పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : ప్రపంచాది ప్రశ్నంబు

  •  
  •  
  •  

2-219-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రితోదగ్రనిదాఘతప్తు డగు నప్పాంథుం డరణ్యాది సం
ణక్లేశసముద్భవం బగు పిపాసం జెంది యాత్మీయ మం
దిముం జేరి గతశ్రముం డగుచు నెందేనిం జనంబోని భం
గి మాధీశుపదారవిందయుగ సంగీభూతుఁడై మానునే?

టీకా:

భరిత = చెలరేగిన; ఉదగ్ర = భయంకరమైన; నిదాఘ = ఎండ వేడిమిచేత; తప్తుడు = తపించిపొతున్న వాడు; అగు = అయిన; ఆ = ఆ; పాంథుండు = బాటసారి; అరణ్య = అరణ్యములు; ఆది = మొదలైన వానిలో; సంచరణ = తిరుగుతున్న; క్లేశ = శ్రమ; సముద్భవంబున్ = కలిగినది; అగు = అయిన; పిపాసన్ = దాహమును; చెంది = పొంది; ఆత్మీయ = స్వంత; మందిరమున్ = ఇంటిని; చేరి = చేరి; గత = పోయిన; శ్రముండు = శ్రమ కలవాడు; అగుచున్ = అవుతు; ఎందు = ఎక్కడకు; ఏని = అయినాసరే; చనంబోని = వెళ్ళని; భంగిన్ = విధముగ; రమాధీశు = లక్ష్మీపతి {రమాధీశుడు - రమ (లక్ష్మీదేవి) అధీశుడు (భర్త), విష్ణువు}; పద = పాదములు అను; అరవింద = పద్మముల; యుగ = జంట; సంగీ = సంబంధము; భూతుఁడు = కలిగినవాడు; ఐ = అయి; మానునే = వదలుతాడా ఏమిటి.

భావము:

అడవులందు సంచరిస్తు, వేసవి మండుటెండల తాపానికి పరితాపం చెందిన బాటసారి బడలి దాహంతో చివరికి తన యిల్లు చేరుకొంటాడు. అక్కడ హాయిగా అలసట తీర్చుకొంటాడు. అక్కడినుండి మళ్ళీ ఎక్కడికీ కదలడు. అలాగే రమాకాంతుని చరణకమల ద్వంద్వంతో సంబంధం కలిగి ఆ ఆనందం చవి చూచినవాడు మళ్లీ దాన్ని వదలడు.