పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : ప్రపంచాది ప్రశ్నంబు

  •  
  •  
  •  

2-221.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నా పరంజ్యోతి యైన పద్మాక్షునకును
లినజునకుఁ బ్రతీకవిన్యాసభావ
తులవలనను భేదంబు లదె? చెపుమ;
తిదయాసాంద్ర! యోగికులాబ్ధిచంద్ర!

టీకా:

ఎవ్వని = ఎవని; నాభిన్ = బొడ్డు; అందున్ = అందు; ఎల్లన్ = సమస్త; లోకన్ = లోకముల; అంగన్ = భాగముల; సంస్థాన = స్థితికి; కారణన = కారణము అయిన; పంకజంబున్ = పద్మము {పంకజము - పంక (బురద) లో జ (పుట్టినది), పద్మము}; ఒడమెన్ = పుట్టినదో; అందున్ = దానిలో; ఉదయించి = పుట్టి; సర్వ = అన్ని; అవయవ = అవయవములు; స్ఫూర్తిన్ = వ్యక్తమగుచు; తనరారునట్టి = ఒప్పి ఉన్నట్టి; పితామహుడు = తాత, బ్రహ్మ; కడఁగి = సంకల్పించి; ఎవ్వని = ఎవని; అనుగ్రహంబునన్ = దయ వలన; నిఖిల = సమస్తమైన; భూతములన్ = జీవులను; సృజించెన్ = సృష్టంచెనో; ఉత్కంఠన్ = ఉత్సాహము; తోడన్ = తో; అట్టి = అటువంటి; విధాతన్ = బ్రహ్మ; ఏ = ఏ; అనువునన్ = సులువున; సర్వేశున్ = విష్ణుని {సర్వేశుడు - సర్వమునకు అధిపతి, భగవంతుడు}; రూపంబున్ = ఆకారమును; కనుఁగొనెన్ = చూడగలిగెనో; రుచిర = ప్రకాశము; భంగి = వంటి; ఆ = ఆ;
పరంజ్యోతి = ఉత్కృష్టజ్యోతిస్వరూపము; ఐన = అయిన; పద్మాక్షున్ = పద్మాక్షున {పద్మాక్షుడు - పద్మా (పద్మమముల) వంటి అక్షుడు) కన్నులున్న వాడు, విష్ణువు}; కున్ = కు; నలినజున్ = పద్మసంభవున {నలినజుడు - నలిన (పద్మము) నందు జుడు (పుట్టిన వాడు), బ్రహ్మ}; కున్ = కు; ప్రతీక = ఆకారమును; విన్యాస = ప్రవర్తనలు; భావ = భావములు; గతులన్ = విధానములు; వలననున్ = విషయములో; భేదంబున్ = తేడా; కలదే = ఉన్నదా; చెపుమ = తెలుపుము; అతి = మిక్కిలి; దయ = కృప; సాంద్ర = దట్టముగ కలవాడా; యోగి = యోగుల; కులన్ = సమూహము అను; అబ్ధి = సముద్రమునకు; చంద్ర = చంద్రుని వంటి వాడా.

భావము:

పరంజ్యోతి స్వరూపుడైన పద్మాక్షుడి నాభిలో సమస్తలోకాల ఉనికికీ హేతువైన పద్మం పుట్టింది, ఆ పద్మంలో, ప్రభవించి సర్వాంగ సుందరంగా ప్రకాశించే బ్రహ్మ ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఔత్సుక్యంతో సమస్త ప్రాణులనూ సృష్టించాడు. మరి ఆ బ్రహ్మ సర్వేశ్వరుని స్వరూపాన్ని ఏ విధంగా సాక్షాత్కరింప జేసుకొన్నాడు? అలాంటి పద్మాక్షుడికీ, బ్రహ్మదేవునికి అవయవ నిన్యాసంలోను, భావగతిలోను భేదమున్నదా? ఓ పరమకరుణాసాంద్ర! యోగికుల జలధిచంద్ర! నాకు తెలియజెప్పవయ్యా.