, అలాంటి వానికి శరీరంతో సంబంధం ఎలా కలిగింది అంటావా జగతీతల మంతా వ్యాపించివున్న ఈశ్వరుని మాయ అనేది లేకపోతే జీవునికి దేహంతో సంబంధం కలుగదు. నిద్రించే వేళ స్వప్నంలో దేహాలతో సంబంధం గోచరిస్తుదికదా, అలాగే నారాయణుని యోగమాయా ప్రభావంవల్ల జీవుడు పంచభూతాలతో కూడిన దేహంతో సంబంధం కలవాడవుతాడు. ఆ మాయాగుణాలవల్లనే క్రమంగా బాల్యం, కౌమారం, యౌవనం అనే దశలు పొందుతాడు. మనుష్య, దేవతాది ఆకారాలను గూడ స్వీకరిస్తాడు. నేను అనే అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని పెంచుకొంటాడు. సంసారమాయలో బద్దుడవుతాడు.