పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : ప్రపంచాది ప్రశ్నంబు

  •  
  •  
  •  

2-220-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుంగాక సకలభూతసంసర్గశూన్యంబైన యాత్మకు భూతసంసర్గం బే ప్రకారంబునం గలిగె; నది నిర్నిమిత్తత్వంబునం జేసియో కర్మంబునం జేసియో యాక్రమంబు నా కెఱింగింపుము.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండ; సకల = సమస్త (మహా); భూత = భూతములతోను; సంసర్గ = సంబంధము; శూన్యంబున్ = లేనిది; ఐన = అయిన; ఆత్మ = ఆత్మ; కున్ = కు; భూత = భూతములతో; సంసర్గంబున్ = సంబంధము; ఏ = ఏ; ప్రకారంబునన్ = విధముగ; కలిగెన్ = కలిగెను; అది = అది; నిర్నిమిత్త = అకారణ; తత్వంబునన్ = లక్షణము; చేసియో = వలననో; కర్మంబునన్ = కర్మల కారణము; చేసియో = వలననో; ఆ = ఆ; క్రమంబున్ = విధమును; నాకున్ = నాకు; ఎఱింగింపుము = తెలుపుము.

భావము:

అంతేకాదు, సమస్త భూతాలతోటి కలయిక లేని ఆత్మకు అసలు ఆ భూతాలతో సాంగత్యం ఎలా కలిగింది. అది అకారణంగా కలిగిందా? లేక, కర్మవల్ల కలిగిందా? ఆ వైనం నాకు వివరించు.