పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : భాగవత వైభవంబు

  •  
  •  
  •  

2-208-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లయిన నప్పుణ్యాత్ముల ననవద్యశీలుర నవిద్య లజ్జావనత వదనయై పొందంజాలక వైముఖ్యంబున దవ్వుదవ్వులం దలంగిపోవు మఱియును.

టీకా:

అట్లు = ఆ విధముగ; అయినన్ = చేసినచో; ఆ = అట్టి; పుణ్యాత్ములన్ = పుణ్యాత్ములను; అనవద్య = నింద్యము కాని; శీలురన్ = ప్రవర్తన కలవారిని; అవిద్య = అవిద్య, మాయ, అజ్ఞానము; లజ్జ = సిగ్గుతో; అవనత = వంచిన; వదన = ముఖము (తల) కలది; ఐ = అయి; పొందన్ = దరి; చాలక = చేరలేక; వైముఖ్యంబునన్ = విముఖము కలదై; దవ్వుదవ్వులన్ = దూరందూరంగా; తలంగిన్ = తొలగి; పోవున్ = పోవును; మఱియును = ఇంకను.

భావము:

ఎవరైతే పరమాత్ముని తమ చిత్తంలో ప్రతిష్ఠించుకొంటారో, అట్టి పుణ్యాత్ములు, సచ్చరిత్రులు అయిన మహనీయుల చెంతకు పోలేక అవిద్య సిగ్గుతో తల వంచుకొని పెడమొగమై దూరందూరంగా తొలగి పోతుంది. ఇంతేకాదు.